settings icon
share icon
ప్రశ్న

మానవుని యొక్క ప్రాణము మరియు ఆత్మలకు మధ్యగల తేడాలు ఏమిటి?

జవాబు


మానవాళికి లేఖనములు ఆరోపిస్తున్న రెండు అనైహికమైన విషయాలు ఈ ప్రాణము మరియు ఆత్మ అనునవి. ఈ రెండిటి మధ్యనున్న సరైన విబేధాలను గుర్తించుటకు ప్రయత్నించడం అనేది చాలా కలవరపెట్టే ప్రయత్నమే అవుతుంది. “ఆత్మ” అను పదము కేవలము మానవులలో ఉన్న అనైహికమైన ముఖాన్నే సూచిస్తుంది. మానవులకు ఆత్మ ఉన్నది కాని, మనము ఆత్మలము కాము. కాని, లేఖనములలో, కేవలం విశ్వాసులు మాత్రమే ఆత్మీయంగా సజీవులుగా ఉన్నవారని చూస్తాము (1 కొరింథీయులకు 2:11; హేబ్రీయులకు 4:12; యాకోబు 2:26), కాని అవిశ్వాసులు మాత్రము ఆత్మీయంగా చచ్చినవారుగా చెప్పబడ్డారు (ఎఫెసీయులకు 2:1-5; కొలస్సీయులకు 2:13). పౌలు రచనలలో, విశ్వాసి జీవితానికి ఈ ఆత్మీయమైనది చాలా కేంద్రబిందువుగా ఉంది (1 కొరింథీయులకు 2:14; 3:1; ఎఫెసీయులకు 1:3; 5:19; కొలస్సీయులకు 1:9; 3:16). దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండునట్లు మానవులలో సామర్ధ్యతనిచ్చే ఆ వస్తువే ఈ ఆత్మ. “ఆత్మ” అనే పదం ప్రయోగించబడిన ప్రతిసారి, ఆత్మయైనున్న (యోహాను 4:24) దేవునితో మానవాళిని “అనుసంధానము చేసే” ఆ అనైహికమైన భాగమును సూచిస్తుంది.

“ప్రాణము” అనే పదము మానవాళి యొక్క అనైహికమైన మరియు ఐహికమైన విషయాలను కూడా సూచించే పదముగా ఉంది. మానవులు ఆత్మను కలిగియుండినట్లుగా కాకుండా, మానవులకు ఈ ప్రాణము తమలోనే ఉంది. అత్యంత సాధారణమైన అర్ధములో, “ప్రాణము” నకు అర్ధము “జీవము” అని. కాని, ఈ అవసరమైన అర్ధముకు అతీతంగా, ప్రాణములను గురించి పరిశుద్ధ గ్రంధము అనేక సందర్భములలో మాట్లాడుతుంది. వీటిలో ఒకటి పాపము చేయుటకు మానవుడు వేగిరపడే విషయంలో (లూకా 12:26). మానవాళి సహజంగానే దుర్మార్గమైనది, మరియు దీని ఫలితంగా మన ప్రాణము మచ్చ వేయబడుతుంది. ఈ ప్రాణము యొక్క జీవన నియమము భౌతికమైన మరణము సంభవించినప్పుడు తొలగించబడుతుంది (ఆదికాండము 35:18; యిర్మీయా 15:2). ఆత్మవలె ప్రాణము కూడా అనేకమైన ఆత్మీయ మరియు భావోద్వేగ అనుభవాలకు కేంద్రముగా ఉంది (యోబు 30:25; కీర్తన 43:5; యిర్మీయా 13:17). “ప్రాణము” అనే పదము ప్రయోగించిన ప్రతీసారి, అది ఈ జీవితములోనైనా కావచ్చు లేదా ఈ జీవితము తరువాత వచ్చే జీవితములోనైనా కావచ్చు, వ్యక్తి యొక్క సంపూర్ణతను సూచించేదిగా ఉంది.

ప్రాణము మరియు ఆత్మ ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి, కాని వీటిని విభజించవచ్చు (హేబ్రీయులకు 4:12). ప్రాణము అనునది మానవుని తత్వమునకు మూలము; మనము ఏమైయున్నామో అదే ఈ ప్రాణము. ఆత్మ అనునది మనలను దేవునితో అనుసంధానం చేసేది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

మానవుని యొక్క ప్రాణము మరియు ఆత్మలకు మధ్యగల తేడాలు ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries