ప్రశ్న
వేరే తెగల వారితో వివాహమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
జవాబు
జాత్యాంతర వివాహములు చేసుకొనవద్దని పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించింది (ద్వితీ. 7:3–4). అయితే, ఈ ఆజ్ఞకు కారణం చర్మం యొక్క రంగు లేక వారి జాతి కాదు. అది మతమునకు సంబంధించినది. జాత్యాంతర వివాహాలకు విరోధంగా యూదులను దేవుడు ఆజ్ఞ ఇవ్వడానికి కారణం, ఇతర జాతుల వారు అబద్ధ దేవతలను ఆరాధించువారు కాబట్టి. ఇశ్రాయేలీయులు విగ్రహరాధికులను, అన్యులను వివాహం చేసుకున్నయెడల, వారు దేవుని నుండి దూరంగా నడిపించబడతారు. మలకీ 2:11 ప్రకారం ఇశ్రాయేలులో ఇదే జరిగింది.
అదే విధమైన ఆత్మీయ శుద్ధత క్రొత్త నిబంధనలో కూడా ఇవ్వబడినది, కాని దానికి జాతితో నిమిత్తం లేదు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?” (2 కొరింథీ. 6:14). ఏ విధంగా అయితే విగ్రహారాధికులను వివాహం చేసుకొనకూడదని ఇశ్రాయేలీయులకు (ఒకే సత్య దేవుని నమ్మువారు) ఆజ్ఞ ఇవ్వబడిందో, అలాగే అవిశ్వాసులను వివాహం చేసుకొనకూడదని క్రైస్తవులకు (ఒకే సత్య దేవుని నమ్మువారు) ఆజ్ఞాపించబడినది. జాత్యాంతర వివాహం తప్పు అని బైబిల్ ఎన్నడు చెప్పుట లేదు. జాత్యాంతర వివాహమును తిరస్కరించువాడు బైబిల్ అధికారం లేకుండా అలా చేస్తున్నాడు.
మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చెప్పినట్లు, ఒక వ్యక్తికి తన స్వభావం ఆధారంగా తీర్పుతీర్చాలని గాని, చర్మం యొక్క రంగు ఆధారంగా కాదు. జాతి పరంగా పక్షపాతమునకు బైబిల్ లో ఎక్కడా కూడా చోటు లేదు (యాకోబు 2:1–10). వాస్తవానికి, బైబిల్ ఆలోచన ఏమిటంటే ఒకే జాతి ఉంది – మానవ జాతి, ప్రతి ఒక్కరు ఆదాము హవ్వల నుండి వచ్చినవారే. ఒక జీవన సహాయమును వెదకునప్పుడు, ఆ వ్యక్తి యేసు క్రీస్తు నందు విశ్వాసం ద్వారా తిరిగి జన్మించెనో లేదో క్రైస్తవుడు మొదట చూడాలి (యోహాను 3:3–5). క్రీస్తునందు విశ్వాసం, చర్మం యొక్క రంగు కాదు, సాటియైన సహాయమును ఎన్నుకొనుటకు బైబిల్ కొలత. జాత్యాంతర వివాహం అనునది తప్పా లేక ఒప్పా అని కాదు, కాని అది వివేకం, జ్ఞానం, మరియు ప్రార్థనకు సంబంధించినది.
వివాహం చేసుకోవాలని ఆశించుచున్న దంపతులు అనేక విషయములను పరీక్షించాలి. చర్మము యొక్క రంగును నిర్లక్ష్యం చేయకపోయినప్పటికీ, ఒక దంపతులు వివాహం చేసుకొనుటకు అది నిర్థారణ అంశం కాకూడదు. జాత్యాంతర దంపతులు బేధమును మరియు అవమానమును ఎదుర్కొనవచ్చు, కాని దానికి వారు బైబిల్ పరంగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు సిద్ధంగా ఉండాలి. “యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థన చేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైయున్నాడు” (రోమా. 10:12). చర్మపు రంగును చూడని సంఘము మరియు/లేక జాత్యాంతర వివాహము క్రీస్తులోని ఐక్యతకు ఒక బలమైన ఉదాహరణ కాగలదు.
English
వేరే తెగల వారితో వివాహమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?