ప్రశ్న
స్వలింగ సంయోగమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? స్వలింగ సంయోగం పాపమా?
జవాబు
స్వలింగ సంయోగం పాపం అని బైబిల్ తరచుగా మనకు చెబుతుంది (ఆది. 19:1-13; లేవీ. 18:22; రోమా. 1:26-27; 1 కొరింథీ. 6:9). స్వలింగ సంయోగం దేవుని తిరస్కరించుటకు మరియు ఆయన మాట వినకపోవుటకు పరిణామం అని రోమా. 1:26-27 బోధిస్తుంది. ప్రజలు పాపము మరియు అవిశ్వాసంలో కొనసాగినప్పుడు, దేవునికి వేరుగా ఉండు జీవితం యొక్క వ్యర్థత మరియు నిరాశను చూపించుటకు, దేవుడు మరింత దుష్టమైన మరియు తుచ్ఛమైన అభిలాషలకు “వారిని అప్పగించాడు.” స్వలింగ సంయోగంలో పాల్గొను “దోషులు” పరలోక రాజ్యం చేరలేరని 1 కొరింథీ. 6:9 ప్రకటిస్తుంది.
దేవుడు ఒక వ్యక్తిని స్వలింగ సంయోగ వాంఛతో సృష్టించడు. ప్రజలు తమ పాపము వలన (రోమా. 1:24-27) మరియు తుదకు తమ సొంత నిర్ణయాల వలన స్వలింగ సంయోగులు అవుతారని బైబిల్ చెబుతుంది. కొంత మంది ఎక్కువ హింస మరియు ఇతర పాపముల పట్ల బలహీనులై జన్మించునట్లు, ఒక వ్యక్తి స్వలింగ సంయోగం పట్ల గొప్ప బలహీనతతో జన్మించవచ్చు. కాని ఆ వ్యక్తి పాపపు ఆశల వలన పాపము చేయుటను అది సమర్థించదు. ఒక వ్యక్తి కోపం/క్రోధం పట్ల గొప్ప బలహీనతతో జన్మించినయెడల, ఆ వ్యక్తి ఆ ఆశలకు తలొగ్గినయెడల అది సరైన విషయమేనా? ఖచ్చితంగా కాదు! స్వలింగ సంయోగం కూడా అంతే.
ఏదిఏమైనా, స్వలింగ సంయోగము ఇతర పాపముల కంటే “గొప్ప” పాపమని బైబిల్ వివరించదు. ప్రతి పాపము దేవునికి నచ్చనిదే. స్వలింగ సంయోగం కూడా 1 కొరింథీ. 6:9-10లో వర్ణించబడిన ఒక వ్యక్తిని దేవుని రాజ్యము నుండి దూరం చేయు పాపములలో ఒకటి. బైబిల్ ప్రకారం, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, దొంగలకు మరియు ఇతరులకు ఏ విధంగా దేవుని క్షమాపణ దొరుకుతుందో, అలాగే స్వలింగ సంయోగులకు కూడా దొరుకుతుంది. రక్షణ కొరకు యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివారికి పాపము మీద, స్వలింగ సంయోగం మీద కూడా, జయమును పొందుటకు దేవుడు శక్తిని ఇస్తాడు (1 కొరింథీ. 6:11; 2 కొరింథీ. 5:17; ఫిలిప్పీ. 4:13).
English
స్వలింగ సంయోగమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? స్వలింగ సంయోగం పాపమా?