settings icon
share icon
ప్రశ్న

వెయ్యేళ్ళ పరిపాలన అనగా ఏమిటి, మరియుదీనిని అక్షరసత్యముగా తీసుకోవాలా లేక అలంకారికంగా తీసుకోవాలా?

జవాబు


వెయ్యేళ్ళ పరిపాలన అనునది ఈ భూమిపై యేసుక్రీస్తు చేపట్టే 1000 సంవత్సరముల పరిపాలనకు ఇవ్వబడిన పేరు. కొంతమంది ఈ 1000 సంవత్సరములను కొంతమేర అలంకారిక విధానంలో వివరించడానికి చూస్తుంటారు. ఇంకొందరు ఈ 1000 సంవత్సరములను కేవలం “ఒక సుదీర్ఘ కాలమును” సూచిస్తున్న ఒక దృష్టాంతముగా పరిగణిస్తారు, కాని ఈ భూమిపై యేసుక్రీస్తు చేసే భౌతిక పరిపాలనగా అక్షరాలా తీసుకోరు. ఏమైనప్పటికీ, ప్రకటన గ్రంథము 20:2-7లో ఆరు సార్లు, ఈ వెయ్యేళ్ళ పరిపాలన అనునది ప్రత్యేకముగా 1000 సంవత్సరముల కాలము పాటు కొనసాగే ఒక రాజ్యముగా చెప్పబడింది. ఒకవేళ దేవుడు “సుదీర్ఘ కాలము”నే గనుక సూచించవలసియుంటే, ఖచ్చితమైన కాల వ్యవధిని సూచించకుండానే ఆయన చాలా సుళువుగా ఆ కాలమును గూర్చి మాట్లాడేవాడే.

క్రీస్తు ఈ భూమిపైకి తిరిగి వచ్చేటప్పుడు దావీదు సింహాసనము మీద కూర్చుండి యెరూషలేములో రాజుగా తననుతాను స్థిరపరచుకుంటాడని పరిశుద్ధగ్రంథము మనకు చెప్తుంది (లూకా 1:32-33). రాజ్యమును స్థాపించుటకుగాను క్రీస్తు భౌతికముగా, అక్షరాలా ఈ లోకములోనికి రావాలని బేషరతుగా ఇవ్వబడిన నిబంధనలు నినదిస్తున్నాయి. అబ్రాహాముతో చేసిన నిబంధన ఇశ్రాయేలు దేశమునకు ఒక భూమిని, సంతానమును మరియు నాయకుడిని, మరియు ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని (ఆదికాండము 12:1-3) వాగ్దానము చేస్తుంది. పాలస్తీనాను గూర్చి ఇచ్చిన నిబంధన ఇశ్రాయేలు దేశము తన సొంత భూమికి తిరిగి వచ్చుటకు మరియు భూమిని స్వతంత్రించుకొనుటకు (ద్వితీయ. 30:1-10) గూర్చిన వాగ్దానమును చేస్తుంది. దావీదుతో చేసిన నిబంధన ఇశ్రాయేలు దేశమునకు క్షమాపణను – అంటే ఆ దేశము ఆశీర్వదింపబడుటకు గాను ఒక మాధ్యమముగా – వాగ్దానము చేస్తుంది (యిర్మీయా 31:31-34).

రెండవ రాకడలో, దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడగా (మత్తయి 24:31), మార్పు చెందగా (జెకర్యా 12:10-14) మరియు అభిషిక్తుడైన యేసుక్రీస్తు యొక్క పరిపాలన ద్వారా తన సొంత దేశమునకు తిరిగి పునరావాసపరచబడగా ఈ నిబంధనలు అన్నియు నెరవేరుతాయి. వెయ్యేళ్ళ పరిపాలన కాలములో ఉండే వాతావరణము భౌతికముగాను మరియు ఆత్మీయముగాను ఒక పరిపూర్ణమైన వాతావరణముగా పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతుంది. అది సమాధానకరమైన (మీకా 4:2-4; యెషయా 32:17-18), సంతోషకరమైన (యెషయా ౬౧:7, 10), ఆదరణకరమైన (యెషయా 40:1-2), దారిద్ర్యము లేదా అనారోగ్యములు లేని (ఆమోసు 9:13-15; యోవేలు 2:28-29) సమయముగా ఉంటుంది. ఈ వెయ్యేళ్ళ పరిపాలనలోనికి కేవలము విశ్వాసులు మాత్రమే ప్రవేశిస్తారని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తుంది. ఈ కారణముచేత, అది సంపూర్ణమైన నీతి (మత్తయి 25:37; కీర్తన 24:3-4), విధేయత (యిర్మీయా 31:33), పరిశుద్ధత (యెషయా 35:8), సత్యము (యెషయా 65:16), పరిశుద్ధాత్మ యొక్క పూర్ణత (యోవేలు 2:28-29) కలిగిన సమయముగా ఉంటుంది. దావీదును తనకు రాజప్రతినిధిగా (యిర్మీయా 33:15-21; ఆమోసు 9:11) క్రీస్తే రాజుగా (యెషయా 9:3-7; 11:1-10) పరిపాలన చేయును. అధికారులు మరియు అధిపతులు కూడా ఏలుదురు (యెషయా 32:1; మత్తయి 19:28), మరియు యెరూషలేము ప్రపంచమంతటికీ రాజకీయ కేంద్రముగా ఉంటుంది (జెకర్యా 8:3).

ఈ వెయ్యేళ్ళ పరిపాలన యొక్క ఖచ్చితమైన సమయమును ప్రకటన 20:2-7 వచనములు మనకు ఇస్తున్నాయి. ఈ లేఖనములు లేకుండా కూడా, ఈ భూమిపై మెస్సీయా నిజముగా పరిపాలన చేయడానికి వస్తాడు అని చెప్పే అసంఖ్యాక ప్రస్తావనలు వేరే ఉన్నాయి కూడా. దేవుడు చేసిన అనేక నిబంధనలు మరియు వాగ్దానముల యొక్క నెరవేర్పు అనునది వాస్తవికమైన, భౌతికమైన మరియు భవిష్యత్తులో రాబోయే రాజ్యముపైనే ఆధారపడి ఉంటాయి. వెయ్యేళ్ళ పరిపాలనను గూర్చిన వాస్తవిక విశదమును మరియు దాని వ్యవధి 1000 సంవత్సరములు ఉంటుంది అనే వాస్తవములను తృణీకరించుటకు సరిపడు ఆధారములు ఏమి లేవు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

వెయ్యేళ్ళ పరిపాలన అనగా ఏమిటి, మరియుదీనిని అక్షరసత్యముగా తీసుకోవాలా లేక అలంకారికంగా తీసుకోవాలా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries