యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించటంలో అర్థ౦ ఏమిటి?ప్రశ్న: యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించటంలో అర్థ౦ ఏమిటి?

జవాబు:
యేసుక్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించారా ? ఈ ప్రశ్నకు సమాధానము ఇవ్వటానికి ముందు, నాకు వివరించడానికి అవకాశం ఇవ్వండి. ఈ ప్రశ్నను సరిగా అర్థ౦ చేసుకోవాలంటే, ముందు యేసు క్రీస్తు, మీ” స్వంత “మరియు” రక్షకుడని” మీరు సరిగా అర్థ౦ చేసుకోవాలి.

యేసు క్రీస్తు ఎవరు? చాలా మంది యేసుక్రీస్తును ఒక మంచి వ్యక్తిగా, బోధకుడిగా లేదా దేవుని ప్రవక్తగా ఒప్పుకుంటారు. యేసును గూర్చిన ఈ విషయాలన్నీ నిజమే, కాని నిజంగా అతడెవరో ఎవరూ చెప్పలేకపోతున్నారు. బైబిల్ ( యోహాను 1. 1,14 చూస్తే) ఏం చెపుతుందంటే ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము శరీరధారియై, మన మధ్యకు మనకు బోధించటానికి, స్వస్థత పరచటానికి, సరిచేయటానికి, క్షమించటానికి మరియు మనకొరకు చనిపోయారు. మీరు ఈ యేసును అంగీకరించారా?

రక్షకుడు అంటే ఏమిటి మరియు మనకు ఈ రక్షకుడు ఎందుకు అవసరం? (రోమా 3:10-18) లో బైబిల్ ఏం చెపుతుందంటే మనమందరము పాపము చేసాము, చెడు పనులు చేసాము. దాని ఫలితమే దేవుని కోపానికి మరియు ఆయన తీర్పుకి పాత్రులమయ్యాము . (రోమా 6:23, ప్రకటన 20:11-15) లో చూస్తే శాశ్వతమైన మరియు అనంతమైన దేవునికి విరోధముగా మనము చేసిన పాపములకు కేవలము మనకు వచ్చిన శిక్ష అనంతమైనది, అందుకే మనకు రక్షకుడు కావాలి!

యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకొరకు ఇక్కడ చనిపోయారు. దేవుడు మానవ రూపములో యేసుగా వచ్చి చనిపోయి మన పాపములకు లెక్కలేనంత వెల చెల్లించారు. (2 కొరింథి 5:21) లో చెప్పినట్లు. ( రోమా 5:8 ) ప్రకారము యేసు చనిపోయి మనపాపములకు వెల చెల్లించెను. మనము చేయలేనిది ఆయన చేసి మన కొరకు వెల చెల్లించెను. యేసు మరణము మీద తెచ్చిన పునరుధ్ధానము ఏమని చెపుతుందంటే ఆయన మరణము మన పాపములకు సరిపడినంత వెల చెల్లించెను. (యోహాను 14.6 ; అ. కా 4.12 ) ప్రకారము ఆయన ఒక్కరే మరియు ఆయన మాత్రమే రక్షకుడు. యేసును మీ రక్షకునిగా మీరు నమ్ముచున్నారా?

యేసు మీ “స్వంత” రక్షకుడా? చాలా మంది క్రైస్తవ తత్వము అంటే చర్చికి రావటం, విధులను ఆచరించటం, కొన్ని నిర్ణీతమైన పాపములు చేయకుండా ఉ౦డటం అనుకుంటారు. ఇది క్రైస్తవ తత్వము కాదు. నిజమైన క్రైస్తవ తత్వము అంటే యేసు క్రీస్తుతో వ్యక్తిగతంగా సంబంధం కలిగివుండటం. యేసుని మీ స్వరక్షకునిగా అంగీకరించటం అంటే మీ స్వంత విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ఆయనపై ఉ౦చటం. ఇతరుల విశ్వాసము ద్వారా ఎవరూ రక్షింపబడరు. కొన్ని నిశ్చయమైన పనులు చేయటం ద్వారా ఎవరూ క్షమించబడరు. రక్షింపబడాలి అంటే ఒకే ఒక మార్గము ఏమిటంటే యేసుని మీ స్వరక్షకుడిగా అంగీకరించటం, నా పాపములకు ఆయన మరణము ద్వారా వెల చెల్లించారు అని నమ్మటం. మరియు ఆయన పునరుధ్ధానము ద్వారా నాకు ఖచ్చితంగా నిత్యజీవము లభించిందని విశ్వసించటం. (యోహాను 3:16) లో చెప్పినట్లు. యేసు మీ స్వరక్షకుడేనా?

యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించాలి అనుకుంటే, దేవునితో ఈ మాటలు చెప్పండి. ప్రార్థన చేయుట వలన గాని మరి ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. క్రీస్తు నందు నమ్మకము ఉ౦చుట ద్వారా మాత్రమే మీ పాపములు క్షమించబడతాయి .ఈ ప్రార్దన యేసు నందు మీకు కల విశ్వాసాన్ని వివరించటానికి మరియు ఆయన అందచేసిన రక్షణను గూర్చి కృతజ్ఙతలు చెల్లించటానికి ఉపకరిస్తుంది. ప్రభువా, నాకు తెలుసు నేను నీకు విరోధముగా పాపము చేసి శిక్షకు పాత్రుడనయ్యాను. కాని యేసుక్రీస్తు నాకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకొనుట వలన నేను విశ్వాసం ద్వారా క్షమించబడ్డాను. మీరు అందించిన క్షమాపణను తీసుకుని నా నమ్మకాన్ని రక్షణ కొరకు మీలో ఉ౦చుతాను. నేను యేసుని నా స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నాను! మీ అద్బుతమైన కృప మరియు క్షమాపణ ---“ నిత్యజీవనపు వరము కొరకు”కృతజ్ఙతలు! ఆమెన్!

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించటంలో అర్థ౦ ఏమిటి?