ప్రశ్న
అంత్య కాలంపై ప్రేటెరిస్టుల చిత్రము ఏమిటి?
జవాబు
ప్రేటెరిసం ప్రకారం, బైబిలులో ఉన్న అన్ని ప్రవచనాలు నిజముగా చరిత్ర. ప్రకటన గ్రంథము గూర్చి ప్రేటెరిస్టుల లేఖన ముల అనువాదం మొదటి-శతాబ్దపు సంఘర్షణల, అంత్యకాలములో ఏమిజరుగునో వివరణ కాకుండా చిత్ర దృశ్యముగా ఉండెను. ప్రేటెరిసం అనే పదము praeter అనే లాటిన్ పదము నుండి వచ్చినది, దాని అర్ధము “గతించిన.” అందువలన, ప్రేటెరిసo అనేది “అంత్య కాలాలు” గూర్చిన బైబిలు ప్రవచనాలు ముందే గతములో పరిపూర్ణము చేయబడినవనే చిత్రము. ప్రేటెరిసం ప్రత్యక్షంగా భవిష్యత్తును వ్యతిరేకించును, అది అంత్యకాల ప్రవచనములు ఇంకా భవిష్యత్తులో పరిపూర్ణము చేయబడాలి అన్నట్లు చూచును.
ప్రేటెరిసం రెండు రకాలుగా విభాగింపబడెను: సంపూర్ణ (లేక స్థిరమైన) ప్రేటెరిసం మరియు పాక్షిక ప్రేటెరిసం. ఈ వ్యాసం కేవలం సంపూర్ణ ప్రేటెరిసం (లేక కొందరు పిలచునట్లు, అతి ప్రేటెరిసం ) పైన చర్చ హద్దులలోనే ఉండును.
ప్రేటెరిసం ప్రకటన గ్రంథము యొక్క భవిష్యత్ ప్రవచన నాణ్యతను ఖండించును. AD 70లో రోమన్లు యెరూషలేముపై దాడిచేసి నాశనము చేసినప్పుడే క్రొత్త నిబంధనలోని ఆని అంత్య కాల ప్రవచనాలు పరిపూర్ణము చేయబడెనని ప్రేటెరిస్ట్ కదలిక తప్పనిసరిగా బోధించును. ప్రేటెరిసం ప్రతి సంఘటన సాధారణముగా అంత్య కాలాలు- క్రీస్తు రెండవ రాకడ, శ్రమలు, మృతులు లేపబడడం, చివరి తీర్పుతో సంబంధం కలిగిఉండునని అవి ముందే జరిగినవని బోధించును. (చివరి తీర్పు విషయంలో, అది ఇంకా నెరవేర్చబడే క్రమములో వున్నది). యేసు భూమిపైకి తిరిగిరావడం అనేది “ఆత్మీయo”, గాని శారీరికమైనది కాదు.
ప్రేటెరిసం AD 70లో ధర్మశాస్త్రం పరిపూర్ణం చేయబడి మరియు ఇశ్రాయేలుతో దేవుని నిబంధన ముగించబడినదని బోధించును. ప్రకటన 21:1 లో చెప్పబడిన “క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి”, ఒక ప్రేటెరిస్టుకు, క్రొత్త నిబంధన క్రింద ప్రపంచ వివరణ. ఒక క్రైస్తవుడు ఒక “నూతన సృష్టి” (2 కొరింథీ 5:17)గా మార్చబడినట్లుగా, క్రొత్త నిబంధన క్రింద ప్రపంచము కూడా ఒక “క్రొత్త భూమి.” ప్రేటెరిసం యొక్క ఈ అంశం వేదాంత భర్తీగా ఒక నమ్మకమునకు సులువుగా దారితీయును.
ప్రేటెరిస్టులు సాధారనముగా యేసు అంజూరపు చెట్టు ఉపమానమును వారి వాదనకు బలముగా సూచించును. యేసు చివరి గడియలలో జరిగే వాటినిగూర్చి చెప్పిన తర్వాత, అతడు, “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” (మత్తయి 24:34). ఆ ప్రేటెరిస్టు దానిని యేసు మత్తయి 24 మాట్లిడిన ప్రతి దానిని ఆయన మాట్లాడినట్లు ఒకే తరములో జరిగెనని అర్ధముగా భావించి- AD 70లో యెరూషలేము నాశనము అందువలన “తీర్పు దినము” అని తీసుకొనును.
ప్రేటెరిసంతో చాలా సమస్యలు వున్నవి. ఒక దానికొరకు, ఇశ్రాయేలుతో దేవుని నిబంధన నిత్యము (యిర్మీయా 31:33-36), మరియు భవిష్యత్తులో ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడును (యెషయా 11:12). అపొస్తలుడైన పౌలు, హుమెనైయు మరియు ఫిలేతు వలే, తప్పుగా బోధించుచు “పునరుత్థాణము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారని” వారికి వ్యతిరేకముగా వారించెను (2 తిమోతి 2:17-18). మరియు “ఈ తరము” యొక్క యేసు ప్రస్తావన మత్తయి 24 లో వివరింపబడిన సంగతుల ప్రారంభమును చూచుటకు బ్రతికియున్న సగటు వారసులు.
మరణానంతర జీవిత చరిత్ర ఒక సంక్లిష్ట అంశం, మరియు అలౌకిక ఊహాచిత్రముల బైబిలు వాడుక చివరి గడియలలో జరిగే సంఘటనల అనేక ప్రవచనములు వివిధ రకాలుగా అనువదింపబడెను. ఈ విషయాల గూర్చి క్రైస్తవులలోనే కొద్దిగా భేదాభిప్రాయమునకు చోటు ఉండెను. అయితే, సంపూర్ణ ప్రేటెరిసం కొన్ని తీవ్రమైన లోపములు కలిగియుండి క్రీస్తు రెండవ రాకడనే భౌతిక నిజామును మరియు యెరూషలేము యొక్క నాశన సంఘటనను నిరోధించుటచే శ్రమల యొక్క భయంకర గుణమును క్రిందఉంచి దానిని ఖండించును.
English
అంత్య కాలంపై ప్రేటెరిస్టుల చిత్రము ఏమిటి?