settings icon
share icon
ప్రశ్న

ఆర్థిక వనరులను నిర్వహించుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?

జవాబు


ఆర్థిక విషయాలను నిర్వహించుటను గూర్చి చెప్పడానికి బైబిల్ లో చాల ఉన్నాయి. అప్పు తీసుకొనుటను గూర్చి, బైబిల్ సహజంగా దానికి వ్యతిరేకతను సూచిస్తుంది. సామెతలు 6:1-5; 20:16; 22:7, 26-27 చూడండి (“ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును, అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు . . .చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము, చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోవును”). పదే పదే, బైబిల్ ధనమును సమకూర్చుకొనుటకు విరుద్ధంగా హెచ్చరించి మరియు బదులుగా ఆత్మీయ సంపదయందు దృష్టి పెట్టుటను ప్రోత్సహిస్తుంది. సామెతలు 28:20: “నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.” సామెతలు 10:15; 11:4; 18:11; 23:5 కూడా చూడండి.

సామెతలు 6:6-11 సోమరితనమునకు సంబంధించి బుద్ధిని మరియు దానికి ఫలితంగా వచ్చు ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తుంది. కష్టపడి పనిచేసే తమ కొరకు ఆహారాన్ని నిల్వ చేసుకొనే చీమలను పరిగణలోకి తీసుకోవాలని మనకు తెలియజేయబడింది. లాభదాయకమైన ఏదో ఒక పనిచేసే సమయంలో నిద్రించుటకు వ్యతిరేకంగా ఈ వాక్యభాగం హెచ్చరిస్తుంది. “సోమరుడు” ఒక బద్ధకస్తుడుగా, సోమరితనంతో ఉండి పనిచేయుటకంటే విశ్రాంతిని కోరుకుంటాడు. అతని గమ్యం ఖచ్చితం –పేదరికం మరియు అవసరతలు. వర్ణపటమునకు మరొక వైపు ధనం సంపాదించడంతో నిమగ్నమయ్యాడు. అలాటి వాడు ప్రసంగి 5:10 ప్రకారంగా, ధనసమృద్ధి చేత తృప్తిపడడు మరియు తరచు మరింత కోరుకుంటాడు. మొదటి తిమోతి 6:6-11 కూడా ధనమును కోరుకోనుటకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది.

మనపై ధనమును కూర్చుకొనుటకు ఆశించేకంటే, బైబిల్ సూత్రం ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. “ఇది జ్ఞాపకం ఉంచుకొనండి: కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఇత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” (2 కొరింథీ 9:6-7). దేవుడు మనకిచ్చినదానికి మనం మంచి సేవకులుగా ఉండాలని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. లూకా 16:1-13లో, యేసు మన యొక్క పేద నాయకత్వమునకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ నిజాయితీలేని సేవకుని ఉపమానం చెప్పాడు. కథ యొక్క నీతి ఏంటంటే “ఈ లోక ధనము విషయంలో నమ్మకంగా ఉండనియెడల, సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?” (వ. 11).“ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని 1 తిమోతి 5:8 మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా మన ఇంటిలో అవసరమైన వాటిని కల్పించుటలో మనమే బాధ్యులము.

సంగ్రహంగా, ధనమును ఉపయోగించుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది? సమాధానం ఒక మాటలో సంగ్రహించబడింది –జ్ఞానం. మన ధనంతో మనం జ్ఞానంగా ఉండాలి. మనం ధనమును దాచుకోవాలి, కానీ కూర్చుకొనకూడదు. మనం ధనమును ఖర్చుపెట్టాలి, కానీ విచక్షణ మరియు నియంత్రణతో. ఆనందముతో మరియు త్యాగాముతో ప్రభువుకు మనం తిరిగి ఇవ్వాలి. ఇతరులకు సహాయపడుటలో ధనమును మనం ఉపయోగించాలి, కానీ దేవుని ఆత్మ అధ్వర్యంలో మరియు గ్రహింపుతో. ధనవంతులుగా ఉండడంలో తప్పు లేదు, కానీ ధనమును ప్రేమించుట తప్పు. పేదలుగా ఉండడంలో తప్పు లేదు, కానీ వ్యర్థమైనవాటిపై ధనమును వృధా చేయడం తప్పు. ధనమును నిర్వహించుటకు బైబిల్ యొక్క తరచు సందేశం ఏంటంటే జ్ఞానంతో ఉండడం.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ఆర్థిక వనరులను నిర్వహించుటను గూర్చి బైబిల్ యేమని చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries