ప్రశ్న
వివాహమునకు నాకు నేను ఏ విధంగా సిద్ధపడవచ్చు?
జవాబు
వివాహం కొరకు తమనుతాము సిద్దపరచుకోవడం బైబిల్ ప్రకారం ఎలాగంటే జీవిత ప్రయత్నంలో సన్నద్దమౌతున్నట్లే. తిరిగి జన్మించిన విశ్వాసులంగా మన జీవిత అన్ని అంశాలను నడుపుటకు ఒక నియమం ఉంది: “నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను. నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” (మత్తయి 22:37). ఇది అలక్షముగా మాట్లాడు ఆజ్ఞ కాదు. ఇది విశ్వాసులంగా మన జీవితాల్లో కేంద్ర బిందువు. దేవునిపై మరియు ఆయన వాక్కుపై మన పూర్ణహృదయంతో దృష్టి పెట్టడాన్ని ఎన్నుకోవడం తద్వారా ఆయనను ఇష్టపరచే వాటిని గూర్చిమన పూర్ణాత్మ మరియు మన పూర్ణమనస్సు నిండుతుంది.
యేసు క్రీస్తు ద్వార దేవునితో మనకున్న సంబంధం ఇతర అన్ని సంబంధాలను ఆ కోణంలోనే ఉంచుతుంది. వివాహ సంబంధం క్రీస్తు మరియు సంఘమునకు మధ్యనున్న సంబంధముపై ఆధారపడుతుంది (ఎఫెసీ. 5:22-33). మన జీవితంలో ప్రతి కోణం విశ్వాసులంగా ప్రభువు ఆజ్ఞలను మరియు నియమాలను అనుసరించి నడుచుకొంటానను ఒప్పందం ఆధారపడియుంటుంది. దేవుని పట్ల మరియు ఆయన వాక్కు పట్ల మనకున్న విధేయత వివాహంలో మరియు ప్రపంచంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి మనలను సిద్ధపరుస్తుంది. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి బాధ్యత అన్ని విషయాల్లో దేవునిని మహిమపరచడం (1 కొరింథీ. 10:31).
వివాహమునకు నిన్ను సిద్ధపరచుకోవడానికి, క్రీసుయేసు పిలుపుకు తగినట్లుగా జీవించుటకు, మరియు దేవుని వాక్యము ద్వార ఆయనతో సన్నిహితంగా ఉండుటకు (2 తిమోతి 3:16-17), ప్రతి విషయంలో విధేయత చూపుటపైన దృష్టి పెట్టాలి. దేవునికి విధేయత కలిగి జీవించడం నేర్చుకోడానికి సుళువైన ప్రణాళిక లేదు. లోక దృష్తిని ప్రక్కన పెట్టి మరియు బదులుగా దేవున్ని అనుసరించుటకు మనం అనుదినం మనం తీసుకొనవలసిన నిర్ణయం. క్రీస్తుకు తగినట్లుగా జీవించడమంటే ఒకే మార్గం, ఒకే సత్యం మరియు ఒకే జీవమైన వానిపై దినదినం, క్షణక్షణం నమ్రతతో మనకుమనం అప్పగించుకోవడం. మనం వివాహం పిలచే గొప్ప బహుమతికి ఈ విధంగా ప్రతి విశ్వాసి సిద్ధపడాలి.
ఆత్మీయతలో పరిపక్వముచెంది మరియు దేవునితో నడిచే ఒక వ్యక్తి ఇతరులందరి కంటే సిద్ధంగా ఉనాడు. వివాహం నిబద్ధతను, అభిమానమును, నమ్రతను, ప్రేమను మరియు గౌరవమును కోరుకుంటుంది. ఈ లక్షణాలన్నీ దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిలో విశదపరచబడుతుంది. నిన్నునీవు వివాహము కొరకు సిద్ధపరచుకొంటుండగా దేవుడు తన కిష్టమైన పురుషునిగా లేదా స్త్రీ చేసుకొనుటకు దేవుని చిత్తమునకు అప్పగించుకొనుడి (రోమా. 12:1-2) నీవు ఆయనకు సమర్పించుకొంటె, ఆ అద్భుతమైన దినం వచ్చినప్పుడు నీవు సిద్ధంగా ఉండుటకు ఆయన సహాయం చేస్తాడు.
English
వివాహమునకు నాకు నేను ఏ విధంగా సిద్ధపడవచ్చు?