ప్రశ్న
ఫిర్యాదులు/వ్యాజ్యాలను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?
జవాబు
ఒకరికి వ్యతిరేకంగా మరొకరు న్యాయస్థానం (కోర్టు) యెదుటకు వెళ్లవద్దని అపొస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులకు హెచ్చరించెను (1 కొరింథీ 5:1-8). క్రైస్తవులు ఒకరినొకరు క్షమించకపోవుట మరియు వారి యొక్క సొంత భేదాలను సరిచేసుకోకపోవడమనేది ఆత్మీయ ఓటమిని ప్రదర్శిస్తుంది. క్రైస్తవులకు అనేక సమస్యలు ఉండి వాటిని పరిష్కరించుకొనడానికి అసమర్థులైతే క్రైస్తవులుగా మారాలని అనుకోవడమెందుకు? అయితే, కొన్ని పర్యాయాలు వ్యాజ్యమే సరియైన పద్ధతి. బైబిల్ ప్రకారమైన సమాధానం అనుసరించినప్పుడు (మత్తయి 18:15-17) మరియు కొన్నిసార్లు వ్యతిరేక బృందం ఇంకను తప్పు మార్గంలో ఉన్నప్పుడు, వ్యాజ్యం న్యాయమైనది. ఇది జ్ఞానం కొరకు ఎక్కువ ప్రార్థన (యాకోబు 1:5) చేసి మరియు ఆత్మీయ నాయకుల సంప్రదించిన పిమ్మట ఇలా చేయాలి.
1 కొరింథీ 6:1-6 యొక్క సందర్భమంత సంఘంలోనున్న బేధాలను గూర్చి వివరిస్తుంది కానీ ఈ జీవితానికి విషయాలకు సంబంధించిన తీర్పును గూర్చి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ జీవితమనకు సంబంధించి సంఘము వెలుపల జరుగు విషయాలను గూర్చి చెర్చించు న్యాయస్థానం గూర్చి పౌలు సూచిస్తున్నాడు. సంఘపు సమస్యలు న్యాయస్థానం యెదుటకు తీసుకెళ్లకూడదు, కానీ సంఘములోనే చర్చించవచ్చు.
అపొ.కా. 21-22 అధ్యాయాలలో పౌలు తాను చేయని నేరము నిమిత్తము తప్పుగా బంధించబడ్డానని చెప్పెను. రోమీయులు ఆయను బంధించారు మరియు “సైన్యాధిపతి పౌలును లోపలకు తీసుకువచ్చి మరియు తన నేరమును ఒప్పుకొనడానికి కొరడాలతో కొట్టించుటకు ఆజ్ఞాపించెను. సమూహము ఎందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్నదో ఆయన కనుగొనాలనుకొన్నాడు. కొరడాలతో కొట్టుటకు వారు పౌలును బంధించిరి, అక్కడ నిలువబడిన అధికారితో, ‘శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా?” అని పౌలు చెప్పెను పౌలు తనను రక్షించుకొనుటకు రోమా చట్టమును మరియు పౌరత్వమును ఉపయోగించెను. సరైన ఉద్దేశం కలిగి స్వచ్ఛమైన హృదయంతో చేసినంతకాలం కోర్టు పద్దతిని ఉపయోగించుటలో తప్పు లేదు.
పౌలు తరువాత తెలియజేశాడు ఏమనంటే, “ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?” (1 కొరింథీ. 6:7). ఇక్కడ పౌలుకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసి యొక సాక్ష్యం. మనం ఒక వ్యక్తిని క్రీస్తుకు వేరుగా ఆయనను/ఆమెను న్యాయస్థలం (కోర్టు) యొద్దకు తీసుకువెళ్లుట కంటే మనం నింద మోయడం శ్రేష్టం. న్యాయపోరాటం ప్రాముఖ్యమా లేదా ఒక వ్యక్తి యొక్క ఆత్మ కొరకు పోరాడడం ప్రాముఖ్యమా?
సంగ్రహంగా, అలాటి విషయాలను బట్టి క్రైస్తవులు ఒకరికి ఒకరు న్యాయస్థానం యెదుటకు వెళ్తారా? ఖచ్చితంగా కాదు! పౌర విషయాలను గూర్చి క్రైస్తవులు ఒకరికొకరు న్యాయస్థానం యెదుటకు తీసుకువెళ్తారా? ఒకవేళ దాని నుండి తపించుకోగలిగితే, కాదు. పౌర విషయాల నిమిత్తమై క్రైస్తవులు అన్యులను కోర్టులు తీసుకువెళ్ళవచ్చా? మరల, ఒకవేళ దానిని నివారిస్తే, కాదు. అయితే, కొన్ని సందర్భాల్లో, అంటే మన సొంత హక్కులను రక్షించుకోవలసిన సమయంలో (అపొస్తలుడైన పౌలు ఉదాహరణ వలే) న్యాయ పరిష్కారం సరియైనది.
English
ఫిర్యాదులు/వ్యాజ్యాలను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?