ప్రశ్న
నేను ఇప్పుడే యేసును విశ్వసించితిని... ఇప్పుడు ఏమిటి?
జవాబు
నేను ఇప్పుడే యేసును విశ్వసించితిని... ఇప్పుడు ఏమిటి?
అభినందనలు! మీరు జీవితమును-మార్చు నిర్ణయం తీసుకున్నారు! మీరు ఇప్పుడు ఇలా అడుగుచున్నారేమో, “ఇప్పుడు ఏంటి? నేను దేవునితో ప్రయాణం ఎలా ఆరంభించాలి?” ఈ క్రింద ఇవ్వబడిన ఐదు మెట్లు బైబిల్ లో నుండి మీకు దిశను చూపిస్తాయి. మీ ప్రయాణమును గూర్చి మీకు ప్రశ్నలున్నప్పుడు, దయచేసి సందర్శించండి www.GotQuestions.org/Telugu.
1. మీరు రక్షణను నిశ్చయముగా అర్థంచేసుకోండి.
“దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అని 1 యోహాను 5:13 చెబుతుంది. మనం రక్షణను గ్రహించాలని దేవుడు ఆశించుచున్నాడు. నిశ్చయముగా రక్షణ పొందితిమను దృఢమైన జ్ఞానము మనం కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు. రక్షణ యొక్క ముఖ్య బిందువులను క్లుప్తముగా పరిశీలిద్దాం:
(a) మనమంతా పాపము చేసితిమి. మనమంతా దేవునికి అయిష్టమైన కార్యములు చేసితిమి (రోమా. 3:23).
(b) మన పాపము వలన, దేవుని నుండి నిత్య ఎడబాటు అను శిక్షకు అర్హులము (రోమా. 6:23).
(c) మన పాపములకు పరిహారం చెల్లించుటకు యేసు సిలువపై మరణించెను (రోమా. 5:8; 2 కొరింథీ. 5:21). మనము పొందవలసిన శిక్షను తనపై వేసుకొని యేసు మన స్థానములో మరణించెను. మన పాపముల యొక్క పరిహారము చెల్లించుటకు యేసు మరణం సరిపోతుందని ఆయన పునరుత్ధానం రుజువు చేసెను.
(d) యేసు మీద విశ్వాసముంచువారందరికీ – ఆయన మరణము మన పాపములను పరిహరిస్తుందని నమ్మినవారికి- దేవుడు క్షమాపణ మరియు రక్షణ దయచేయును (యోహాను 3:16; రోమా. 5:1; రోమా. 8:1).
అది రక్షణ సందేశము! మీ రక్షకునిగా యేసు క్రీస్తును మీరు విశ్వసించినయెడల, మీరు రక్షించబడితిరి! మీ పాపములన్నియు క్షమించబడెను, మరియు నిన్ను ఎన్నడును విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు (రోమా. 8:38-39; మత్తయి. 28:20). యేసు క్రీస్తులో మీ రక్షణ భద్రము అని గుర్తుంచుకోండి (యోహాను 10:28-29). మీ రక్షకునిగా మీరు కేవలము యేసును నమ్మినయెడల, మీరు దేవునితో కూడ నిత్యత్వము పరలోకములో గడుపుదురనే నిశ్చయత కలిగియుండవచ్చు.
2. బైబిల్ బోధించు మంచి సంఘమును కనుగొనండి.
సంఘమనగా భవనమని ఆలోచించవద్దు. సంఘమంటే ప్రజలు. యేసు క్రీస్తు యొక్క విశ్వాసులు ఒకరితో ఒకరు సహవాసం కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది సంఘము యొక్క ప్రాథమిక ఉద్దేశాలలో ఒకటి. ఇప్పుడు మీరు మీ విశ్వాసమును యేసు క్రీస్తునందు కలిగియున్నారు కాబట్టి, మీ ప్రాంతములో ఉన్న బైబిల్ ను నమ్ము ఒక సంఘమును కనుగొని అక్కడ ఉన్న సంఘ కాపరితో మాట్లాడమని మిమ్మును బలముగా ప్రోత్సహిస్తాము. యేసు క్రీస్తులో మీ నూతన విశ్వాసమును గూర్చి ఆయనకు తెలియజేయుడి.
సంఘము యొక్క రెండవ ఉద్దేశము బైబిల్ బోధించుట. దేవుని యొక్క హెచ్చరికలు మీ జీవితాలలో ఎలా అన్వయించాలో మీరు నేర్చుకొనవచ్చు. ఒక విజయవంతమైన బలమైన క్రైస్తవ జీవితము జీవించుటకు బైబిల్ ను అర్థం చేసుకొనుట తాళపు చెవి వంటిది. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని 2 తిమోతి. 3:16-17 చెబుతుంది.
సంఘము యొక్క మూడవ ఉద్దేశము ఆరాధన. ఆరాధన అనగా దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుట! దేవుడు మనలను రక్షించెను. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. దేవుడు మన కొరకు సమకూర్చును. దేవుడు మనకు మార్గదర్శిగా ఉండి నడిపించును. ఆయనకు వందనములు తెలపకుండా ఎలా ఉండగలము? దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమగలవాడు, కరుణానిధి, మరియు కృపగలవాడు. “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి” అని ప్రకటన 4:11 ప్రకటిస్తుంది.
3. దేవుని వైపు చూచుటకు అనుదినము సమయం కేటాయించుము.
దేవుని వైపు చూస్తూ అనుదినము కొంత సమయం గడుపుట మనకు చాలా ప్రాముఖ్యమైన విషయము. కొందరు దీనిని “ఏకాంత సమయం” అని అంటారు. మరికొందరు దీనిని “ధ్యానములు” అని అంటారు, ఎందుకనగా ఇది మనలను మనం దేవునికి సమర్పించుకొను సమయం. కొందరు ఉదయ కాలం సమయం కేటాయిస్తే, మరి కొందరు సాయంకాలం సమయం కేటాయిస్తారు. మీరు ఈ సమయమును ఏమని పిలుస్తారు మరియు ఏ సమయం కేటాయిస్తారనునది అంత ముఖ్యము కాదు. మీరు తరచుగా దేవునితో సమయం గడుపుట అనునది ముఖ్యము. దేవునితో మనం గడుపు సమయంలో ఏమేమి ఉంటాయి?
(a) ప్రార్థన: ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో మీ చింతలు సమస్యలు చెప్పండి. మీకు వివేకమును నడిపింపును ఇవ్వమని దేవుని కోరండి. మీ అవసరతలు తీర్చమని దేవుని అడగండి. దేవుని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ఆయన చేయు ప్రతి కార్యమునకు మీరు ఎంతగా కృతజ్ఞులైయున్నారో దేవునితో చెప్పండి. ప్రార్థన అంటే ఇదే.
(b) బైబిల్ పఠనం. సంఘములో, సండే స్కూల్ లో, మరియు/లేక బైబిల్ స్టడీలలో బైబిల్ బోధకు తోడుగా – మీరు స్వయంగా బైబిల్ చదువువారి వలె ఉండాలి. మీరు విజయవంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు తెలుసుకొనవలసిన ప్రతి విషయము బైబిల్ లో ఉంది. వివేకవంతమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవాలి, ఇతరులకు పరిచర్య ఎలా చెయ్యాలి, మరియు ఆత్మీయంగా ఎలా జీవించాలి అను విషయముల కొరకు దేవుని నడిపింపు దీనిలో ఉంది. బైబిల్ మన కొరకు ఇవ్వబడిన దేవుని వాక్యము. బైబిల్ ప్రాముఖ్యముగా దేవునికి ఇష్టమైన విధముగా, ఆయనను సంతృప్తిపరచు విధముగా ఎలా జీవించాలో తెలుపు దేవుని సూచనల పుస్తిక.
4. మీకు ఆత్మీయంగా సహాయంచేయగల వారితో అనుబంధములు అభివృద్ధిచెయ్యండి.
“మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని 1 కొరింథీ. 15:33 మనకు చెబుతుంది. “దుష్ట” ప్రజల యొక్క ప్రభావం మనపై ఎలా ఉంటుందో అనుటను గూర్చి బైబిల్ లో చాలా హెచ్చరికలు ఉన్నాయి. పాపపు క్రియలు చేయువారితో సమయం గడుపుట ద్వారా మనం కూడ ఆ క్రియలలోనికి వెళ్ళునట్లు శోధింపబడతాము. మన చుట్టు ఉన్న వారి స్వభావం మన మీద కూడ “పూయబడుతుంది.” అందువలన దేవుని ప్రేమించువారు మరియు ఆయనకు సమర్పణ కలిగియున్నవారు మన చుట్టు ఉండుట చాలా అవసరము.
మీకు సహాయం చేసి మిమ్మును ప్రోత్సహించగలిగిన ఒకరు లేక ఇద్దరు స్నేహితులను, మీ సంఘములో నుండి కావచ్చు, కనుగొనుటకు ప్రయత్నించండి (హెబ్రీ 3:13; 10:24). మీ ఏకాంత సమయమును గూర్చి, మీ కార్యకలాపాలను గూర్చి, మరియు దేవునితో మీ నడకను గూర్చి మిమ్మును లెక్క అడుగునట్లు మీ స్నేహితుల సహాయం కోరండి. మీరు కూడ వారికి అలానే చేయవచ్చేమో అడగండి. అంటే ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరించని మీ స్నేహితులందరినీ మీరు విడిచిపెట్టాలని దీని అర్థము కాదు. యేసు మీ జీవితమును మార్చెనని, మీరు వారు చేయు క్రియలు చేయలేరని వారికి తెలియజేయండి. మీ స్నేహితులతో యేసును గూర్చి పంచుకొనుటకు అవకాశం ఇవ్వమని దేవుని అడగండి.
5. బాప్తిస్మము పొందుడి.
చాలామంది బాప్తిస్మమును గూర్చి అపార్థము కలిగియున్నారు. “బాప్టైజ్” అను పదమునకు అర్థము నీటిలో ముంచుట. బాప్తిస్మము అనునది క్రీస్తులో మీకున్న నూతన విశ్వాసమును మరియు ఆయనను అనుసరించాలనే మీ సమర్పణను బహిరంగంగా ప్రకటించు బైబిల్ విధానము. నీటిలో ముంచు క్రియ క్రీస్తుతో కూడ పాతిపెట్టబడుటకు సాదృశ్యంగా ఉంది. నీటిలో నుండి బయటకు వచ్చు క్రియ క్రీస్తు యొక్క పునరుత్ధానమును సూచిస్తుంది. బాప్తిస్మము పొందుట అనగా మిమ్మును మీరు యేసు యొక్క మరణం, సమాధి మరియు పునరుత్ధానముతో గుర్తించుకొనుట (రోమా. 6:3-4).
బాప్తిస్మము రక్షించదు. బాప్తిస్మము మీ పాపములను శుద్ధిచేయదు. బాప్తిస్మము కేవలం ఒక విధేయతతో కూడిన అడుగు, మరియు రక్షణ కొరకు క్రీస్తులో మాత్రమే మీ విశ్వాసము ఉన్నదని బహిరంగంగా ప్రకటించుట మాత్రమే. బాప్తిస్మము విధేయతతో కూడిన అడుగు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది-క్రీస్తుయందు మీ విశ్వాసమును మరియు ఆయన పట్ల మీ సమర్పణను బహిరంగముగా ప్రకటించుట. మీరు బాప్తిస్మము పొందుటకు సిద్ధముగా ఉన్న యెడల, మీ సంఘ కాపరితో మాట్లాడండి.
English
నేను ఇప్పుడే యేసును విశ్వసించితిని... ఇప్పుడు ఏమిటి?