ప్రశ్న
హస్తప్రయోగం – ఇది బైబిల్ ప్రకారం పాపమా?
జవాబు
హస్త ప్రయోగం పాపమా కాదా అని బైబిల్ ఎక్కడ కూడా స్పష్టముగా చెప్పలేదు. హస్త ప్రయోగమును గూర్చి ఎక్కువగా ఉపయోగించు వాక్యభాగం ఆదికాండము 38:9-10లో ఉన్న ఓనాను కథ. రేత్తస్సును “నేలను విడచుటను” పాపం అని చెప్పి కొందరు ఈ అధ్యాయమును అనువదిస్తారు. అయితే, వాక్యభాగము చెప్పేది అది కాదు. ఓనాను రేత్తస్సును “నేలన విడిచాడని” దేవుడు అతనిని శిక్షించలేదుగాని, తన సోదరునికి ఒక వారసుని ఇచ్చే తన బాధ్యతను అతడు నిరాకరించాడు కాబట్టి శిక్షించాడు. ఈ వాక్య భాగం హస్త ప్రయోగమును గురించి కాదు, కాని కుటుంబ బాధ్యత నెరవేర్చకపోవుటను గూర్చి. హస్త ప్రయోగం పాపమని రుజువు చేయుటకు కొన్ని సార్లు ఉపయోగించు మరొక వాక్య భాగం మత్తయి 5:27-30. యేసు జారత్వముతో కూడిన ఆలోచనలను గూర్చి మాట్లాడుతూ ఇలా అన్నాడు, “నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము.” ఈ వాక్యభాగానికి మరియు హస్త ప్రయోగానికి మధ్య సమాంతరతలు ఉన్నప్పటికీ, యేసు ఇక్కడ హస్త ప్రయోగమును గూర్చి మాట్లాడుతున్నట్లు అనిపించుట లేదు.
హస్త ప్రయోగం పాపమని బైబిల్ స్పష్టముగా చెప్పకపోయినప్పటికీ, హస్త ప్రయోగానికి నడిపించు కార్యములు పాపము అనుటకు ఎలాంటి సందేహం లేదు. హస్త ప్రయోగం ఎల్లప్పుడూ జారత్వముతో కూడిన ఆలోచనలు, లైంగిక కోరికలు, మరియు/లేక అశ్లీల చిత్రాలకు పరిణామం. ఈ సమస్యలను మనం ఎదురించాలి. జరత్వ కోరికలు, అనైతిక ఆలోచనలు, మరియు అశ్లీల చిత్రాలను అధిగమించినట్లైతే, హస్త ప్రయోగం సమస్య కాదు. హస్త ప్రయోగమును గూర్చి చాలా మంది దోష ఆలోచనలను కలిగియుంటారు, కాని వాస్తవానికి, దానికి ముందు జరిగే కార్యములను గూర్చి మనం పశ్చాత్తపపడాలి.
హస్త ప్రయోగం అను సమస్యకు కొన్ని బైబిల్ నియమాలను ఉపయోగించవచ్చు. ఎఫెసీ. 5:3 చెబుతుంది “మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు.” హస్తప్రయోగం ఆ పరీక్షను అధిగమిస్తుందో లేదో తెలియదు. “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1 కొరింథీ. 10:31) అని బైబిల్ మనకు బోధిస్తుంది. మీరు ఏదైనా విషయంలో దేవునికి మహిమ ఇవ్వలేకపోతే, దానిని మీరు చేయకూడదు. ఒక సన్నివేశము దేవునికి ఇష్టపూర్వకమైనదని ఒక వ్యక్తికి నిర్థారణ లేని యెడల, అది పాపం అవుతుంది. “విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము” (రోమా. 14:23). అంతేగాక, మన శరీరములు విమోచించబడి దేవునికి చెందినవని మనం గుర్తుంచుకోవాలి. “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” (1 కొరింథీ. 6:19-20). మన శరీరాలతో మనం ఏమి చేస్తున్నాము అను దానిపై ఈ గొప్ప సత్యము యొక్క ప్రభావం ఉండాలి. ఈ నియమాల వెలుగులో, హస్త ప్రయోగం పాపం అనే మాట లేఖనపరమైనదే. స్పష్టంగా, హస్త ప్రయోగం దేవునికి మహిమ తెచ్చుటలేదు; అది అనైతికత అనే ముసుగును తప్పించుకోలేదు, మరియు మన శరీరాలపై దేవుని యాజమాన్యం ఉందనే పరీక్షను కూడా ఇది తప్పించుకొనలేదు.
English
హస్తప్రయోగం – ఇది బైబిల్ ప్రకారం పాపమా?