ప్రశ్న
పాపి యొక్క ప్రార్థన ఏమిటి?
జవాబు
పాపి యొక్క ప్రార్థన అనగా ఒక వ్యక్తి తాను పాపినని తనకు రక్షకుడు అవసరమని గ్రహించినప్పుడు అతడు/ఆమె దేవునికి చేయు ప్రార్థన. పాపి యొక్క ప్రార్థన చేయుట మాత్రమే ఏమి సాధించలేదు. ఒక నిజమైన పాపి ప్రార్థన ఒక వ్యక్తి తన పాపపు స్వభావమును మరియు రక్షకుని యొక్క అవసరతను యెరిగి, గ్రహించి, నమ్ముటను తెలియజేస్తుంది.
పాపి ప్రార్థన యొక్క మొదటి మెట్టు మనమంతా పాపులమని గ్రహించుట. “ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,” అని రోమా. 3:10 చెబుతుంది. మనమంతా పాపము చేసితిమని బైబిల్ స్పష్టముగా చెబుతుంది. మనమంతా దేవుని యొక్క కరుణ మరియు క్షమాపణ యొక్క అవసరత కలిగియున్న పాపులము (తీతు. 3:5-7). మన పాపుము వలన మనం నిత్య శిక్షకు అర్హులం (మత్తయి 25:46). పాపి ప్రార్థన తీర్పుకు బదులుగా కృప కొరకు నివేదన. కోపమునకు బదులుగా కరుణ కొరకు నివేదన.
పాపి ప్రార్థనలో రెండవ మెట్టు, మన నశించిన పాపపు పరిస్థితి నుండి మనలను విమోచించుటకు దేవుడు ఏమి చేసెనో తెలుసుకొనుట. దేవుడు శరీరధారియై యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో మానవుడాయెను (యోహాను 1:1, 14). యేసు మనకు దేవునిని గూర్చిన సత్యమును బోధించి ఒక పూర్ణమైన నీతిగల పాపములేని జీవితమును జీవించెను (యోహాను 8:46; 2 కొరింథీ. 5:21). మనము పొందవలసిన శిక్షను తనపై వేసుకొని, మన స్థానంలో యేసు సిలువపై మరణించెను (రోమా. 5:8). పాపుముపై, మరణముపై, మరియు నరకముపై తన విజయమును నిరూపించుటకు యేసు మరణము నుండి తిరిగిలేచెను (కొలస్సి. 2:15; 1 కొరింథీ. 15వ అధ్యాయం). దీని వలన, మన పాపములు క్షమించబడి పరలోకమందు ఒక నిత్య గృహము యొక్క వాగ్దానమును పొందియున్నాము – యేసు క్రీస్తునందు మన విశ్వాసమును ఉంచినయెడల. మనం చేయవలసినదంతా ఆయన మన స్థానంలో మరణించి తిరిగిలేచెనని నమ్మటమే (రోమా. 10:9-10). మనం కేవలం కృప ద్వారానే, విశ్వాసం వలనే, యేసు క్రీస్తులోనే రక్షణ పొందగలం. “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే,” అని ఎఫెసీ. 2:8 ఘోషిస్తుంది.
మీరు మీ సొంత రక్షకునిగా యేసును నమ్ముచున్నారని తెలియజేయుటకు పాపి యొక్క ప్రార్థన చేయుట ఒక సులువైన మార్గము. రక్షణ పొందుటకు ఎలాంటి “మ్యాజిక్” మాటలు లేవు. కేవలం యేసు యొక్క మరణం మరియు పునరుత్ధానంపై విశ్వాసం మాత్రమే మనలను రక్షించగలదు. మీరు పాపి అని మరియు యేసు క్రీస్తు ద్వారా రక్షణ యొక్క అవసరత మీకు ఉందని గ్రహించిన యెడల, ఈ పాపి యొక్క ప్రార్థన మీరు దేవునికి చెయ్యవచ్చు: “దేవా, నేను పాపినని నాకు తెలుసు. నా పాపము యొక్క పరిణామాలకు నేను పాత్రుడనని కూడ నాకు తెలుసు. కాని, నా రక్షకునిగా యేసు క్రీస్తును నేను నమ్ముచున్నాను. ఆయన మరణం మరియు పునరుత్ధానం నా క్షమాపణకు వెల చెల్లించెను అని నమ్ముచున్నాను. నా సొంత ప్రభువు మరియు రక్షకునిగా నేను యేసును మరియు యేసును మాత్రమే నమ్ముచున్నాను. వందనాలు ప్రభువా, నన్ను రక్షించినందుకు మరియు క్షమించినందుకు! ఆమేన్!”
మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.
English
పాపి యొక్క ప్రార్థన ఏమిటి?