ప్రశ్న
అతీంద్రియలు పట్ల క్రైస్తవ చిత్రము ఏమిటి?
జవాబు
పరిశుద్ధ గ్రంథము అభిచారమును, ఆవిష్టులును, క్షుద్రమును, మరియు అతీంద్రియలు బలముగా ఖండించును (లేవీ 20:27; ద్వితీ 18:10-13). జాతకములు, టారో కార్డులు, జ్యోతిషం, భవిష్యత్తు చెప్పేవారు, చేయి చదివేవారు, మరియు మృతులతో మాట్లాడేవారు కూడా ఈ వర్గము లోనికే వచ్చును. ఈ అలవాట్లు దేవుళ్ళు, ఆత్మలు, లేక ప్రేమించి మోసం చేయబడినవారిపై వారు సలహా ఇచ్చి మరియు నడిపించుననే విషయంపై అధారపడును. ఈ “దేవతలు” లేక “ఆత్మలు” దయ్యములు (2 కొరింథీ 11:14-15). బైబిలు ప్రేమించి మోసగింపబడిన వారు మనతో మాట్లాడునని నమ్ముటకు ఏ కారణం మనకు ఇవ్వలేదు. ఒకవేళ వారు విశ్వాసులైతే, వారు పరలోకములో చాలా అద్భుతమైన ఊహించినట్లుగా ప్రేమగల దేవునితో సహవాసం చేయుచూ ఆనందించును. ఒకవేళ వారు విశ్వాసులు కాకపోతే, వారు నరకములో దేవుని ప్రేమను తిరస్కరించి మరియు ఆయనపై తిరుగుబాటు వలన అంతులేని బాధను అనుభవించును.
అందువలన, ఒకవేళ మన బంధువులు మనతో మాట్లాడకపోతే, ఆవిష్టులు, అభిచారులు, మరియు అతీంద్రియలు అలాంటి ఖచ్చితమైన సమాచారము ఎలా పొందును? అతీంద్రియలు చాలా వరకు మోసమని బహిర్గతమాయెను. సమాచారము అతీంద్రియలు చాలా సాధారణ విధానంలో ఒకరిపై మరిఎక్కువ మొత్తములో పొందవచ్చునని నిరూపింపబడినది. కొన్నిసార్లు కాలర్ ID ద్వారా ఫోన్ నంబర్ వుపయోగించి మరియు ఇంటర్నెట్లో వెదకి, ఒక అతీంద్రియుడు పేర్లు, చిరునామాలు, పుట్టిన తేదీలు, పెండ్లి తేదీలు, కుటుంబ సభ్యులు, మొదలగునవి పొందవచ్చు. అయితే, కొన్నిసార్లు అతీంద్రియులకు వారు తెలుసుకోవడం సాధ్యంకాని విషయాలు తెలియడం ఖండించలేము. ఈ సమాచారము వారు ఎక్కడ పొందును? జవాబు సాతాను మరియు అతని దయ్యములు. “ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరిoచుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును” (2 కొరింథీ 11:14-15). అపొ 16:16-18 సోదె చెప్పుట ద్వారా భవిష్యత్తును అంచనా వేసే ఆమె నుండి అపొస్తలుడైన పౌలు ఆమె నుండి దయ్యమును వదిలించుటను వివరించును.
సాతాను దయగా మరియు సాయము చేయుచున్నట్లు నటించును. అతడు కొంచమైనా మంచిగా కనిపించే ప్రయత్నము చేయును. సాతాను మరియు అతని దయ్యములు ఒక వ్యక్తి గూర్చి అతింద్రియ సమాచారమును ఇచ్చి ఆ వ్యక్తిని అభిచారములోను, దేవుడు నిషేధించే ఏదోవిషయాన్ని కట్టిపడవేయును. మొదటిలో ఇది అమాయకముగా కనబడును, కాని త్వరలోనే ప్రజలు వారినివారు అతీంద్రియులకు బానిసలుగా చేసికొని మరియు తెలియకుండానే సాతాను వారిని లోపరచుకొని మరియు వారి జీవితములను నాశనము చేయును అని కనుగొనును. పేతురు ప్రకటించును, “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” (1 పేతురు 5:8). కొన్ని సార్లు, అతింద్రియులు వారికివారే మోసపరచుకొనును, వారు పొందుకొనిన సమాచారము నిజమైన ఆధారము కాదని తెలుసుకోలేదు. విషయమేదైనా మరియు సమాచారము యొక్క ఆధారము ఎక్కడున్నా ఏదీకూడా అభిచారమునకు, మంత్ర విద్య లేక జ్యోతిషంతో దైవిక సంబంధమైన సమాచారమును కనుగొనుటకు సంబంధించిలేదు. దేవుడు మన జీవితమునకు ఆయన చిత్తమును వివేచించాలని ఎలా కోరును? దేవుని ప్రణాళిక సులువు, అయినా శక్తివంతమైనది మరియు ప్రభావితమైనది: బైబిలును అధ్యయనం చేసి (2 తిమోతి 3:16-17) మరియు జ్ఞానము కొరకు ప్రార్థించాలి (యాకోబు 1:5).
English
అతీంద్రియలు పట్ల క్రైస్తవ చిత్రము ఏమిటి?