ప్రశ్న
క్రైస్తవ తల్లితండ్రులు ఒకవేళ వారికి ఒక తప్పిపోయిన కుమారుడు (లేక కుమార్తె) వుంటే ఏమి చేయాలి?
జవాబు
తప్పిపోయిన కుమారుని కధలో (లూకా 15:11-32) స్వాభావికంగా తల్లితండ్రులు పిల్లలతో స్పందించి మరియు వ్యవహరించుటకు ఎవరైతే తల్లితండ్రులు వారిని పెంచిన విధానమునకు విరుద్ధంగా నడుస్తారో వారు ఉపయోగించుటకు చాలా నియమాలు ఉండెను. తల్లితండ్రులు ఒకసారి వారి పిల్లలు పెద్దవారిగా మారితే, వారు తల్లితండ్రుల అధికారము క్రింద మరి ఉండరని గుర్తించుకొనవలసిన అవసరం ఉంది.
తప్పిపోయిన కుమారుని కధలో, చిన్న కుమారుడు తన స్వాస్థ్యమును తీసికొని దూర దేశమునకు పోయి మరియు దానిని వృధా చేసెను. ఒక పిల్లవాని విషయంలో ఎవరైతే తిరిగి-జన్మించని విశ్వాసో, ఇది కేవలం సహజంగా చేసే పని. ఒకసారి క్రీస్తులో విశ్వాసపు ఒప్పుకోలు స్పష్టముగా చేసిన పిల్లవాని విషయములో, మనము ఆ పిల్లవానిని “తప్పిపోయినవాడు” అంటాము. ఈ పదమునకు అర్ధము “తన వనరులను వ్యర్ధముగా ఖర్చుపెట్టిన వ్యక్తి,” తన తల్లితండ్రులు తనకు ఇచ్చేదానిలో ఇల్లి వదిలి మరియు ఆత్మీయ స్వాస్థ్యమును వృధాచేయుటకు ఒక మంచి వర్ణన. పోషించి, బోధించి, ప్రేమించి, మరియు జాగ్రత్త తీసుకొనిన అన్ని సంవత్సరాలు మర్చిపోయి దేవుని వ్యతిరేకముగా తిరగబడును. సమస్త తిరిగుబాటు మొదట దేవునికి వ్యతిరేకముగా, మరియు అది తల్లితండ్రులు మరియు వారి అధికారమునకు వ్యతిరేకమైన తిరుగుబాటు పనిచేయును.
ఈ ఉపమానములో తండ్రి తన కుమారుడు వెళ్లిపోతున్నప్పుడు అతనిని ఆపలేదని గుర్తించుము. అలాగే అతడు అతని రక్షించుటకు అతనిని అనుసరించలేదు. అయితే, ఈ తండ్రి నమ్మకముగా ఇంటివద్ద వుంది మరియు ప్రార్థించెను, మరియు ఆ కుమారునికి “బుద్ధి వచ్చినప్పుడు” మరియు మరల తిరిగి మరియు వెనుకకు ప్రయాణమాయెను, ఆ తండ్రి ఎదురుచూస్తూ మరియు కనిపెడుతూ మరియు అతడింకా “దూరముగా” ఉన్నప్పుడే పరుగెత్తి పలకరించెను.
మన కుమారులు మరియు కుమార్తెలు వారి స్వంతముగా వెళ్లిపోయినప్పుడు – వారు న్యాయముగా అలచేయుటకు వయస్సు కలదని ఊహించి – మరియు మనకు తెలుసు వారు చేసిన ఎంపికలు కష్ట పరిణామాలను తెచ్చునని, తల్లితండ్రులు వారిని వెళ్ళనిచ్చి మరియు వదిలివేయుటకు అనుమతించాలి. తల్లితండ్రులు వారివేనుక అనుసరించకుండా, మరియు వచ్చే పరిణామాలలో తల్లితండ్రులు తలదూర్చకుండా ఉండాలి. అయినా, ఆ తల్లితండ్రి ఇంటివద్ద వుండి, నమ్మకముగా పార్తిస్తూ మరియు మారుమనస్సు సూచన కొరకు మరియు దిశ మార్పుకు కనిపెడుతూ ఉండాలి. అది వచ్చే వరకు, తల్లితండ్రి వారి స్వంత న్యాయమును వుంచుకొని, తిరుగుబాటును ప్రోత్సహించకుండా, మరియు జోక్యం చేసికొనకూడదు (1 పేతురు 4:15).
ఒకసారి పిల్లలు న్యాయముగా యవ్వన వయస్సు కలిగియున్నప్పుడు, వారు కేవలం దేవుని అధికారమునకు మరియు ప్రభుత అధికారుల అధికారము క్రిందకు వచ్చును (రోమా. 13:1-7). తల్లితండ్రులుగా, మనము మన తప్పిపోయినవారిని ప్రేమతో మరియు ప్రార్థనతో సహకరించి మరియు వారు ఒకసారి దేవుని వైపుకు కదిలించబడినప్పుడు వారి ప్రక్కన వచ్చుటకు సిద్ధముగా ఉండాలి. దేవుడు తరచుగా స్వకష్టాలను మనకు జ్ఞానము తెచ్చుటకు వాడును, మరియు అది ప్రతి వ్యక్తిగత వ్యక్తికి సరియైన విధానములో స్పందించే విషయం. తల్లితండ్రులుగా, మనము మన పిల్లలను రక్షించలేము- అది కేవలం దేవుడే చేయగలడు. ఆ సమయము వచ్చేవరకు, మనము కనిపెట్టి, ప్రార్థించి, మరియు ఆ విషయాన్ని దేవుని చేతికి వదిలివేయాలి. ఇది కష్టతరమైన ప్రక్రియ, కాని అది బైబిలు సంబంధముగా బయటకు తేబడినప్పుడు, అది మన మనస్సుకు మరియు హృదయమునకు నెమ్మదిని తెచ్చును. మనము మన పిల్లలను తీర్పుతీర్చలేము, కేవలం దేవుడే చేయగలడు. దీనిలో గొప్ప ఆదరణ వుంది: “సర్వలోకమునకు తీర్పుతీర్చువాడు న్యాయము చేయడా?” (ఆదికాండము 18:25b).
English
క్రైస్తవ తల్లితండ్రులు ఒకవేళ వారికి ఒక తప్పిపోయిన కుమారుడు (లేక కుమార్తె) వుంటే ఏమి చేయాలి?