ప్రశ్న
క్రొత్త పరలోకం మరియు క్రొత్త భూలోకం ఏవి?
జవాబు
పరలోకంలో ఏ విధంగా ఉంటుందో అనేకమంది ప్రజలకు తప్పు ఆలోచన ఉంటుంది. నూతన పరలోకం మరియు నూతన భూలోకం గురించి ప్రకటన 21- 22 అధ్యాయాలలో సంపూర్ణ చిత్రము ఇవ్వబడింది. చివరి దినాల్లో జరగబోయే సంఘటనలు పూర్తయ్యాక, ప్రస్తుత పరలోకం మరియు భూమి పోయి మరియు అవి నూతన పరలోకం మరియు నూతన భూమి చేత భర్తీ చేయబడతాయి. విశ్వాసులు నివసించే శాశ్వత స్థలము నూతన భూమి. నూతన భూమి ఏంటంటే మనం నిత్యత్వమును గడిపే “పరలోకం.” అది నూతన భూమి అక్కడ నూతన యెరూషలేము, పరలోకము పట్టణం ఉంటాయి. నూతన భూమిపై బంగారు వీధులు మరియు ముత్యాల గుమ్మాలు ఉంటాయి.
పరలోకం – నూతన భూమి – ఒక బాహ్య ప్రదేశం అక్కడ మనం మహిమ శరీరాలతో నివసిస్తాము (1 కొరింథీ. 15:35-58). పరలోకం “మేఘాలలో ఉన్నది” అనేది బైబిల్ కు వ్యతిరేకం. “పరలోకంలో మన ఆత్మలు తిరుగుతూ” అనేది కూడా బైబిలుకు వ్యతిరేకం. విశ్వాసులు అనుభవించే పరలోకం అనేది ఒక నూతన మరియు పరిపూర్ణ గ్రహం దానిపై మనం నివసిస్తాము. నూతన భూమిపై పాపం, చెడు, అనారోగ్యం, శ్రమ, మరియు మరణం అనేవి ఉండవు. అది మన ప్రస్తుత భూమి వలెనే ఉంటుంది, బహుశా మన ప్రస్తుత భూమిలో కొంత మార్పు ఉండవచ్చు, కానీ పాపం మాత్రం ఉండదు.
నూతన పరలోకం పరిస్థితి ఏంటి? ప్రాచీన మనసులో “పరలోకం”అనేది ఆకాశాలను మరియు బాహ్య ప్రదేశమును, అదే విధంగా దేవుడు ఉండే ప్రదేశమును సూచించేది అని గ్రహించడం ప్రాముఖ్యం. కాబట్టి, ప్రకటన 21:1 నూతన పరలోకమును సూచించినప్పుడు, ప్రపంచమంత ఒక నూతన భూమిగా, నూతన ఆకాశాలుగా, నూతన బాహ్య ప్రదేశంగా సృష్టించబడుతుంది అని తెలియజేస్తుంది. ప్రపంచంలో నున్న ప్రతిదానికి అది భౌతికపరమైన లేదా ఆత్మీయపరమైన ఒక తాజాదనం ఇచ్చుటకొరకు దేవుని పరలోకం కూడ మరల సృష్టించబడుతున్నట్లుగా కనిపిస్తుంది. శాశ్వతంలో నూతన పరలోకమునకు మనకు అవకాశం ఉన్నదా? బహుశా, కానీ కనుగొనుటకు మనం వేచి యుండాలి. పరలోకం పట్ల మన గ్రహింపును రూపొందించునట్లుగా మనం దేవుని మాటను అంగీకరించాలి.
English
క్రొత్త పరలోకం మరియు క్రొత్త భూలోకం ఏవి?