ప్రశ్న
తెలివైన రూపకల్పన సిద్ధాంతం అనగా ఏమిటి?
జవాబు
తెలివైన రూపకల్పన సిద్ధాంతము సంక్లిష్ట, గొప్ప సమాచార జీవశాస్త్ర నిర్మాణాలను వివరించుటకు అవసరమైన తెలివైన కారణాలు మరియు ఈ కారణాలు ఆమోదయోగ్యముగా గుర్తించదగినవి అని చెప్పును. నిర్దిష్ట జీవశాస్త్ర లక్షణాలు డార్విన్ యాదృచ్చిక అవకాశ వివరణ ప్రమాణాలను వ్యతిరేకించును, ఎందుకంటే అవి రూపకల్పన చేయబడినట్లు కనబడును. రూపకల్పన తార్కికంగా ఒక తెలివైన కల్పనచేయువాని అవసరత కలిగియుండడం వలన, ఒక కల్పనచేయువానికి రూపకల్పన ఉదాహరణ ప్రదర్శన ఆధారముగానుండెను. తెలివైన రూపకల్పన సిద్ధాంతములో మూడు ప్రాధమిక వాదనలు ఉండెను: 1) తగ్గించ వీలుకాని సంక్లిష్టత, 2) పేర్కొన్న సంక్లిష్టత, మరియు 3) సంబంధ సిద్ధాంతము.
తగ్గించ వీలుకాని సంక్లిష్టత “. . . చాలా బాగుగా సరిపోలిన పరస్పర భాగాలు కలిగియుండి ఒక ప్రాధమిక క్రియకు కారణమయ్యే ఒక వ్యవస్థ, ఎక్కడైతే ఏఒక్క భాగము తీసివేసిన అది ఆ క్రియ నిలుపుదలను ప్రభావితం చేయును” అని నిర్వచింపబడును. సులువుగా చెప్తే, జీవితము ఉపయోగకరముగా ఉండుటకు అవిభక్త భాగాలు ఒక దానిపై మరొకటి ఆధారపడును. యాదృచ్చిక పరస్పరమార్పు ఒక క్రొత్త భాగ అభివృద్ధికి తోడ్పడును, కాని ఇది ఒక క్రియా వ్యవస్థకు అవసరమైన రకరకాల భాగాల ఉభయ అభివృద్ధికి తోడ్పడదు. ఉదాహరణకు, మానవుని నేత్రము ఖచ్చితముగా చాలా ఉపయోగకరమైన ఒక వ్యవస్థ. కనుగుడ్డు లేకుండా దృష్టి నాడి, మరియు దృష్టి వల్కలం, ఒక యాధృచ్చిక పరస్పర అసంపూర్ణ నేత్రము ఒక జాతి మనుగడకు నిజముగా ప్రతికూలము మరియు సహజ ఎంపిక పద్ధతి ద్వారా అందువలన తొలగించబడును. ఒక నేత్రము దాని భాగాలన్నియు కలిగి మరియు ఒకే సమయంలో సరిగా పనిచేస్తే తప్ప ఆ వ్యవస్థ పనికిరాదు.
పేర్కొన్న సంక్లిష్టత, జీవుల నమూనాలలో పేర్కొన్న సంక్లిష్టత కనుగొనబడడం వలన, వారి మూలమునకు ఏదో ఒక రకమైన మార్గదర్శము ఉండునని పరిగణించబడును అని చెప్పే విషయము. పేర్కొన్న సంక్లిష్ట వాదన ఒక సంక్లిష్ట నమూనా యాదృచ్చికమైన పద్ధతి ద్వారా అభివృద్ధి చెoదుట అసాధ్యమని ప్రకటించును. ఉదాహరణకు, 100 కోతులు మరియు 100 కంప్యూటర్లతో నిండియున్న ఒక గది చివరికి కొన్ని పదాలను, లేక కనీసం ఒక వాక్యమును ఉత్పత్తి చేయును, కాని అది ఎప్పటికీ ఒక Shakespearean రచన కాలేదు. మరియు ఒక Shakespearean రచన కంటే జీవసంబంధ జీవితము ఎంత సంక్లిష్టమైనది?
సంబంధ సిద్ధాంతము ప్రపంచము మరియు విశ్వము “శ్రేష్ఠముగా-సమ్మతించబడి” భూమిపై జీవితము కొరకు అనుమతించును అని చెప్పును. ఒకవేళ భూమియొక్క గాలి మూలకాల నిష్పత్తి కొద్దిగా మార్చితే, చాలా జీవులు త్వరితముగా తమ ఉనికిని నిలుపుచేయును. ఒకవేళ భూమి సూర్యునికి కొన్ని మైళ్ల దగ్గరగా లేక ఇంకా కొంచం దూరముగా ఉంటే, చాలా జీవులు ఉనికి ఆగిపోవును. భూమిపై జీవితము యొక్క ఉనికి మరియు అభివృద్ధి అవసరమైనది చాలా మూలకాలు కచ్చితమైన సమ్మతంలో వుండి అది ఆ మూలకాలన్నిటికీ సమన్వయములేని యాదృచ్చిక సంఘటనలు వచ్చుట అసాధ్యముగా ఉండును.
తెలివైన రూపకల్పన సిద్ధాంతము తెలివికి మూలమును ముందుగా గుర్తించకుండా (అది దేవుడా లేక UFO వలె లేక మరిఏదైనా అని), తెలివైన రూపకల్పన సిద్ధాంతకర్తలలో అత్యధికులు ఆస్తికులు.వారు రూపకల్పన ప్రదర్శన జీవశాస్త్ర ప్రపంచము దేవుని ఉనికికి ఆధారముగా చూచును. అయితే, కొద్ది మంది నాస్తికులు రూపకల్పనకు బలమైన ఆధారమును ఖండించలేరు, కాని సృష్టికర్తయైన దేవుని గుర్తించుటకు ఇష్టపడరు. వారు సమాచారమును భూమి ఏదో రకమైన కొద్ది జాతుల గ్రహాంతర జీవులు విత్తబడెనని ఆధారముగా ఉండును. అయినప్పటికీ, వారు గ్రహాంతర జీవుల మూలమును చెప్పకపోయినా, అందువలన విశ్వసనీయ సమాధానము లేకుండా మొదటి వాదనకు తిరిగి వెళ్లెను.
తెలివైన రూపకల్పన సిద్ధాంతము బైబిలుసంబంధమైన సృష్టివాదం కాదు. రెండు స్థానాలకు మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉండెను. బైబిలు సంబంధమైన సృష్టివాదులు బైబిలు సంబంధమైన సృష్టి పరిమాణం ఆధారపడతగినది మరియు సరియైనది -భూమిపై జీవితము ఒక తెలివైన ప్రతినిధి- దేవునిచే రూపకల్పన చేయబడెనని అనే ముగింపుతో ప్రారంభమగును. వారు అప్పుడు ఈ ముగింపును ప్రోత్సహించే సహజ విధానములో ఆధారము కొరకు చూచెను. తెలివైన రూపకల్పన సిద్ధాంతకర్తలు సహజ విధానంలో ప్రారంభించి మరియు భూమిపై జీవితము ఒక తెలివైన ప్రతినిధిచే (అది ఎవరైనా) రూపకల్పన చేయబడెనని ముగింపునకు చేరుకొనెను.
English
తెలివైన రూపకల్పన సిద్ధాంతం అనగా ఏమిటి?