ప్రశ్న
నా కొరకు ఒక సరియైన ధర్మము ఏది?
జవాబు
మనకు ఇష్టమొచ్చిన ఆహారమును సెలవిచ్చి మనకు ఇష్టమొచ్చినట్లు పొందుకొనుటకు ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లు మనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. కొన్ని కాఫీ షాపులు అయితే వందల రకాల కాఫీ రుచులు వారి యొద్ద ఉన్నట్లుగా కూడా గొప్పలు చెప్పుకుంటాయి. ఇళ్ళను మరియు కారులను కూడా కొనేటప్పుడు, మనకు నచ్చిన అన్ని ఎంపికలు మరియు సౌకర్యములు అందులో ఉండేట్లుగా మనం చూసుకుంటాం. కేవలం ఒక చాక్లేట్, వెనిలా, లేదా స్ట్రాబెర్రీ ప్రపంచంలో మాత్రమే మనం లేము. ఎంచుకోవడం అనేది రాజులాంటిది! మీ వ్యక్తిగత ఇష్టాలు మరియు అవసరతలకు తగినట్లుగా దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు.
కాగా మీకు సరైనదిగా ఉండే ధర్మము ఏంటి? నేరారోపణలు లేని, షరతులు లేని, అది చేయాలి ఇది చేయకూడదు అని మనలను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఒక ధర్మము సంగతి ఏంటి? నేను ఇక్కడ వివరించినట్లుగానే బయట కొన్ని ఉన్నాయి. కాని ఐస్ క్రీమ్ లో ఉండే రుచుల వలెనె ఎన్నుకొనుటకు ధర్మము అటువంటిదేనా?
మన ఆశక్తిని దోచుకొనే అనేక విధమైన శబ్దాలు మనకు వినబడుతుండగా, యేసును అందరికంటే, అనగా మహమ్మద్ లేదా కన్ఫూసియస్, బుద్ధ, లేదా చార్లెస్ టేజ్ రస్సెల్, లేదా జోసెఫ్ స్మిత్, ఎక్కువగా ఎందుకు ఒకరు పరిగణించాలి? మెట్టుకు అన్ని దారులు పరలోకమునకు నడిపించవా? అన్ని ధర్మములు మామూలుగా ఒకటే కావా? సత్యమేమంటే అన్ని దారులు ఇండియానాకు చేరవు అలాగే అన్ని ధర్మములు కూడా పరలోకమునకు చేరవు.
యేసు మాత్రమే దేవుని అధికారముతో మాట్లాడతాడు ఎందుకంటే యేసు మాత్రమే మరణమును జయించాడు. మహమ్మద్, కన్ఫూసియస్ మరియు ఇతరులు తమ సమాధులలోనే నేటికి కూడా మ్రగ్గుతున్నారు. కాని యేసు, తన సొంత శక్తి ద్వారా క్రూరమైన రోమా శిలువపై మరణించిన మూడు దినముల తరువాత సమాధి నుండి తిరిగి నడచి వెళ్ళాడు. మరణమును ఎవరైతే జయిస్తారో వారు మన ఆశక్తిని చురగొంటారు. మరణమును కూడా జయించే శక్తి ఎవరికి ఉంటుందో వారు మన వినికిడికి యోగ్యులు.
యేసు పునరుత్ధానమును నిరూపించే ఆధారములు అబ్బురపరచేవిగా ఉన్నాయి. మొదటిగా, తిరిగి లేచిన క్రీస్తును చూచినవారు అయిదు వందల మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అయిదు వందల స్వరములు నిర్లక్ష్యము చేయబడలేవు. ఖాళి సమాధి అనే ఒక విషయం కూడా ఉంది. యేసు యొక్క శత్రువులు ఆయన యొక్క మృతమైన, చీకిపోయే శరీరమును తెచ్చి ఆయన యొక్క పునరుత్ధానమును గూర్చిన వదంతులను ఆపి ఉండవచ్చు, కాని అలా చేయుటకు వారికి యేసు దేహము లేదు! ఆ సమాధి ఖాళీగా ఉంది! శిష్యులు ఆయన దేహమును దొంగిలించి ఉంటారా? కష్టమే. అటువంటి ఒక అవకాశాన్ని అరికట్టడానికి, యేసు యొక్క సమాధి సాయుధ సైనిక బలం చేత కావలి చేయబడింది. ఆయన బందీ మరియు శిలువ మరణము తరువాత భయముతో ఆయన సమీప శిష్యులు పారిపోవడాన్ని బట్టి చూస్తే, భయానకులైన ఈ విలువలేని జాలరులు శిక్షణ పొందిన వృత్తిరీత్యా సైనికులతో హోరాహోరీగా పోరాడారా అనేది చాలా అసాధ్యమైన విషయం. లేదా ఈ మోసము కొరకు వారి జీవితములను త్యాగము చేసి హతసాక్షులు అయ్యేవారు కారు – వారిలో చాలా మంది అయ్యారు అనుకోండి! సుళువైన వాస్తవమేమంటే యేసు యొక్క పునరుత్ధానమును ఒట్టిమాటగా కొట్టివేయలేము.
మరలా, మరణముపై ఎవరికైతే అధికారము ఉంటుందో అట్టివారు మన వినికిడికి యోగ్యులు. యేసు మరణముపై తన శక్తిని నిరూపించాడు; కాబట్టి, ఆయన చెప్పేది మనం వినాలి. రక్షణకు ఆయన మాత్రమే ఏకైక మార్గంగా యేసు చెప్పాడు (యోహాను 14:6). ఆయన ఒక మార్గం కాదు; అనేక మార్గములలో ఆయన ఒక మార్గము కాదు. యేసే మార్గము.
ఇదే యేసు చెప్తున్నాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును” (మత్తయి 11:28). ఇది చాలా కష్టమైన లోకము మరియు జీవితము చాల కష్టం. మనలో చాలా మంది ఎక్కువగా కొట్టబడ్డాము, గాయపరచబడ్డాము, మరియు యుద్ధ-మరకలు మోస్తున్నాము. అంగీకరిస్తున్నారా? కాబట్టి మీకు ఏమి కావలి? పునరుద్ధరణా లేక వట్టి ధర్మమా? జీవముగల రక్షకుడా లేక అనేకమంది మృతులైన “ప్రవక్తల”లో ఒకడా? అర్ధవంతమైన సహవాసమా లేక ఖాళీ ఆచారములా? యేసు ఒక ఎంపిక కాదు – ఆయనే ఎంపిక.
మీరు క్షమాపణను కోరుకుంటే యేసు సరియైన “ధర్మము” (అపొ.కా. 10:43). దేవునితో ఒక అర్ధవంతమైన సహవాసమును కోరుకుంటే యేసు సరియైన “ధర్మము” (యోహాను 10:10). పరలోకములో మీరు నిత్య గృహమును కోరుకుంటే యేసు సరియైన “ధర్మము” (యోహాను 3:16). యేసు క్రీస్తుపై మీ రక్షకునిగా విశ్వాసమును ఉంచండి; మీరు దీనికి బాధపడరు! మీ పాపముల క్షమాపణ కొరకు ఆయనను నమ్మండి; మీరు నిరుత్సాహపడరు.
దేవునితో “సరియైన సహవాసమును” మీరు కోరుకుంటే, ఇక్కడ ఒక సుళువైన ప్రార్ధన ఉంది. గుర్తుంచుకోండి, ఈ ప్రార్ధన చెప్పడమో లేక వేరే ప్రార్ధన చెప్పడము వలననో మీరు రక్షింపబడలేరు. క్రీస్తుపై ఆధారపడుట మాత్రమే మీ పాపము నుండి మిమ్మును కాపాడగలదు. ఈ పార్ధన కేవలం దేవుని యందు మీకున్న విశ్వాసమును తెలపడం మరియు మీ రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడమే. “దేవా, నీకు విరోధంగా నేను పాపము చేశాను అని నాకు తెలుసు కాబట్టి నేను శిక్షార్హుడను. కాని నేను పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు తీసివేశాడు కాగా ఆయనయందు విశ్వాసముద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా నమ్మకాన్ని నీపై ఉంచుతున్నాను. ఆశ్చర్యకరమైన మీ కృపను బట్టి మరియు క్షమాపణను బట్టి – నిత్య జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు! ఆమెన్!”
మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.
English
నా కొరకు ఒక సరియైన ధర్మము ఏది?