ప్రశ్న
దేవుడు వాస్తవమైనవాడా? దేవుడు వాస్తవమైనవాడని నేను ఎలా తెలుసుకోగలను?
జవాబు
దేవుడు వాస్తవమైన వాడని మనకు తెలుసు ఎందుకంటే ఆయన మూడు విధాలుగా మనకు బయలుపరచుకున్నాడు: సృష్టి ద్వారా, తన వాక్యము ద్వారా, మరియు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా.
దేవుని ఉనికికి గల మామూలు ఆధారము ఆయన చేసినదే అయి ఉంది. “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా. 1:20). “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” (కీర్తన. 19:1).
ఒకవేళ ఏదైనా ఒక పొలము మధ్యలో ఒక చేతి గడియారాన్ని మీరు కనుగొంటే, అది శూన్యం నుండి అలా “ప్రత్యక్షమైంది” అనో లేదా అది అక్కడే ఎప్పుడు నుండో ఉన్నదనో మీరు అనుకోరు. ఆ గడియారం యొక్క రూపాన్ని బట్టి దానికి ఒక రూపకర్త ఉన్నాడని మీరు అనుకుంటారు. కాని మన చుట్టూ కూడా మిక్కిలి గొప్పదైన రూపము మరియు ఖచ్చితత్వము ఉన్నాయి. మనము సమయమును కొలిచేది మన చేతిగడియారముల మీద ఆధారపడి కాదు, కాని దేవుని చేతి పనియైన భూమి యొక్క నిత్యకృత్యమైన భ్రమణమును (మరియు సీసియం 133 అనే అణువు యొక్క రేడియోధార్మిక లక్షణములను) ఆధారము చేసికొని. ఈ విశ్వము గొప్ప రూపాన్ని చూపుతుంది, మరియు ఇది ఒక గొప్ప రూపకర్త ఉన్నాడని వాదిస్తుంది.
ఒకవేళ మీరు ఏదైనా సంకేత భాషలో ఉన్న సందేశాన్ని కనుగొంటే, ఆ సంకేతాలను విప్పుటకు ప్రయత్నిస్తారు. ఈ సందేశమును పంపిన తెలివైన పంపకుడు ఒకడు ఉన్నాడని, ఆ సంకేతాలను సృష్టించినవాడు ఉన్నాడని మీరు అనుకుంటారు. మన శరీరములలోని ప్రతి కణములో మనము మోసే DNA “సంకేతము” ఎంతటి సంక్లిష్టమైనది? ఈ DNA యొక్క సంక్లిష్టత మరియు ఉద్దేశ్యము ఆ సంకేతమును వ్రాసిన ఒక తెలివైన రచయితను సూచించుట లేదా?
దేవుడు జటిలమైన మరియు బాగుగా శృతి చేయబడిన భౌతిక ప్రపంచమును సృష్టించడమే కాదు; ప్రతి ఒక్కరి హృదయములో నిత్యత్వమును గూర్చిన ఒక ఆలోచనను కూడా నేర్పాడు (ప్రసంగి 3:11). మన కంటికి కనబడే దాని కంటే జీవితమునకు ఎక్కువైనది ఎదో ఉందని, ఈ భూమిపై జరిగే దినచర్య కంటే ఉన్నతమైన మనుగడ ఎదో ఉందని మానవాళికి ఒక అంతర్గత ఆలోచన ఉంది. నిత్యత్వమును గూర్చిన మన భావన రెండు విధాలుగా తేటపడుతుంది: చట్టముల నిర్మాణం మరియు ఆరాధన.
చరిత్ర అంతటిలో గల అనేక నాగరికతలు కొన్ని నైతిక చట్టములను గణ్యము చేశారు, ఇవి ఆశ్చర్యకరంగా ఒక సంస్కృతి నుండి ఇంకొక సంస్కృతితో పోలిస్తే ఒకే విధంగా ఉన్నటువంటివి. ఉదాహరణకు, ప్రేమ అనే ఆదర్శము విశ్వవ్యాప్తంగా గణ్యము చేయబడినది, కాని అబద్ధం అనే కార్యం విశ్వవ్యాప్తంగా ఖండించబడినది. ఈ సామాన్యమైన నైతికత –తప్పు ఒప్పులు గూర్చిన ఈ విశ్వ జ్ఞానం – మనకు ఇట్టి ఆలోచనలను ఇచ్చిన ఒక ఉన్నతమైన నైతిక వ్యక్తిని సూచిస్తుంది.
అదే విధంగా, సంస్కృతులకు అతీతంగా ప్రపంచవ్యాప్త ప్రజలు ఒక విధమైన ఆరాధన విధానాన్ని అలవర్చుకున్నారు. ఆ ఆరాధన యొక్క వస్తువు మారవచ్చు, కాని మానవునిగా ఉండుటకు “ఉన్నత శక్తి” ఒకటి ఉంది అనే ఆలోచన తిరస్కరించలేని భాగము. ఆరాధించుటకు గల మన వాంఛ దేవుడు మనలను “తన పోలికలో” చేశాడు అనుదానితో అనునయిస్తుంది (ఆది. 1:27).
దేవుడు తన వాక్యమైన పరిశుద్ధ గ్రంధము ద్వారా కూడా తనను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. లేఖనముల అంతటిలో దేవుని యొక్క ఉనికి అనునది స్వయం-ఆధారిత వాస్తవముగా ఉంది (ఆది. 1:1; నిర్గమ. 3:14). మనిషి స్వీయచరిత్రను వ్రాసేటప్పుడు, తన సొంత ఉనికిని నిరూపించుకొనుటలో సమయాన్ని వృద్ధా చేయడు. అలాగే, దేవుడు తన పుస్తకములో ఆయన ఉనికిని నిరూపించుకుంటూ కాలయాపన చేయడు. పరిశుద్ధ గ్రంధము యొక్క జీవితములను మార్చే గుణం, దాని యదార్ధత, మరియు దాని వ్రాయుటలో కలిసి వచ్చిన అనేకమైన సూచక క్రియలు ఒక లోతైన దృష్టికిఉత్తరువుగా ఉన్నాయి.
దేవుడు తనను మనకు ప్రత్యక్షపరచుకున్న మూడవ విధానం యేసుక్రీస్తు అనే తన కుమారుని ద్వారా (యోహాను 14:6-11). “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను 1:1, 14; కొలస్సీ. 2:9 కూడా చూడండి).
ఆశ్చర్యకరమైన యేసు జీవితంలో ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా అనుసరించాడు మరియు మెస్సియను గూర్చిన ప్రవచనములను కూడా నెరవేర్చాడు (మత్తయి 5:17). తన సందేశమును అధీకృతం చేసి తన దైవత్వమునకు సాక్ష్యముగా దయగల అనేక కార్యములను మరియు బహిరంగ సూచనలను జరిగించాడు (యోహాను 21:24-25). అప్పుడు, తన శిలువ మరణమునకు మూడు దినములు తరువాత, మృతులలో నుండి ఆయన లేచాడు, ఈ వాస్తవం అనేకమంది ప్రత్యక్షసాక్షుల ద్వారా నిరూపించబడింది (1 కొరింథీ. 15:6). యేసు ఎవరు అనే విషయంపై చారిత్రక కథనాలు చాలా “ఋజువులతో” నిండి ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు” (అపొ.కా. 26:26).
దేవుని గురించి సొంత ఆలోచనలు కలిగియుండి ఆధారములను వారికి అనుగుణ్యంగా చదివే సంశయవాదులు ఎప్పుడు ఉంటారని మనం గ్రహించాము. మరియు కొంత మంది ఉంటారు వారిని ఎట్టి ఋజువులు కూడా ఒప్పుకొనేటట్లు చేయలేవు (కీర్తన. 14:1). ఇది అంతయు విశ్వాసము ద్వారానే జరుగుతుంది (హెబ్రీ. 11:6).
English
దేవుడు వాస్తవమైనవాడా? దేవుడు వాస్తవమైనవాడని నేను ఎలా తెలుసుకోగలను?