పూర్వనిర్ణీతం అంటే ఏంటి? పూర్వనిర్ణీతం బైబిలు పరమైనదేనా?ప్రశ్న: పూర్వనిర్ణీతం అంటే ఏంటి? పూర్వనిర్ణీతం బైబిలు పరమైనదేనా?

జవాబు:
రోమా 8:29-30 చెప్తుంది, "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తనకుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు , దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను." ఎఫెసీయులకు 1:5 మరియు 11 ప్రకటిస్తుంది, "మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్దులమును నిర్ధోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను...మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి , ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు." చాలమంది వ్యక్తులు పూర్ణ నిర్ణీతం అనే సిధ్ధాంతముగురించి విరోధభావములు కలిగియున్నారు. ఏదిఏమైనా,పూర్వనిర్ణీతం అనేది ఒక బైబిలు సిధ్ధాంతము. దాఈని మూలసూత్రము ఏంటంటే పూర్వనిర్ణీతం అంటే ఏంటో బైబిలుపరంగా అర్థంతెలుసుకోవటానికి.

పైన ఇవ్వబడిన పాఠ్యాభాగలన్నియు గ్రీకు పదమైన ప్రూరిజొ, నుండి తర్జుమా చేయబడిన పదమే "పూర్వనిర్ణీతం," అది ఎటువంటి అర్థమునిస్తుందంటే " ముందుగా నిశ్చయించటం" "నిర్ణయించటం" మరియు "ఒక పని జరుగవలెనని ముందే నిర్ణయించటం." గనుక, పూర్వనిర్ణీతం అంటే ఎప్పుడో జరుగబోయే విషయాలను దేవుడు ముందుగానే నిశ్చయించటం. దేవుడు దేనిని కాలమునకు ముందుగానే ఏమి నిశ్చయించాడు? రోమా 8:29-30 పత్రిక ప్రకారము దేవుడు కొంతమంది వ్యక్తులు ఆయన కుమారుని స్వరూపములో మార్చబడాలని, పిలువబడ్డారని, నీతిమంతులుగా తీర్చబడినారని మరియు మహిమపర్చబడ్డారని ముందుగానే నిశ్చయించాడు. ప్రాముఖ్యంగా, కొంతమంది వ్యక్తులు రక్షించబడాలని ముందుగానే నిర్ణయించాడు. అసంఖ్యాకమైన లేఖనభాగాలు క్రీస్తు ప్రభువువారు ముందుగనే విశ్వాసులను ఎన్నుకున్నారు (మత్తయి 24:22, 31; మార్కు 13:20, 27; రోమా 8:33, 9:11, 11:5-7, 28; ఎఫెసీయులకు 1:11; కొలొస్సీయులకు 3:12; 1 థెస్సలోనీకయులకు 1:4; 1 తిమోతి 5:21; 2 తిమోతి 2:10; తీతుకు 1:1; 1 Pఎటెర్ 1:1-2, 2:9; 2 పేతురు 1:10). పూర్వనిర్ణీతం, అనేది ఒక బైబిలు సిధ్ధాంతములో దేవుడు తన సార్వభౌమత్వమువలన కొంతమంది వ్యక్తులు రక్షించబడాలని ముందుగానే నిర్ణయించాడు.

పూర్వ నిర్ణీత సిధ్ధాంతమునకు చాల అసమాన్యముగా తలెత్తే ఆక్షేపణేంటంటే అది అన్యాయమైనది. దేవుడు ఎందుకని కొంతమంది వ్యక్తులనే ఎన్నుకొన్నాడు మరియు మిగిలిన వారిని ఎందుకు ఎన్నుకొన్నలేదు? అతి ప్రాముఖ్యమైన సంగతేంటంటే ఏ ఒక్కరూ కూడా రక్షించబడుటకు తగినవారు కాదు. మనమందరము పాపముచేసినవారము ( రోమా3:23), మరియు అందరు నిత్యశిక్షకు యోగ్యులమే (రోమా6:23). దాని కారణముగా, దేవుడు మనల్నందర్ని నరకములో నిత్యత్వము సంపూర్తిగా అనుమతించినట్లైతే అది న్యాయమైయుండేది. ఏదిఏమైనప్పటికి, దేవుడు మనలో కొంతమందిని రక్షించుటకు ఎన్నుకున్నాడు. ఎవరైతే ఎన్నుకొనబడలేదో వారికి పక్షపాతము చూపిస్తున్నడనికాదు గాని వారు దేనికైతే యోగ్యులో దానినే పొందుటకు వారికి అనుమతిచ్చెను. దేవుడు కొంతమందికి కృపగలిగి ఎనుకున్నాడంటే మరొకరొకి పక్షపాతము చూపించినట్లని అర్థం కాదు. ఎవరూ దేవునినుండి పొందుకొనుటకు యోగ్యులుకారు; అందుచేత, ఎవరూ ఒక్కరూకూడా వారు దేనినైనా దేవునినుండి పొందుకోవటంలేదని ఆక్షేపించ బద్దులుకాకూడదు. ఒక ఉదాహరణలో ఒక మనుష్యుడు ఇష్ఠమొచ్చినట్లు ఇరువది మందిలో ఐదుగురుకి ధనమును పంచియిచ్చెను. మిగిలిన పదిహేనుమంధి ధనమును వారు పొందుకొనలేదని నిరాశపడతారా? బహుశా అవ్వవచ్చు. వారు ఆవిధంగా నిరాశపడటానికి హక్కు ఉనాదా? లేదు. వారికి లేదు. ఎందుకని? కారణమేంటంటే ఆవ్యక్తి వారికి ధనమును ఇచ్చుటకు ఎవరికికూడ ఋణస్థుడు కాదు. ఆయన కేవలము కొంతమందికే కృపను చూపించుటకు నిశ్చయించుకున్నాడు.

ఒకవేళ దేవుడు రక్షించినవారినే ఎన్నుకున్నాడంటే, అది ఆయన క్రీస్తుయందు విశ్వాసముంచుటకు మనకిచ్చిన స్వేచ్చను తక్కువగా ఎంచినట్లేగా? బైబిలు చెప్తుంది మనందరకు ఎన్నుకొనుటకు స్వేచ్చ ఉంది- ఎవరైతే యేసు నందు విశ్వాసముంచుతారో వారు రక్షింపబడుదురు(యొహాను 3:16; రోమా 10:9-10). బైబిలు ఎన్నడుకూడ ఎవరైతే యేసు నందు విశ్వాసముంచుతారో వారిని నిరాకరించినట్లు లేదు లేక ఎవరైతే ఆయననువెదకుతారో వారినుండి ఆయన ముఖము త్రిప్పలేదు (ద్వితియోపదేశకాండం 4:29).ఎలాగో, మర్మమైన దేవునిలో, పూర్వ నిర్ణీతం అనేది దేవునిచేత ఆకర్షించబడినవానితో చేయి చేయి కలుపుకొంటూ నడుస్తూంది (యోహాను 6:44) మరియు నమ్మువానికి రక్షణకలుగజేస్తూంది (రోమా1:16). దేవుడు ఎవరైతే రక్షించబడాలో వానిని ముందుగా నిర్ణయించెను, మరియు మనము రక్షణపొందుటకు గాను క్రీస్తుని ఎన్నుకోవాలి. రెండు వాస్తవమైన సత్యములే. రోమా 11:33 లో ఉద్ఘోషిస్తుంది, "ఆహా, దేవుని బుద్ధి ఙ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు!"


తెలుగు హోం పేజికు వెళ్ళండి


పూర్వనిర్ణీతం అంటే ఏంటి? పూర్వనిర్ణీతం బైబిలు పరమైనదేనా?