ప్రశ్న
సంపన్న సువార్త గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది?
జవాబు
సంపన్న సువార్తలో, “విశ్వాస వాక్యం”గా కూడా తెలిసిన దానిలో, విశ్వాసి దేవుని వాడుకొనినట్లు చెప్పబడును, అయితే బైబిలు సంబంధమైన క్రైస్తవ్యం యొక్క సత్యము దీనికి కేవలం వ్యతిరేకం- దేవుడు విశ్వాసిని వాడుకొనును. విశ్వాస వాక్యం లేక సంపన్న వేదాంతం పరిశుద్ధాత్మను విశ్వాసి ఏది కోరుకొనునో దానికొరకు వాడుకొనే శక్తిగా చూచును. బైబిలు పరిశుద్ధాత్మ విశ్వాసి దేవుని చిత్తమును అనుమతించే ఒక వ్యక్తిగా బోధించును. సంపన్న సువార్త కదలిక కొన్ని నాశనకర దురాశ వర్గములు ప్రారంభ సంఘములోనికి చొరబడడానికి దగ్గరగా పోలియుండును.పౌలు మరియు ఇతర అపొస్తలులు అలాంటి నాస్తికత్వమును పుట్టించే అబద్ద బోధకులతో సర్దుకుపోవడం లేక శాంతిపూర్వకంగా ఉండుట లేదు. వారు వారిని అపాయకరమైన అబద్ద బోధకులుగా గుర్తించి మరియు క్రైస్తవులను వారిని నిరోధించమని బ్రతిమాలెను.
1 తిమోతి 6:5, 9-11లో పౌలు తిమోతిను అలాంటి వ్యక్తుల గూర్చి వారించెను. “చెడిపోయిన మనస్సుకలిగిన” మనుష్యులు దైవభక్తి లాభసాధనమై మరియు ధనవంతులగుటకు ఆపేక్షించువారు “శోధనలోను, ఉరిలోను” పడుదురు (వ. 9). ధనమును వెంబడించుట క్రైస్తవులకు అపాయకరమైన మార్గము మరియు దేవుడు వారించే ఒక విషయం: “ఎందుకనగా ధనాపేక్షసమస్త మైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మునుతామే పొడుచు కొనిరి” (వ. 10). ఒకవేళ ధనము దైవభక్తి గలవారికి సహేతుకమైన గమ్యమైతే, యేసు దానిని అనుసరించి యుండును. కాని అతడు చేయలేదు, బదులుగా తన తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని సూచించెను (మత్తయి 8:20) మరియు ఆయన శిష్యులకు అదే బోధించెను. కేవలం ఒకే శిష్యుడు ధనముపట్ల ఆసక్తి కలిగినది యూదా అని కూడా గుర్తుంచుకోవాలి.
పౌలు దురాశ విగ్రహారాధన అని (ఎఫెసీ 5:5) మరియు ఎవరైనా అనైతిక లేక దురాశ వర్తమానమును తెస్తే వారిని నిరోధించమని ఎఫెసీయులకు సూచించెను (ఎఫెసీ 5:6-7). సంపన్న బోధ దేవుడు తన పనిని చేయుటకు నిషేధించును, దాని అర్ధమేమిటంటే దేవుడు అందరికి ప్రభువు కాదు ఎందుకనగా మనము ఆయన పనిని తాను చేయుటకు వదిలితే తప్ప ఆయన పనిచేయలేడు. విశ్వాసం, విశ్వాస వాక్య సిద్ధాంతం పకారం, దేవునికి లొంగియుండే నమ్మిక కాదు; విస్వాసమనునది ఆత్మీయ నియమములను మార్చి విశ్వమును పరిపాలించుటకని సంపన్న బోధకులు నమ్మే సూత్రము. “విశ్వాస వాక్యము” అనే పేరు సూచించునట్లుగా, ఈ ఉద్యమమo విశ్వాసమనగా మనం ఎవరిని నమ్ముతున్నాం లేక యే సత్యాలను మనం హృదయoలో ఆలింగనం చేసికొని ధ్రువపరిచే దానికన్నా ఎక్కవ మనమేమి చెప్పుచున్నామే బోధించును.
విశ్వాస వాక్య ఉద్యమంలో ఇష్టమైన పదము “అనుకూల ఒప్పుకోలు.” మాటలకు సృష్టించే శక్తి ఉన్నది అనె బోధను సూచించును. విశ్వాస వాక్యము, నువ్వు చెప్పేది, నీకు జరిగే ప్రతీదానిని నిర్ణయించును అని పేర్కొనును. నీ ఒప్పుకోలు, ప్రాముఖ్యంగా దేవునిని నీవు కోరే ఇష్టాలు, సందేహించకుండా అనుకూలముగా చెప్పాలి. అప్పుడు దేవుడు సమాధానo చెప్పాలి (మనుష్యునికి దేవునిది ఏదైనా అవసరం అన్నట్లు!). అందువలన, మనలను ఆశీర్వదించాలనే దేవుని సామర్ధ్యం మన విశ్వాసంపై ఆధారపడును. యాకోబు 4:13-16 స్పష్టముగా ఈ బోధను విభేదించును: “నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముoడి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.” భవిష్యత్తులో జరిగే విషయాలను పలకడం కంటే ముందు, రేపు ఏమి తెచ్చునో మనకు తెలియదు లేక మనము జీవించియుంటామే లేదో మనకు తెలియదు.
ధన ప్రాముఖ్యతపై ఒత్తిడి తెచ్చుటకు బదులుగా, బైబిలు దానిని వెంబడించుట వ్యతిరేకమని వారించును. విశ్వాసులు, మరిముఖ్యంగా సంఘములో నాయకులు (1 తిమోతి 3:3), ధనాపేక్షలేనివారై యుండాలి (హెబ్రీ 13:5). ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము (1 తిమోతి 6:10). యేసు, “మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని” వారించెను (లూకా 12:15). జీవితంలో ధనము మరియు సంపదలు సంపాదించుటపై విశ్వాస వాక్య ప్రాధాన్యతకు పదునైన విరుద్ధత, యేసు చెప్పెను “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు” (మత్తయి 6:19). సంపన్న బోధకు మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు సాధ్యముకాని విభేదాలు మత్తయి 6:24 లో యేసు మాటలతో సరిగ్గా కలిపితే, “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.”
English
సంపన్న సువార్త గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది?