ప్రశ్న
నిత్య భద్రత పాపము చేయుటకు “ఉత్తర్వుగా” ఉందా?
జవాబు
నిత్య భద్రత అను సిద్ధాంతమునకు ఎక్కువగా ఎదురైయ్యే అభ్యంతరము ఏమనగా, అది ప్రజలను వారికి ఇష్టమొచ్చినట్లు జీవించుటకు అవకాశమిచ్చి అయినను వారు రక్షించబడవచ్చని చెబుతుంది. “యాంత్రికంగా” ఇది నిజమైనప్పటికీ, ఇది వాస్తవికతలో నిజము కాదు. యేసు క్రీస్తు ద్వారా నిజముగా విమోచించబడిన ఏ వ్యక్తి కూడా, తరచుగా కావాలని పాపము చేయు జీవితమును జీవించడు. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి మరియు రక్షణ పొందుటకు ఒక వ్యక్తి ఏమి చెయ్యాలి అను రెండు విషయముల మధ్య మనం బేధమును చూపాలి.
రక్షణ, కృప ద్వారానే, విశ్వాసం ద్వారానే, యేసు క్రీస్తులోనే అని బైబిల్ స్పష్టముగా చెబుతుంది (యోహాను 3:16; ఎఫెసీ. 2:8-9; యోహాను 14:6). ఒక వ్యక్తి యేసు క్రీస్తును నిజముగా నమ్మిన తక్షణమే, అతడు లేక ఆమె రక్షణపొంది రక్షణను భద్రపరచుకుంటారు. రక్షణ విశ్వాసము ద్వారా పొంది, క్రియల ద్వారా కొనసాగించబడునది కాదు. గలతీ. 3:3లో పౌలు ఈ సమస్యను గూర్చి మాట్లాడుతూ అడుగుతున్నాడు, “మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?” మనం విశ్వాసం ద్వారా రక్షణపొందినయెడల, మన రక్షణ స్థిరపడి భద్రపరచబడేది కూడా విశ్వాసం ద్వారానే. మనం మన సొంత రక్షణను సంపాదించలేము. కాబట్టి, మన రక్షణ యొక్క కొనసాగింపును కూడా మనం సంపాదించలేము. దేవుడు మన రక్షణను కొనసాగిస్తాడు (యూదా 24). దేవుని హస్తము మనలను గట్టిగా పట్టుకొంటుంది (యోహాను 10:28-29). అది దేవుని ప్రేమ మరియు దాని నుండి మనలను ఏది విడదీయలేదు (రోమా. 8:38-39).
ఏ విధంగానైనా నిత్య భద్రతను వ్యతిరేకించుట, మన మంచి క్రియలు మరియు కృషి ద్వారా మన రక్షణను భద్రపరచుకోవాలనే విశ్వాసమునకు దారితీస్తుంది. అయితే ఇది కృప ద్వారా రక్షణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మనం క్రీస్తు యొక్క విశిష్టత గాని, మన సొంత విశేషత కాదు (రోమా. 4:3-8). మన రక్షణను భద్రపరచుకొనుటకు మనం దేవుని వాక్యమునకు విధేయులవ్వాలి లేక దైవిక జీవితాలను కలిగియుండాలని చెప్పుట యేసు మరణం మన పాపముల యొక్క వెల చెల్లించుటకు సరిపోదని చెప్పుటతో సమానం. యేసు మరణం మన పాపములన్నిటి కొరకు వెల చెల్లించుటకు పూర్తిగా సరిపోతుంది-భూత, వర్తమాన, మరియు భవిష్యత్తు, రక్షణకు ముందు మరియు రక్షణకు తరువాత (రోమా. 5:8; 1 కొరింథీ. 15:3; 2 కొరింథీ. 5:21).
అనగా ఒక క్రైస్తవుడు తనకిష్టమొచ్చినట్లు జీవించి కూడా రక్షణపొందగలడా? ఇది ముఖ్యముగా ఊహాత్మక ప్రశ్న, ఎందుకంటే ఒక నిజమైన క్రైస్తవుడు “తనకిష్టమోచ్చినట్లు” జీవించడని బైబిల్ స్పష్టము చేస్తుంది. క్రైస్తవులు నూతన సృష్టి (2 కొరింథీ. 5:17). క్రైస్తవులు ఆత్మ ఫలములను ప్రదర్శిస్తారు (గలతీ. 5:22-23), శరీర క్రియలను కాదు (గలతీ. 5:19-21). నిజమైన క్రైస్తవుడు నిరంతర పాపములో జీవించడని 1 యోహాను 3:6-9 స్పష్టముగా చెబుతుంది. కృప పాపమును పురికొల్పుతుందనే ఆరోపణకు స్పందిస్తూ, పౌలు అంటున్నాడు, "ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?" (రోమా. 6:1-2).
నిత్య భద్రత పాపమునకు ఉత్తర్వు కాదు. అయితే, క్రీస్తును నమ్మువారికి దేవుని ప్రేమ నిర్థారించబడింది అని తెలుసుకొనుటకు ఇది భద్రతగా ఉంది. దేవుని యొక్క గొప్ప రక్షణ వరమును తెలుసుకొనుట మరియు గ్రహించుట పాపమునకు ఉత్తర్వులు ఇచ్చుటకు వ్యతిరేకమును సంపాదిస్తుంది. యేసు క్రీస్తు మన కొరకు చెల్లించిన వెలను తెలుసుకొను వ్యక్తి పాపపు జీవితమును జీవించుట ఎలా కొనసాగించగలడు (రోమా. 6:15-23)? నమ్మువారి కొరకు దేవుని యొక్క షరతులులేని నిర్థారిత ప్రేమను గ్రహించికూడా, ఒకరు ఆ ప్రేమను తీసుకొని దేవుని ముఖము మీద ఎలా కొట్టగలరు? అట్టి వ్యక్తి నిత్య భద్రత తమకు పాపము చేయుటకు ఉత్తర్వులు ఇచ్చిందని చూపక, అతడు లేక ఆమె యేసు క్రీస్తులోని రక్షణను నిజముగా అనుభవించలేదు. "ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు" (1 యోహాను 3:6).
English
నిత్య భద్రత పాపము చేయుటకు “ఉత్తర్వుగా” ఉందా?