ప్రశ్న
ఒకవేళ అది పాపం అని నాకు ఎలా తెలుస్తుంది?
జవాబు
ఈ ప్రశ్నలో మూడు సమస్యలు ఇమిడి ఉన్నాయి, బైబిల్ ప్రత్యేకంగా పాపము అని తెలియజేసే విషయాలు మరియు బైబిల్ ఖచ్చితంగా చెప్పని పాపాలు. వివిధ పాపముల జాబితా వాక్యభాగాలలో ఉన్నాయి సామెతలు 6:16-19, గలతీ. 5:19-21, మరియు 1 కొరింథీ 6:9-10. ఈ వాక్యభాగాలు దేవుడు ఆమోదించని పాప కార్యాలను గూర్చి చెప్పుతుందనడంలో అనుమానం లేదు. హత్య, వ్యభిచారం, అబద్ధం, దొంగతనం, మొదలగునవి. – బైబిల్ ఇటువంటి విషయాలను పాపంగా చెప్తుందనడంలో సందేహం లేదు. బైబిల్ ఖచ్చితంగా ఇది పాపం అని నిరూపించని వాటిని పాపం అని నిరూపించుట అనేది ఒక కష్టమైన సమస్య. బైబిల్ ఇలాటి ఒక ప్రత్యేకమైన అంశమును గూర్చి వివరించకపోతే, వాక్యములో మనలను నడిపించుటకు కొన్ని సహజమైన నియమాలు ఉన్నాయి.
మొదట, ఒక ప్రత్యేక వాక్యభాగం లేనప్పుడు, ఒక విషయం తప్పా అని అడగటం మంచిది కాదు గాని, అది నిశ్చయముగా సరైనదేనా అని అడగాలి. ఉదాహరణకు, బైబిల్ చెప్తుంది, సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనాలి” (కొలస్సీ. 4:5). మనం ఈ భూలోకంలో గడిపే సమయం శాశ్వతమునకు సంబంధించి తక్కువ మరియు విలువైనది కాబట్టి సొంత ప్రయోజనాలకై ఆ సమయమును వృధా చేయకూడదు, కానీ మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలకాలి” (ఎఫెసీ. 4:29).
మనం నిజాయితీగా, మంచి మనస్సాక్షితో దేవుడు మనలను దీవించి మరియు ఆయన మంచి ప్రయోజనము కొరకు ప్రత్యేకకార్యము జరిగించుటలో మనలను వాడుకోవాలనేది మంచి పరీక్ష. “కాబట్టి మీరు భోజనముచేసినను, పానముచేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1 కొరింథీ 10:31). అది దేవుని మహిమపరచేదేనా అని అనుమానం ఉన్నట్లయితే, దానిని వదిలివేయడం ఉత్తమం. “విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము” (రోమా 14:23). మన శరీరాలు మరియు మన ప్రాణం విడిపించబడి దేవునికి చెందినవిగా మనం గమనించాలి. “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” (1 కొరింథీ 6:19-20). ఈ గొప్ప సత్యము మనం ఏమి చేస్తున్నామో మరియు మనం ఎక్కడకు వెళ్తున్నామో అన్నదాని మీద గొప్ప ప్రభావం చూపాలి.
అదనంగా, దేవునికి సంబంధించి మాత్రమే మన కార్యాలను పరీక్షించడం కాదు, గానీ మన కుటుంబంపై, స్నేహితులపై, మరియు ఇతర ప్రజలపై పడు ప్రభావంకు సంబంధించి పరీక్షించాలి. ఒక ప్రత్యేకమైన విషయము వ్యక్తిగతంగా మనకు హాని కలిగించనప్పటికినీ, ఒకవేళ దాని ఫలితము ఇతరులకు హాని కలిగించినను, అది పాపమే. “మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుట గాని, నీ సహోదరుని కడ్డముకలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది. . . కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము” (రోమా 14:21; 15:1).
చివరగా, యేసు క్రీస్తు మన ప్రభువును మరియు రక్షకుడని గమనించాలి, మరియు ఆయన చిత్తమునకు మన అనుగుణ్యతపై ఏదీకూడా ప్రాధాన్యత నొందుటకు మనం అనుమతించకూడదు. అలవాటు లేదా వినోదం మరియు ఆశయం అనేవి మన జీవితాలపై నిరంత్రణ చేయకూడదు; కేవలం క్రీస్తుకే ఆ అధికారం ఉంది. “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను” (1 కొరింథీ 6:12). “మాట చేత గాని క్రియ చేత గాని , మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వార తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి” (కొలస్సీ 3:17).
English
ఒకవేళ అది పాపం అని నాకు ఎలా తెలుస్తుంది?