బైబిలు జాతిద్వేషం, దుర్భ్రమ మరియు తారతమ్యముల గురించి ఏమిచెప్తుంది?ప్రశ్న: బైబిలు జాతిద్వేషం, దుర్భ్రమ మరియు తారతమ్యముల గురించి ఏమిచెప్తుంది?

జవాబు:
ఈ సంభాషణలో అర్థంచేసుకోవాల్సిన మొట్టమొదటి విషయమేంటంటే అక్కడ ఒకే ఒక జాతిఉన్నది-అదే మానవజాతి. కాస్కేషియనులు, అఫ్రికన్లు, ఆసీయా వారు, భారతదేశమువారు, అరబ్బీయులు, మరియు యూదులు వేర్వేరే జాతికి చెందినవారు కాదు. దానికంటే, వారు మానవులే కాకపోతే ఒక ప్రత్యేక వేర్వేరు సంస్కృతికి చెందిన జాతి. మానవులందరు ఒకే సమానమైన శారీరక గుణలక్షణాలు కలిగినవారు ( కొంచెం చిన్న చిన్న మార్పులతో, అంతే). మరి ముఖ్యముగా, మానవులమ్దరు దేవుని స్వరూపములో మరియు ఆయన పోలికెచొప్పున సృష్ఠించబడ్డారు (ఆదికాండం 1:26-27). దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆయన తన అద్వితీయకుమారుడైన యేసుని మనకొరకై ప్రాణము పెట్టుటకు పంపించెను (యోహాను 3:16). "లోకము" అంటే ప్రత్యక్షముగా కన్పడే ఒక సంస్కృతికి చెందిన తెగవారే.

దేవుడు స్వాభిమానము లేక పక్షపాతము కలిగినవాడు కాడు (ద్వితియోపదేశకాండం 10:17; అపోస్తలుల కార్యములు 10:34: రోమా 2:11; ఎఫెసీయులకు 6:9), మరియు మనముకూడ ఉండకూడదు. యాకోబు 2:4 వివరించేది "దురాలోచనలతో విమర్శ చేసినవారగుదురు." దానికి బదులుగా, మనలను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించవలెను (యాకోబు2:8). పాతనిబంధనలో, దేవుడు మానవత్వాన్ని రెండు "తెగల" గుంపులుగా వేరుచేసాడు: యూదులు మరియు అన్యులు. దేవునికి యూదులపట్ల కలిగిన ఉద్డేశ్యమేంటంటే వారు యాజకులు గల రాజ్యముగాను, అన్యులదేశపు ప్రజలమధ్య సేవచేయుటకు వారిని దేవుడు నిర్ణయించాడు. దానికి బదులుగా, చాలాభాగమును చూస్తే, యూదులు వారి స్థ్తినిబట్టి గర్విస్తూ మరియు అన్యులను నిర్లక్ష్యముచేసారు. యేసుక్రిస్తు దీనిని అంతమొందించారు, మధ్యనున్న ప్రాతికూల్యమనే అడ్డుగోడను నాశనము చేసెను(ఎఫెసీయులకు 2:14). అన్నిరకాల జాతిద్వేషం, దుర్భ్రమ మరియు విపక్షత అనేవి సిలువమీద యేసుచేసిన పనిని తిరస్కరించేవిగా ఉన్నాయి.

మీరు ఒకరి నొకరు ప్రెమింపవలెనని మీకు ఒక క్రొత్త ఆఙ్ఞనిచ్చుచున్నానని యేసు చెప్పెను (యోహాను 13:34). ఒకవేళ దేవుడు నిష్పక్షపాతి మరియు మనలను ఆనిష్పక్షపాతముతోనే ప్రేమిస్తున్నట్లయితే, అప్పుడు మనముకూడా అత్యధికమైన విలువలతోనే ప్రేమింపబద్డులమైయున్నాము. మత్టయి 25లో మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా యేసు చెప్పెను. ఒక వ్యక్తిని మనము అలక్ష్యముగా చూసినట్లయితే, మనము ఆవ్యక్తి దేవుని స్వరూపములోనున్నాడని మరచి అతనిని తిరస్కరించినట్లవుతుంది; దేవుడు ప్రేమించేవానిని మరియు ఎవరికోసం యేసు మరణించాడో వారిని మనము కష్ఠపెట్టినట్లే.

జాతిద్వేషం, రకరకాల రూపాలలో మరియు వేర్వేరు మెట్టులలో, కొన్ని వేలకొలది సంవత్సారాలనుండి మానవత్వంపై విడువని తెగుళ్ళులాగా వెంటాడుతూనే ఉంది. అన్ని తెగల ప్రజానీకానికి చెందిన సహోదరులు మరియు సహోదరులారా, ఇలాగు జరుగకూడదు. జాతిద్వేషం, దుర్భ్రమ మరియు విపక్షతకు బానిసలైన వారిని క్షమించాల్సిన అవసరత ఎంతైనావుంది. ఎఫెసీ పత్రిక 4:32లో "ఒకని యెడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." జాతివిపక్షము చూపించేవారికి నీనుండి క్షమాపణపొందుటకు అర్హులు కారు, గాని మనము దేవుడు నుండి క్షమాపణపొందుటకు కొద్దోగొప్పో అర్హులము. ఎవరైతే జాతిద్వేషం, దుర్భ్రమ మరియు తారతమ్యము చూపించుట అభ్యసిస్తున్నారో, వారు పశ్చత్తాపపడవలెను. " మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి" (రోమా 6:13). గలతీ 3:28లో నున్నట్లు పూర్తిగా తెలుసుకోవాలి " ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు; పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరు ఏకముగా ఉన్నారు."


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలు జాతిద్వేషం, దుర్భ్రమ మరియు తారతమ్యముల గురించి ఏమిచెప్తుంది?