settings icon
share icon
ప్రశ్న

పూర్వ సహస్రాబ్ది వాదన అనగానేమి?

జవాబు


పూర్వ సహస్రాబ్ది వాదన అంటే క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పరిపాలనకు ముందే ఆయన రాకడ జరుగుతుందని, మరియు ఆ వెయ్యేళ్ళ పరిపాలన అనునది ఈ భూమిపై క్రీస్తు చేపట్టే అక్షరాలా 1000 సంవత్సరకాల పరిపాలన అని చెప్పే ఒక సిద్ధాంతము. అంత్య కాలములలో సంభావించబోయే సంఘటనలను గురించి లేఖనములు చెప్తున్న వాక్యభాగములను అర్థము చేసుకొని వాటిని విశదపరచాలంటే, మనము స్పష్టముగా అర్థము చెసుకొనవలసిన విషయాలు రెండు ఉన్నాయి: లేఖనములను విశదపరచుటకు సరియైన పధ్ధతి మరియు ఇశ్రాయేలు (అంటే యూదులు) మరియు సంఘముకు (అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసముంచే సమాజము) మధ్య వ్యత్యాసాన్ని సరిగా గమనించడం.

మొదటిగా, లేఖనములను విశదపరచుటలో సరియైన పద్దతి ఏమి కోరుతుందంటే లేఖనములు తమ తమ నేపథ్యమునకు అనుకూలముగా ఉండేటట్లు విశదపరచబడాలని చెప్తుంది. దీనికి అర్ధం ఏమంటే వ్రాయబడిన ఒక వాక్యభాగము దాని శ్రోతల యొక్క, అందులో చర్చించబడిన వారి యొక్క, మరియు అది వ్రాయబడిన వారి యొక్క తదితర సందర్భములకు నిలకడగా ఉండునట్లు విశదపరచబడాలి. రచయిత, ఉద్దేశించబడిన శ్రోతలు, మరియు విశదపరచునటువంటి వాక్యభాగము యొక్క చారిత్రిక నేపధ్యములు కూడా ఒకరు తెలుసుకొని ఉండటం చాలా ప్రాముఖ్యం. చారిత్రిక మరియు సంప్రదాయక నేపధ్యము ఆ వాక్యభాగము యొక్క సరియైన అర్థమును తరచూ బయలుపరుస్తుంది. ఒకలేఖనభాగము మరియొక లేఖనభాగమును కూడా విశదపరచగలదు అని గుర్తుంచుకోవడం కూడా ప్రాముఖ్యమే. అంటే, కొన్నిసార్లు ఒక శీర్షిక లేదా అంశము వేరే చోట అదే విధంగా చర్చించబడిన శీర్షికను కూడా కలిపి మాట్లాడుతుంది అని అర్థము. కాబట్టి ఈ వాక్యభాగములన్నిటిని ఒకదానితో ఒకదానిని అనుసంధానించి వాటి వాటి నేపధ్యమునకు అనుగుణ్యంగా విశదపరచడం చాలా ప్రాముఖ్యం.

ఆఖరుగా, మరియు అతి ప్రాముఖ్యంగా, వాక్యభాగము యొక్క సందర్భము అది అలంకారికముగా ప్రయోగించబడింది అని తెలుపునప్పుడు మినహా మిగతా అన్నిసార్లుదాని యొక్క సాధారణ, మామూలు, సునాయాస, అక్షరార్థ అర్థములోనే తీసుకోవాలి. అక్షరార్థ విశదము అనునది భాషారూపముల ప్రయోగము యొక్క వీలును విస్మరించదు. కాని, ఆ అలంకారిక అర్థమును నేపధ్యమునకు అనుగుణ్యముగా ఉంటే తప్ప అసలైన వాఖ్యభాగము యొక్క అర్థములోనికి చదవకుండా సదరు చదువరులను ఇది ప్రోత్సహిస్తుంది. ఆ వాక్యభాగములో ఇవ్వని “లోతైన, మరింత ఆత్మీయ”మైన అర్థమును వెదకకుండా ఉండుట అనునది చాలా ప్రాముఖ్యం. ఒక వాక్యభాగమును ఆత్మీయకరణం చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే లేఖనము నుండి చదువరి యొక్క మనస్సునకు ఖచ్చితమైన విశదము యొక్క మూలమును మార్చుతుంది. అప్పుడు, అప్పుడు విశదము యొక్క విశేషమైన ప్రమాణము ఏమీ ఉండడు; కాని, లేఖనము అనునది ప్రతి ఒక్క వ్యక్తి తాను ఏమనుకుంటున్నాడో అనే భావమును విశదపరచే ఒక ప్రయోగముగా మారుతుంది. రెండవ పేతురు 1:20-21 వచనములు “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” అని జ్ఞాపకము చేయబడుతున్నాము.

పరిశుద్ధ గ్రంథ విశదము విషయములో ఈ నియమములను అన్వయించుట ద్వారా, ఇశ్రాయేలు (అనగా అబ్రాహాము యొక్క భౌతికమైన సంతానము) మరియు సంఘము (క్రొత్తనిబంధన విశ్వాసులు అందరూ) అనువారు రెండు వేరు వేరు గుంపులవారు అని గ్రహించాలి. ఇశ్రాయేలు మరియు సంఘము అనునవి రెండు వేరు వేరు వ్యవస్థలు అని చూడడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే, ఒకవేళ దీనిని అపార్ధంచేసుకుంటే, లేఖనములే అపార్ధంచేసుకొనబడతాయి. ఈ విధమైన అపార్థపు విశదమునకు లోనగు వాక్యభాగము ఏవనగా ఇశ్రాయేలును గూర్చి ఇవ్వబడిన వాగ్దానములను గూర్చి మాట్లాడే భాగములు (నేరవేరినవి మరియు నెరవేరనివి). ఆ వాగ్దానములు సంఘమునకు అన్వయింపజేయబడకూడదు. గుర్తుంచుకొండి, వాక్యభాగము యొక్క నేపధ్యము అసలు అది ఎవరికి ఉద్దేశించబడింది అనేదానిని నిర్ణయించి అత్యంత సరియైన విశదమునకు దారి చూపుతుంది.

ఈ భావనలను మనస్సులో ఉంచుకొని, పూర్వ సహస్రాభ్ది ఆలోచనకు ఊతనిచ్చే వివిధ లేఖనభాగములను చూడవచ్చు. ఆదికాండము 12:1-3 వచనములలో ఈ విధంగా చదువుతాము: “యెహోవా – నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను.”

దేవుడు ఇక్కడ అబ్రాహామునకు మూడు విషయాలను వాగ్దానము చేస్తున్నాడు: అబ్రాహామునకు అనేకమంది సంతానము ఉంటారు, ఈ దేశము భూమిని స్వతంత్రించుకొని దానిని ఆక్రమించుకొంటుంది, మరియు అబ్రాహాము సంతతి ద్వారా(యూదుల ద్వారా) మానవాళి అంతటికి ఒక సార్వత్రికమైన ఆశీర్వాదము వస్తుంది. ఆదికాండము 15:9-17వచనములలో దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఇది చేసిన విధానము ద్వారా, నిబంధనను గూర్చిన పూర్తి బాధ్యతను ఆయనపై ఉంచుతున్నాడు. అంటే, దేవుడు చేసిన నిబంధనను నిర్వీర్యంచేయుటకు అబ్రాహాము చేయగలిగినది లేదా చేయకుండా విఫలమయ్యేది ఏది లేదు. ఇంకా ఈ వాక్యభాగములో, యూదులు కాలక్రమంగా ఆక్రమించుకొనబోయే ఆ దేశము యొక్క సరిహద్దులు కూడా ఇవ్వబడ్డాయి. ఈ సరిహద్దులను గూర్చిన పూర్తి వివరముల కొరకు, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము చూడండి. భూమిని గూర్చిన వాగ్దానమును గూర్చి మాట్లాడే ఇతర వాక్యభాగములు ఏవనగా ద్వితీయోపదేశకాండము 30:3-5 మరియు యెహెజ్కేలు 20:42-44.

2 సమూయేలు 7:10-17 వచనములలో, దేవుడు రాజైన దావీదునకు చేసిన వాగ్దానము చూడగలము. దావీదు సంతానమును కలిగి ఉంటాడని, ఈ సంతానము నుండి దేవుడు శాశ్వతమైన రాజ్యమును స్థాపిస్తాడని దేవుడుఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. ఇది సహస్రాబ్దిలో క్రీస్తు చేపట్టే పాలనను గూర్చి మాట్లాడుతుంది మరియు అది నిరంతరమూ ఉంటుంది. ఈ ప్రవచన యొక్క నెరవేర్పు సొలోమోను చేసిన రాజ్యపరిపాలన అని చాలా మంది అక్షరార్థముగా నమ్ముతారు, కాని ఆ ఆలోచనతో ఒక సమస్య ఉంది. సొలోమోను పరిపాలించిన ఆ ప్రాంతము నేడు ఇశ్రాయేలు చేతిలో లేదు, లేదా నేడు ఇశ్రాయేలుపై సొలోమోను రాజ్యపరిపాలన చేయుటలేదు. తన సంతానము వారు శాశ్వతముగా భూమిని స్వతంత్రించుకుంటారు అని దేవుడు దావీదుతో చేసిన వాగ్దానమును చూడండి. ఇంకా, శాశ్వత కాలము పరిపాలించే ఒక రాజును దేవుడు స్థిరపరుస్తాడు అని2 సమూయేలు 7వ అధ్యాయము చెపుతుంది.దావీడునకు చేయబడిన ఈ వాగ్దాన నెరవేర్పు సొలోమోను కాకపోవచ్చు. కాబట్టి, ఈ వాగ్దానము ఇంకను నెరవేరబడవలసి ఉన్నది.

ఇదంతయు మనస్సులో ఉంచుకొని, ప్రకటన 20:1-7 వచనములలో ఏమి నమోదుచేయబడి ఉందో పరీక్షించండి. ఈ వాక్యభాగములో మరలా మరలా ప్రస్తావించబడిన వెయ్యేళ్ల పరిపాలన అనునది అక్షరాలా క్రీస్తు ఈ భూమిపై చేపట్టే 1000 సంవత్సరముల పాలనను సూచించేదిగా ఉంది. ఒక నాయకుని గూర్చి దేవుడు దావీదుతో చేసిన వాగ్దానము ఇంకా నెరవేర్చబడవలసి యున్నదని మరియు అది ఇంకా జరుగలేదు అని చెప్పిన విషయమును ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. పూర్వ సహస్రాబ్ది వాదన ఈ వాక్యభాగమును క్రీస్తు సింహాసనము మీద ఉండుట ద్వారా ఈ నెరవేరని ఈ వాగ్దానము నెరవేరుతుంది అని చూస్తుంది. దేవుడు అబ్రాహాము మరియు దావీదులతో బేషరతు నిబంధనలు చేసాడు. ఈ నిబంధనలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా లేదా శాశ్వతముగా నెరవేర్చబడలేదు. దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఈ నిబంధనలు నెరవేర్చబడాలంటే అక్షరార్థమైన, భౌతికమైన క్రీస్తు పాలనే ఒకే ఒక మార్గం.

లేఖనములను విశదపరచుటలో అక్షరార్థ పధ్ధతిని అన్వయించుట వలన గజిబిగిగా ఉన్న కొన్ని పెట్టెలు దగ్గరగా వస్తున్నట్లుగా ఉంటుంది. యేసు యొక్క మొదటి రాకడను గూర్చి పాతనిబంధనలో చేసిన వాగ్దానములన్నియు అక్షరాలా నెరవేరినవి. కాబట్టి, ఆయన యొక్క రెండవ రాకడను గూర్చి చేయబడిన ప్రవచనములు కూడా ఉన్నవి ఉన్నట్లుగానే నెరవేరుతాయి అని మనము ఆశించాలి. దేవుని నిబంధనలు మరియు అంత్యదినములను గూర్చిన ప్రవచనములను అక్షరార్థముగా విశదపరచుటకు అంగీకరించే ఒక ఒక్క విధానము ఈ పూర్వ సహస్రాబ్ది వాదన.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పూర్వ సహస్రాబ్ది వాదన అనగానేమి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries