ప్రశ్న
వివిధ జాతుల యొక్క మూలము ఏమిటి?
జవాబు
మానవాళిలోని వివిధ“జాతుల” యొక్క లేదా చర్మపు రంగుల యొక్క మూలములను గూర్చి పరిశుద్ధ గ్రంధము అంత స్పష్టముగా ఏమి చెప్పుటలేదు. వాస్తవములో, అసలు ఉన్నది ఒకే జాతి – అదే మానవ జాతి. ఈ మానవ జాతిలోనే చర్మపు రంగులోను ఇతర భౌతిక లక్షణములలోను కొంచెం భిన్నత్వము ఉంది. దేవుడు బాబెలు గోపురము కథనములో భాషలను తారుమారు చేసినప్పుడు (ఆదికాండము 11:1-9), జాతుల భిన్నత్వమును కూడా సృష్టించాడు అని కొందరు ఊహిస్తారు. వివిధ రకములైన పర్యావరణ వాతావరణములలో మానవులు జీవించుటకు వీలగునట్లు దేవుడు కొన్ని జన్యుపరమైన మార్పులు చేసి ఉండవచ్చు, అంటే ఆఫ్రికా దేశస్థులు ఆ ప్రాంతములో ఉండే అధిక వేడిమిని తట్టుకొనునట్లు జన్యుపరముగా అలా రూపొందించబడి ఉంటారు. ఈ ఆలోచన ప్రకారముగా, దేవుడు భాషలను తారుమారు చేసి, భాషల ప్రాతిపదికన వారు విభజించుకొనునట్లు చేసి, ఆ తరువాత ఈ ప్రతి భాష గుంపు వారు ఎక్కడ తమ నివాసములను ఏర్పరచుకున్నారో దానిని బట్టి వారిని జన్యుపరముగా తయారు చేసాడు అని అంటారు. ఇది సాధ్యపడు ఆలోచనే అయినను, ఈ ఆలోచన కొరకు స్పష్టమైన పరిశుద్ధ గ్రంధపు ఆధారము ఏమి లేదు. మానవాళి యొక్క జాతులు/చర్మపు రంగులు బాబెలు గోపురము నేపథ్యములో ఎక్కడా కూడా అనుసంధానముగా మాట్లాడబడలేదు.
జలప్రళయము తరువాత, వివిధ భాషలు మనుగడలోనికి వచ్చినప్పుడు, ఒకే భాషను మాట్లాడే ఒక గుంపు అదే భాష మాట్లాడే వేరొక గుంపుతో కలిసి దూరంగా వెళ్ళిపోయింది. ఈ విధంగా చేయుటద్వారా, ఇతర మానవ జనాభాతో వారు కలుసుకొనుటకు వీలు లేనందున వారి యొక్క జన్యుపరమైన లక్షణములు క్రమేణా కుంచించుకునిపోయాయి. దగ్గరగా సంకరణము జరిగి, తరువాత కాలగమనంలో ఈ వివిధ గుంపులలో కొన్ని లక్షణాలు ఉద్ఘాటించబడ్డాయి (ఇవన్నియు వారి వారి జన్యు స్మృతులలో ఉన్నాయి). తదుపరి సంకరణము జరగగా, ఆ జన్యు లక్షణములు ఇంకను చిన్నదిగా మారి, ఒకే భాష మాట్లాడే ప్రజలందరికి ఒకేవిధమైన లేదా ఒకేలాగ ఉండే లక్షణములు సంక్రమించడం జరిగింది.
మరొక వివరణ ఏమంటే నలుపు జాతీయులను, ఎరుపు జాతీయులను, తెలుపు జాతీయులను (మరియు వీరికి మధ్యస్థంగా ఉండే రంగులను కూడా) ఉత్పత్తి చేయుటకు ఆదాము మరియు హవ్వలు ఆ జన్యులను వారిలోనే కలిగియున్నారు అనే వాదన. సంకర జాతి దంపతులకు కొన్నిసార్లు వేరే రంగులో ఉన్న బిడ్డలు పుట్టినట్లుగానే ఇది ఉంటుంది. మానవాళి అంతయు కనిపించుటలో స్పష్టమైన భిన్నత్వములను కలిగియుండాలని దేవుడు భావించాడు గనుక, వివిధ చర్మపు రంగులు కలిగిన బిడ్డలను కనుటకు దేవుడు ఆదాము మరియు హవ్వలకే ఆ సామర్ధ్యతను ఇచ్చాడు అనుటలో అర్ధం ఉంటుంది. తరువాత, జలప్రళయమును తట్టుకొని బ్రతికిన వారు కేవలం నోవాహు మరియు తన భార్య, నోవహు యొక్క ముగ్గురు కుమారులు వారి భార్యలు – మొత్తం ఎనిమిది మంది మాత్రమే (ఆదికాండము 7:13). బహుశా నోవహు యొక్క కోడళ్ళు వేరే జాతికి చెందినవారు కావచ్చు. నోవహు యొక్క భార్య కూడా నోవహు కంటే కూడా వేరే జాతికి చెందినదై ఉంటుంది. బహుశ వారు ఎనిమిది మంది కూడా సంకర జాతివారైయుండవచ్చు, అంటే వివిధ జాతులను ఉత్పన్నం చేయుటకు వారిలో జన్యువులు ఉన్నాయని దీని అర్ధము. వివరణ ఏదైనా కావచ్చు, ఈప్రశ్నలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మనమందరమూ ఒక జాతివారము, ఒకే దేవుని ద్వారా సృష్టింపబడ్డాము, మరియు ఒకే ఉద్దేశము కొరకు – అనగా ఆయనను స్తుతించుటకు – సృష్టింపబడ్డాము.
English
వివిధ జాతుల యొక్క మూలము ఏమిటి?