ప్రశ్న
క్రీస్తు న్యాయపీఠం ఏది?
జవాబు
రోమా 14:10-12 చెప్తుంది, “మనందరము దేవుని న్యాయపీఠము యెదుట నిలుతుము. . .గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” రెండవ కొరింథీ 5:10 మనకు ఎ విధంగా చెప్తుంది, “ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము యెదుట ప్రత్యక్షము కావలయును.” సందర్భంలో, ఈ రెండు వాక్యభాగాలు క్రైస్తవులను గూర్చి మాట్లాడుతున్నాయే తప్ప, అవిశ్వాసుల గురించి కాదు. అందుచేత, దేవుని న్యాయపీఠములో విశ్వాసులు తమ జీవితాల గురించి లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. క్రీస్తు న్యాయపీఠము రక్షణను నిర్ణయించదు; అది మనకొరకు క్రీస్తు బలి చేత (యోహాను 3:16) మరియు ఆయన యందు మనకున్న విశ్వాసము చేత నిర్ణయించబడుతుంది (1 యోహాను 2:2). క్రీస్తు న్యాయపీఠము దేవుడు మన పాపములకు తీర్పుతీర్చు విధంగా మనం చూడకూడదు, కానీ మన జీవితం కొరకు దేవుని బహుమానం ఇస్తున్న విధంగా చూడాలి. అవును, బైబిల్ చెప్పినట్లుగా, మనమ జరిగించిన క్రియల చొప్పున లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దీనిలో కొంత మనం జరిగించిన పాపములకు సమాధానం చెప్పవలసిందిగా ఉంది. అయితే, క్రీస్తు న్యాయపీఠము యొక్క ప్రధమ కారణం అది కాదు.
క్రీస్తు న్యాయపీఠము యెదుట విశ్వాసులు ఎంత విశ్వాసంతో దేవునికి సేవ చేసారో అనుదానికి ఆధారంగా బహుమానం ఇవ్వబడుతుంది (1 కొరింథీ 9:4-27; 2 తిమోతి 2:5). మనం గొప్ప అప్పగింపుకు (Great Commission) ఎంత మంచిగా విధేయత చూపాము (మత్తయి 28:18-20), మన పాపములపై ఎంత విజయం పొందాము (రోమా 6:1-4), మరియు మన నాలుకలను ఎంత నియంత్రణలో ఉంచాము (యాకోబు 3:1-9) అను వాటిపై ఆధారపడి కొన్ని విషయాలు తీర్పు తీర్చబడతాయి. వారు క్రీస్తు యందు విశ్వసంతో ఎంత మంచిగా విధేయత చూపారన్న ఆధారంపై వివిధ పనులకు విశ్వాసులు బహుమతి అందుకొంటారని బైబిల్ మాట్లాడుతుంది ( 1 కొరింథీ 9:4-27; 2 తిమోతి 2:5). అనేక రకములైన కిరీటాలు 2 తిమోతి 2:5, 2 తిమోతి 4:8, యాకోబు 1:12, 1 పేతురు 5:4 మరియు ప్రకటన 2:10 లో వివరించబడింది. క్రీస్తు న్యాయపీఠము గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తాము అన్నదానికి యాకోబు 1:12 మంచి సారంశము: “శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.”
English
క్రీస్తు న్యాయపీఠం ఏది?