ఒకే అంశం నిమిత్తమై అనేక సార్లు ప్రార్థించడం యోగ్యమేనా? దేనికోసరమైన ఒకేసారియే ప్రార్థించవచ్చా?ప్రశ్న: ఒకే అంశం నిమిత్తమై అనేక సార్లు ప్రార్థించడం యోగ్యమేనా? దేనికోసరమైన ఒకేసారియే ప్రార్థించవచ్చా?

జవాబు:
లూకా 18:1-7 లో, యేసు ప్రాముఖ్యమైన పట్టువదలని ప్రార్థనను గురించి ఒక దృష్ఠాంతమును చెప్పెను. అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు తనకును తన ప్రతివాదికిని మధ్య న్యాయపు తీర్పు చెప్పమని వచ్చెను. ఎందుచేతననగా ఆమె విసుకక నిత్యము ప్రార్థించుటవలన, ఆ న్యాయాధిపతి దయచూపించెను. యేసు దానినుద్దేశంచి విసుకక నిత్యము అడిగినపుడు ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతియే ఆమె విన్నపమును విని జవాబు అనుగ్రహించుటకు దయచూపించినపుడు, మనలను ప్రేమించుచున్న దేవుడు ఇంకెంతగా- "ఆయన ఏర్పరచు కున్నవారు" (వ 7)- మనము ప్రార్థిస్తున్న విషయానికి జావాబు అనుగ్రహించకుండా వుంటాడా? ఈ దృష్ఠాంతము మనకు భోధించదు, తప్పుగా ఆలోచించినవిధముగా, ఒకవేళ మనము తరచుగా ఒక విషయమును పదే పదే అడిగినట్లయితే, దేవుడు దానిని ఖచ్చితముగా మనకు అనుగ్రహించుటకు బద్దుడైయున్నాడు. దానికంటే, దేవుడు తన స్వంతవానిపై పగదీర్చను అని వాగ్ధానము చేసెను, వారిని నిర్దోషములేదని తీర్పుచెప్పటం, వారి తప్పులను రాయడం, వారిపట్ల న్యాయము చేయడం, మరియు వారిని ప్రతికూల పరిస్థితులనుండి విమోచించటం. ఆయన నీతిమంతమును బట్టి, ఆయన పరిశుధ్దతను బట్టి , మరియు పాపముపై ఆయనకున్న ద్వేషాన్ని బట్టి; ప్రార్థనకు జవాబిచ్చుటకు, ఆయన చేసిన వాగ్ధానములను నిలబెట్టుకొంటూ మరియు తన శక్తిని కనుపరచును.

యేసు మరియొక ప్రార్థనను గుర్చిన దృష్ఠాంతమును లూకా 11:5-12 లో చెప్పెను. అన్యాయస్థుడైన న్యాయాధిపతి లాంటి ఉపమానము, ఒక వ్యక్తి తన స్నేహితుడు నిస్సహాయస్థితిలో అతని దగ్గరకు వస్తే అతడు అసౌఖ్యముకలిగించెననుకొని ఆ స్నేహితునికి అవసరతను తీర్చకుండునా అని యేసు ఈ విషయముపై ప్రసంగించెను, మనము అడగకముందే దేవుడు మన అవసరతలను తీర్చును, ఎందుచేతనంటే ఆయనకు అసౌఖ్యముకలిగించేది ఏదిలేదు. మరల ఇక్కడ, మనము ఏది మరల మరలా అడిగినప్పటికి ఆయనననుగ్రహించునని ఎటువంటి వాగ్ధానము చేయలేదు. దేవుడు ఆయన తన పిల్లలకు వారి అవసరతలను తీర్చునని వాగ్ధానము చేసెను, గాని కోర్కెలనుకాదు. మరియు మనకు మన అవసరతలను గూర్చి తెలిసిన దానికంటే ఆయనకు మేలైన రీతిలో తెలియును. అదే వాగ్ధానము మత్తయి 7:7-11 మరియు లూకా 11:13లోను తిరిగి తిరిగి చెప్పబడింది, అక్కడ "మంచి యీవి" అని తన్ను అడుగువారికి పరిశుధ్దాత్మను అనుగ్రహించునని చెప్పెను.

ఈ రెండు పాఠ్యభాగాలు మనలను ప్రార్థనచేయమని మరియు ప్రార్థిస్తూ ఉండమని ప్రోత్సాహిస్తున్నాయి. ఒకే విషయము గురించి పదే పదే అడగటమువలన తప్పేమి లేదు. దేవుని చిత్తానుసారముగా మనము ప్రార్థించినట్లయితే మనకు సమస్య లేనే లేదు (1యోహాను 5:14-15), దేవుడు మీకి అనుగ్రహించేంతవరకు అడుగుతూ ఉండండి లేక మీ హృదయములోనుండి ఆ కోరికను తీసివేయమని అడగండి. కొన్నిసార్లు దేవుడు మనము చేసిన ప్రార్థనలకు జవాబు దొరికేంతవరకు కనిపెట్టమని బలవంతము చేస్తాడు ఎందుకంటే మనకు సహనమును మరియు పట్టువిడువని స్థితిని భోధించటానికి మాత్రమే. కొన్నిసార్లు మనము ఒక దానికొరకు అడుగుతాము అది మనకు అనుగ్రహించబడనపుడు అంటే అది మన జీవితాలకు ఇంకా ఆయనచిత్తములో లేదు కాబట్టి. కొన్నిసార్లు ఆయనచిత్తములో లేని దానికొరకు మనము అడుగుతాము , అప్పుడు ఆయన దానికిచ్చే జవాబు "లేదు" అని. ప్రార్థన అనేది మన విన్నపములను ఆయనముందు పెట్టుట మాత్రమే కాదు; ఆది ఆయన చిత్తాన్ని మన హృదయ సమక్షములోనికి తీసుకొనిరావడం. అడుగుతూ ఉండండి, తట్టుతూ ఉండండి, మరియు నీ విన్నపములకు జవాబు అనుగ్రహించబడేంతవరకు ఆయన సన్నిధిని వెదకండి లేక నీ విన్నపములు నీపట్ల నెరవేర్చటానికి ఆయన చిత్తములో లేవని నిన్ను ఒప్పింపజేయును.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ఒకే అంశం నిమిత్తమై అనేక సార్లు ప్రార్థించడం యోగ్యమేనా? దేనికోసరమైన ఒకేసారియే ప్రార్థించవచ్చా?