వివాహము గురించి బైబిలు ఏమని చెప్తుంది?ప్రశ్న: వివాహము గురించి బైబిలు ఏమని చెప్తుంది?

జవాబు:
వివాహమును సృష్టించుటను ఆదికాండము 2:23-24 లో రాయబడినది: "అప్పుడు ఆదాము ఇట్లనెను- నా యెముకలలో ఒక యెముక నా మాంసములో నా మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడెను.'కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనెను. వారు ఏక శరీరమైయుందురు." దేవుడు మానవుని సృష్టించెను మరియు తర్వాత స్త్రీని అతని వెలితిని సంపూర్తి చేయుటకై సృష్టించెను. "నరుడు ఒంటరిగా నుండుట మంచిదికాదు" అని దేవుడు వివహాము అనే వ్యవస్థ వాస్తవాన్ని "స్థాపించెను" (ఆదికాండం 2:18).

"సహాయకురాలు" అనే పదాన్ని హవ్వను గూర్చి వివరించడానికి వాడారు ఆదికాండం 2:20 అర్థం “ఆవరించటం, సంరక్షించడం లేక అదరించటం మరియు సహాయము చేయునది.” ఆదాము ప్రక్కన సహచారిగానుండుటకు హవ్వ సృష్టించబడెను. ఒక స్త్రి మరియు ఒక పౌరుషుడు వివాహమయినాప్పుడు వారిద్దరు "ఒక శరీరముగా ఏకముచేయబడెను. ఏక శరీరము అనేది లైంగికపరమైన సన్నిహితము అంటే శారీరక ఐక్యతకే స్పష్టముచేయబడినది. క్రొత్త నిభంధన ఈ ఏకత్వమును గూర్చి ఒక హెచ్చరికకూడ చేర్చుతుంది. "కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుదు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు" (మత్తయి 19:6).

అపోస్తలుడైన పౌలు రాసిన అనేకమైన పత్రికలలో వివాహమును సూచిస్తూ మరియు విశ్వాసులు వివాహసంభంధ భాంధవ్య వ్యవహారాలలో ఏవిధంగా వారు నిర్వహించవలెనో రాసెను. అట్లాంటిది ఒక పాఠ్యభాగము 1 కొరింథీయులకు రాసిన ఏడవ అధ్యాయము, మరియు మరియొకటి ఎఫెసీయులకు 5:22-33. మనము రెండింటిని కలిపి చదివినట్లయితే, దేవునికి మనోహరమైన వివాహ సంభంధమును కట్టుకొనుటకు ఈ రెండు పాఠ్యభాగములు బైబిలుపరంగా సూత్రాలను ఇస్తూ తోడ్పడును.

ఎఫెసీయులకు రాసిన పాఠ్యభాగము ప్రత్యేకముగా గంభీరమైన ఫలవంతమైన బైబిలు సారంగా వివాహమునకు ప్రమాణపత్రం. "స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునక సిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు సిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు" (ఎఫెసీయులకు 5:22-23). "పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, మరియు తన్ను తాను అప్పగించుకొనెను" (ఎఫెసీయులకు 5:25). "అటువలెనే, పురుషులనుకూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యాలను ప్రేమింప బద్దులమైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై యున్నాము గనుక ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు” (ఎఫెసీయులకు 5:28-29). “ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిభార్యను హత్తుకొనును; వారిద్దరు ఏక శరీరమగుదురు” (ఎఫెసీయులకు 5:31).

విశ్వాసియైన భర్త మరియు భార్య బైబిలు సూత్రాలను స్థాపించినపుడు, బైబిలు పరమైన వివాహ వ్యవస్థకు కారణమవ్వును. బైబిలు అధారముగా చేసుకున్న వివాహము అనేది ఆవ్యవస్థ సమతుల్యతతొ కొనసాగుతుంది, అందులో క్రీస్తు పురుషుడికి మరియు భార్యకు సిరస్సైయున్నాడు. బైబిలుపరమైన వివాహమునుగూర్చిన భావనేంటంటే ఇద్దరు వ్యక్తులమధ్య ఐక్యత అదే క్రీస్తుకు మరియు తన సంఘానికి మధ్యనున్న ఐక్యతను సూచిస్తుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


వివాహము గురించి బైబిలు ఏమని చెప్తుంది?