ప్రశ్న
జీవితము యొక్క అర్ధము ఏమిటి?
జవాబు
జీవితము యొక్క అర్ధము ఏమిటి? జీవితములో ఉద్దేశ్యము, నెరవేర్పు, మరియు సంతృప్తిని ఎలా కనుగొనగలం? సుదీర్ఘకాల ప్రాధాన్యత కలిగే ఒకదానిని ఎలా సంపాదించగలం? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలను ఆలోచించడం చాలా మంది ఎప్పుడు ఆపలేదు. సంవత్సరముల తరువాత వెనుకకు తిరిగి వారి సంబంధములు ఎందుకు పడిపోయాయో, వారు సాధించాలనుకున్నది సాధించినప్పటికీ వారు వెలితిగా ఎందుకు భావిస్తున్నారో అని ఆశ్చర్యపడుతుంటారు. తన ఆటలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ఒక ఆటగాడిని ఆ ఆటను మొట్టమొదటిగా ఆడుటకు ముందు ఎవరైనా వచ్చి ఆయనతో ఏమి చెప్పాలనుకున్నాడు, అని అడిగారు ఒకరు. దీనికి బదులుగా, “నేను ఆ శిఖరాన్ని అధిరోహించినప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఆ ఎత్తైన శిఖరాన ఏమీ లేదు అని నాకు చెప్పాలనుకున్నాను” అని అన్నాడు. చాలా గమనములు వాటిని వెంబడించుటలో ఏళ్ళ తరబడి గడిపిన తరువాత వాటి శూన్యాన్ని బయలుపరుస్తాయి.
మన మానవీయమైన సంస్కృతిలో, ప్రజలు చాలా వాటిని వెంబడిస్తూ ఉంటారు, వాటిలో కొంత అర్ధాన్ని వారు కనుగొనవచ్చుననే ఆలోచనతో. ఈ యత్నములలో కొన్ని వ్యాపారంలో విజయం, ధనం, మంచి బంధాలు, రతి ప్రక్రియ, వినోదం మరియు ఇతరులకు మంచి చేయడం లాంటివి ఉంటాయి. ధనార్జనను గూర్చిన, బంధాలను గూర్చిన మరియు ఉల్లాసములను గూర్చిన తమ గమనములను ప్రజలు సాధించినప్పుడు కూడా వారి అంతరంగములో ఎదో ఒక శూన్యం, ఏదీ కూడా నింపలేదేమో అనేంత ఖాళీగా అనిపించే భావనలు ఉన్నాయని సాక్ష్యమిచ్చారు.
పరిశుద్ధ గ్రంధంలో ఒక పుస్తక రచయిత అయిన ప్రసంగి తన అనుభూతులను ఈ విధంగా చెప్తున్నాడు, “వ్యర్థము వ్యర్థము... సమస్తము వ్యర్థమే” (ప్రసంగి 1:2). ప్రసంగి గ్రంధకర్తయైన రాజగు సొలొమోనుకు కొలత లేని ఐశ్వర్యము, ఆయన కాలములో గాని లేదా మన కాలములో కూడా గాని ఏ ఒక్క వ్యక్తికి లేని జ్ఞానము, వందల కొలది స్త్రీలు, రాజభవనములు మరియు రాజ్యములకు అసూయను కలిగించే అనేక ఉద్యానవనములు, శ్రేష్టమైన ఆహారము మరియు పానము, మరియు లభ్యమౌతున్న ప్రతి విధములైన వినోదములు కలవు. ఒక దశలో ఆయన అన్నాడు తన హృదయము కోరినదల్లా ఆయన నెరవేర్చాడు. అయినను “సూర్యుని క్రింద జీవితము”ను – అంటే జీవితములో ఉన్నదంతయు మన కళ్ళతో చూసేది మరియు మన జ్ఞానేంద్రియములతో అనుభవించేది మాత్రమే అనే ఒక జీవితమును జీవించడమును గూర్చి – సంక్షిప్తంగా చెప్తూ అంటాడు వ్యర్ధము అని. ఎందుకు అట్టి ఒక శూన్యము కలిగింది? ఎందుకంటే ఇక్కడ ఈ సమయములో మనము అనుభవించే దానికంటే ఉన్నతమైనదాని కొరకు దేవుడు మనలను సృష్టించాడు. దేవుని గూర్చి సొలొమోను అన్నాడు, “...ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు” (ప్రసంగి 3:11). మన హృదయములలో మనకు తెలుసు “ఇక్కడ మరియు ఇప్పుడు” అనేదే సమస్తము కాదు అని.
పరిశుద్ధ గ్రంధంలో మొదటి పుస్తకమైన ఆదికాండములో దేవుడు మానవుని తన సొంత పోలికలో సృష్టించాడని మనము కనుగొంటాము (ఆది. 1:26). దీనికి అర్ధము మనము వేరే ఏదైనా దాని పోలికలే ఉండుట కంటే (వేరే జీవన రూపములో) దేవుని పోలికలోనే ఎక్కువగా ఉన్నాము. మానవుడు పాపమందు పడి పాప శాపము భూమి మీదికి వచ్చిన తరువాత, ఈ క్రింది విషయములు వాస్తవికమైనవని మనము కనుగొంటాము: 1) దేవుడు మానవుని సాంఘిక సృష్టిగా చేశాడు (ఆది. 2:18-25); 2) దేవుడు మానవునికి పని ఇచ్చాడు (ఆది. 2:15); 3) దేవుడు మానవునితో సహవాసమును కలిగియున్నాడు (ఆది. 3:8); మరియు 4) దేవుడు మానవునికి భూమిపైన అధికారాన్ని ఇచ్చాడు (ఆది. 1:26). ఈ విషయముల యొక్క ప్రాధాన్యత ఏమిటి? దేవుడు వీటిలో ప్రతియొక్క దానిని జీవితములో పరిపూర్ణత కొరకు మనకు ఇచ్చాడు, కాని ఇవన్నియు (ప్రత్యేకంగా దేవునితో గల మానవుని సహవాసము) మనుష్యుడు పాపములో పడుట వలన పూర్తిగా దెబ్బతిన్నాయి మరియు దీని ద్వారా భూమి మీదికి శాపము వచ్చింది (ఆది. 3).
పరిశుద్ధ గ్రంధంలో ఆఖరు పుస్తకమైన ప్రకటన గ్రంధంలో దేవుడు ఈ ప్రస్తుత భూమ్యాకాశములను నాశనం చేసి నూతన ఆకాశమును మరియు నూతన భూమిని సృష్టించడం ద్వారా నిత్యమైన స్థితిని తెస్తానని బయలుపరచాడు. ఆ కాలంలో, విమోచింపబడిన మానవాళితో పరిపూర్ణమైన సహవాసాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, అప్పుడు విమోచింపబడనివారు అయోగ్యులుగా తీర్పునొంది అగ్ని గుండములో పడవేయబడతారు (ప్రకటన 20:11-15). పాప శాపము తొలగిపోతుంది; అక్కడ పాపముండదు, దుఃఖమైనను, వేదనయైనను, మరణమైనను, లేదా బాధయైనను ఉండదు (ప్రకటన 21:4). దేవుడు వారితో కూడా నివాసం ఉంటాడు, మరియు వారు దేవుని కుమారులగుదురు (ప్రకటన 21:7). అలా మనము ఒక పరిపూర్ణమైన వృత్తం అవుతాము: దేవుడు తనతో సహవాసము కొరకు మనలను సృష్టించాడు, మనిషి పాపము చేశాడు, ఆ సహవాసమును తెంచాడు, ఆ నిత్యత్వపు స్థితిలో దేవుడు ఆ సహవాసమును పునరుద్ధరిస్తాడు. జీవితంలో అంతయు సాధించి నిత్యత్వంలో దేవునితో దూరంగా ఉండుటకు మరణిస్తే వ్యర్ధము కంటే ఇంకా దయనీయం! కాని దేవుడు ఈ నిత్యత్వపు ఆనందమును సాధ్యపరచడమే కాదు (లూకా 23:43) ఈ భూమిపైన జీవితాన్ని సంతృప్తికరంగా మరియు అర్ధవంతంగా చేశాడు. ఈ నిత్యత్వపు ఆనందము మరియు “భూమిపై పరలోక ఆనందము” ఎలా వస్తాయి?
జీవితము యొక్క అర్ధము యేసు క్రీస్తు ద్వారా పునరుద్దరించబడుతుంది
జీవితములో నిజమైన అర్ధము, ఇప్పుడును మరియు నిత్యత్వములో కూడా, ఆదాము మరియు హవ్వలు పాపములో పడినప్పుడు కోల్పోయిన దేవునితో ఆ సహవాసము యొక్క పునరుద్ధరణలో కనబడుతుంది. దేవునితో అట్టి సహవాసము కేవలం ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారానే సాధ్యం (అపొ.కా. 4:12; యోహాను 1:12; 14:6). మనము మన పాపములను ఒప్పుకొనినప్పుడు (ఇంకెన్నడూ కొనసాగించుటకు ఆశించకుండా) మరియు క్రీస్తు మనలను మార్చినప్పుడు, మనలను నూతన సృష్టిగా చేసి, యేసుక్రీస్తు మీద మన రక్షకునిగా ఆధారపడినప్పుడు ఈ నిత్య జీవము లభిస్తుంది.
జీవితములో నిజమైన అర్ధము యేసును రక్షకునిగా అంగీకరిస్తే రాదు, అది చాలా అద్భుతమైన విషయమే కాని. కాని, జీవితములో నిజమైన అర్ధము ఒకడు క్రీస్తును తన శిష్యునిగా వెంబడించినప్పుడు, ఆయన గూర్చి నేర్చుకొన్నప్పుడు, ఆయన వాక్యము ద్వారా ఆయనతో సమయమును గడిపినప్పుడు, ప్రార్ధనలో ఆయనతో సంభాషించినప్పుడు, మరియు విధేయతతో ఆయన ఆజ్ఞలను గైకొంటూ నడచినప్పుడు మాత్రమే. ఒకవేళ మీరు క్రైస్తవులు కాకుంటే (లేదా బహుశా నూతన విశ్వాసి అయితే), మీలో అనుకుంటూ ఉండవచ్చు, “అది నాకు అంత ఆశక్తికరంగా లేదా పరిపూర్ణంగా అనిపించడం లేదు!” అని. కాని యేసు ఈ క్రింది మాటలను పలికాడు:
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:28-30). “జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని”(యోహాను 10:10b). “అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును” (మత్తయి 16:24-25). “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” (కీర్తన. 37:4).
ఈ వచనములు అన్నియు చెప్తున్నది ఏమంటే మనకు ఎంపికలు ఉన్నాయి. మనము మన జీవితములను మనమే నడిపించుటకు చూడవచ్చు, ఫలితంగా శూన్యమే మిగులుతుంది, లేదా దేవుని మరియు మన జీవితముల కొరకుగల ఆయన చిత్తాన్ని పూర్ణహృదయంతో అనుసరించవచ్చు, దీని ఫలితం పరిపూర్ణ జీవితం, హృదయ వాంఛలు తీరడం, మరియు సంతుష్టిని సంతృప్తిని కనుగొనడం. ఇది ఇలా ఎందుకంటే మన సృష్టికర్త మనలను ప్రేమిస్తున్నాడు మరియు మనకొరకు శ్రేష్టమైన దానినే ఆశిస్తాడు (అంటే అత్యంత సుళువైన జీవితమే కాదు, కాని అత్యంత పరిపూర్ణ జీవితం).
క్రైస్తవ జీవితమును ఒక క్రీడా ప్రాంగణంలో ఆటకు బాగా దగ్గరగా ఉన్న ఖరీదైన కుర్చీలను కొనుక్కొని చూడడమో, లేదా తక్కువ వేల చెల్లించి దూరంగా ఉన్న కుర్చీ కొనుక్కొని చూడడమో అనే దానితో పోల్చవచ్చు. “ముందు వరుస” నుండి దేవుని కార్యమును చూడడం మనము ఎన్నుకొనవలసినది కాని, విచారంగా, ఎక్కువ మంది చేసేది అది కాదు.దేవుని కార్యమును ప్రత్యక్షంగా చూడడం అనేది దేవుని ప్రణాళికలను వెంబడించుట కొరకు నిజముగా తమ సొంత ఆశలను అనుసరించని హృదయపూర్వక క్రీస్తు శిష్యులకు మాత్రమే. వారు వెలను చెల్లించారు (క్రీస్తుకు మరియు ఆయన చిత్తానికి పరిపూర్ణ సమర్పణ కలగడం); వారు జీవితమును దాని పరిపూర్ణతలో అనుభవిస్తున్నారు; మరియు వారు తమను, తమ పొరుగువానిని, తమ సృష్టికర్తను కూడా ఎటువంటి నేరభావములు లేకుండా ఎదుర్కొనగలరు. మీరు వెల చెల్లించారా? ఒకవేళ అవును అయితే, మరలా అర్ధమును గూర్చి లేదా ఉద్దేశ్యమును గూర్చి ఆకలిగొనరు.
English
జీవితము యొక్క అర్ధము ఏమిటి?