ప్రశ్న
బైబిలు బానిసత్వమును క్షమించునా?
జవాబు
బానిసత్వమును ఏదో గతమునకు సంబంధించిన దానిలా చూసే ధోరణి ఉంది. కాని ఇంకా ఈరోజుకు 27 మిలియన్ల ప్రజలు ప్రపంచములో బానిసత్వములో ఉండెనని అంచనావేయబడెను: నిర్భందిత కార్మికులు, లైంగిక వ్యాపారం, వారసత్వ ఆస్తి, మొదలగునవి. పాప బానిసత్వము నుండి విడిపింపబడిన వారివలే, యేసుక్రీస్తు యొక్క అనుచరులు ఈరోజు ప్రపంచములో మానవ బానిసత్వమును అరికట్టుటకు అందరికంటే విజేతలు. ప్రశ్న త్లేత్తును, అయినా, ఎందుకు బైబిలు బానిసత్వమునకు వ్యతిరేకముగా బలంగా మాట్లాడలేదు? బైబిలు, వాస్తవానికి, ఎందుకు మానవ బానిసత్వమును ప్రోత్సహించునట్లు కనబడును?
బైబిలు ప్రత్యేకంగా బానిసత్వమును పాటించుటను ఖండించదు. అది బానిసలు ఎలా వ్యవహరించాలో సూచనలిచ్చును (ద్వితీ 15:12-15; ఎఫెసీ 6:9; కొలస్సీ 4:1), కానీ బానిసత్వాన్ని మొత్తాన్ని చట్ట విరుద్ధం చేయదు. చాలామంది దీనిని బైబిలు అన్ని రకాలైన బానిసత్వములను ఖండించునట్లుగా చూచును. చాలా మంది అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యే దేమిటంటే గతించిన కొన్ని శతాబ్ధాలనుండి ప్రపంచములో అనేక చోట్ల అనుసరించే బానిసత్వము బైబిలు సమయాలలో వున్న బానిసత్వమునకు చాలా వ్యత్యాసము ఉండెను. బైబిలులో ఉన్న బానిసత్వము ప్రత్యేకంగా జాతిపై ఆధారపడదు. ప్రజలు వారి దేశమునుబట్టి కాని లేక శరీర రంగును బట్టి కాని బానిసలవ్వరు. బైబిలు సమయాలలో, బానిసత్వము ఎక్కువ ఆర్ధిక విషయాలపై ఆధారపడెను; అది వారి సమాజ స్థాయి విషయము. ప్రజలు వారి అప్పులను తీర్చలేకపోయినా లేక వారి కుటుంబాలను పోషించలేక పోయినా బానిసలుగా వారినివారు అమ్ముకొనేవారు. క్రొత్త నిబంధన సమయాలలో, కొన్నిసార్లు వైద్యులు, న్యాయవాదులు, మరియు రాజకీయవేత్తలు కూడా మరియోకరికి బానిసలు. కొంతమంది ప్రజలు నిజానికి బానిసలుగా ఉండుటకు ఎంపిక చేసికొనిరి ఎందుకంటే అందువలన వారి అవసరాలు వారి యజమానులచే తీర్చబడునని.
గతించిన కొన్ని సంవత్సరాల నుండి బానిసత్వము ప్రత్యేకముగా తరచుగా శరీరరంగుపై ఆధారపడును. United states లో, చాలామంది నల్లజాతీయులు వారి జాతిని బట్టి బానిసలుగా పరిగణింపబడును; చాలామంది బానిస యజమానుకు నల్ల జాతీయులు మానవుల కంటే తక్కువవారిని నమ్మెను. బైబిలు జాతి ఆధారమైన బానిసత్వమును ఖండించి మానవులందరూ దేవునిచే ఆయన స్వరూపములోనే రూపించబడెనని బోధించును (ఆదికాండము 1:27). అదే సమయంలో, పాత నిబంధన ఆర్ధిక ఆధారమైన బానిసత్వమును అనుమతించి మరియు దానిని క్రమపరచెను. మూల విషయం ఏమిటంటే బైబిలు అనుమతించిన బానిసత్వము యే విధముగా కూడా గతించిన కొన్ని శతాబ్దాలలో మన ప్రపంచమును నత్తనడక నడిపించిన జాత్యహంకార బానిసత్వమును పోలివుండదు.
దానికి తోడు, పాత మరియు క్రొత్త నిబంధనలు రెండు “మనుష్యులను దొంగిలించే” అలవాటును ఖండించెను, ఏదైతే 19వ శతాబ్దంలో ఆఫ్రికాలో జరిగినది. ఆఫ్రికన్లు బానిస వేటగాళ్లచే చుట్టుముట్టబడి, వారిని బానిస వర్తకులకు అమ్మి, వారిని కొత్త ప్రపంచమునకు మొక్కలు పెంచి మరియు పొలాలలో పనిచేయుటకు తీసుకువచ్చెను. ఈ పద్ధతి దేవునికి అసహ్యము. నిజానికి, మోషే ధర్మశాస్త్రములో అలాంటి నేరమునకు పరిహారం మరణం:”ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచుకొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును” (నిర్గమ 21:16). అదే విధముగా, క్రొత్త నిబంధనలో, బానిస వర్తకులు “భక్తిహీన మరియు పాపిష్టుల” తో కూడా జాబితాలో చేర్చబడి మరియు ఎవరైతే వారి తండ్రులను లేక తల్లులను చంపునో, హంతకులు, వ్యభిచారులు మరియు పురుషసంయోగులు, మరియు అబద్ధికులు మరియు అప్రమాణికులు అదే వర్గమునకు చెందినవారు (1 తిమోతి 1:8-10).
మరియొక కీలకమైన అంశము ఏదనగా బైబిలు యొక్క ఉద్దేశ్యము రక్షణకు మార్గము, సమాజ సంస్కరణ కాదు. పరిశుద్ధ గ్రంధము తరచుగా సమస్యలను లోపలి నుండి బయటకు అనే విధానం. ఒకవేక ఒక వ్యక్తి ప్రేమను, దయను, మరియు దేవుని కృపను తన రక్షణ ద్వారా పొందుకొని అనుభవిస్తే, దేవుడు అతని ఆత్మను సంస్కరించి, అతడు ఆలోచించి మరియు పనిచేసే విధానమును మార్చును. ఒక వ్యక్తి ఎవరైతే దేవుని బహుమానమైన రక్షణను మరియు పాప బానిసత్వం నుండి విడుదలను అనుభవిoచెనో, దేవుడు అతని ఆత్మను సంస్కరించుచుండగా, మరియొక మానవును బానిసగా చేయడం తప్పని తెలిసికొనును. పౌలుతో, అతడు చూచును, ఒక దాసుడు “ప్రభువులో సహోదరునిగా” ఉండవచ్చు (ఫిలేమోను 1:16). ఒక వ్యక్తి ఎవరైతే నిజముగా దేవుని కృపను అనుభావిన్చేనో అతడు తిరిగి మరల ఇతరుల యెడల కృపకలిగి యుండును. అది బానిసత్వమును అంతము చేయుటకు బైబిలు యొక్క ఉత్తరువు కావచ్చు.
English
బైబిలు బానిసత్వమును క్షమించునా?