ప్రశ్న
ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి?
జవాబు
ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం యేసు క్రీస్తు పాపుల కొరకు మరణించుటను సంబోధిస్తుంది. అందరు పాపులని లేఖనము బోధిస్తుంది (రోమా. 3:9-18, 23). మన పాపమును జీతము మరణము. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము” అని రోమా 6:23 చెబుతుంది.
ఆ వచనము మనకు అనేక విషయములను బోధిస్తుంది. క్రీస్తు లేకుండా, మన పాపములకు జీతముగా మనం మరణించి నిత్యత్వము నరకములో గడపవలసియుంది. లేఖనములో మరణము “ఎడబాటుగా” సంబోధించబడినది. అందరు మరణిస్తారు, అయితే కొందరు ప్రభువుతో పరలోకములో నిత్యత్వమును గడుపుతారు, మరి కొందరు నిత్యత్వమును నరకంలో గడుపుతారు. ఇక్కడ చెప్పబడిన మరణం నరకంలో జీవితమును సంబోధిస్తుంది. అయితే, యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవము దొరుకుతుందనునది ఈ వచనం బోధించు రెండవ విషయం. ఇది ఆయన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం.
ఆయన సిలువ వేయబడినప్పుడు యేసు క్రీస్తు మన స్థానంలో మరణించాడు. మనం పాపపు జీవితములు జీవిస్తున్నాము కాబట్టి సిలువలో ఆ స్థానంలో మనం మరణించవలసియుంది. అయితే మన స్థానంలో యేసు ఆ శిక్షను తనపై వేసుకొన్నాడు-ఆయన మనకు ప్రత్యామ్నాయంగా మనకు అర్హమైన శిక్షకు ఆయన పొందాడు. “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను” (2 కొరింథీ. 5:21).
“మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి” (1 పేతురు 2:24). మన కొరకు వెల చెల్లించుటకు యేసు మనం చేసిన పాపములను తనపై వేసుకున్నాడు. కొన్ని వచనముల తరువాత మనం చదువుతాము, “ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను” (1 పేతురు 3:18). క్రీస్తు మనకు ప్రత్యామ్నాయంగా శిక్షను అనుభవించాడు అని మాత్రమే ఆ వచనములు చెప్పవు గాని, ఆయన మనకు ప్రాయశ్చిత్తమని, మరియు ఒక పాపపు మానవుని వెల చెల్లించుటకు అది సరిపోతుందని అర్థం.
యెషయా 53:5లో మరొక వాక్య భాగము ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తమును గూర్చి మాట్లాడుతుంది. ఈ వచనము మన పాపముల కొరకు సిలువలో మరణించుటకు రానున్న క్రీస్తును గూర్చి మాట్లాడుతుంది. ఈ ప్రవచనము చాలా వివరంగా ఉంది, మరియు సిలువ శిక్ష ఇక్కడ చెప్పిన విధంగానే జరిగింది. “మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.” ఇక్కడ ప్రత్యామ్నాయమును గమనించండి. క్రీస్తు మన కొరకు వెల చెల్లించాడని మరలా ఇక్కడ మనం చూస్తాం!
శిక్ష పొంది నరకములో నిత్యత్వమును గడుపుట ద్వారా మాత్రమే మన పాపమునకు వెల మనం చెల్లించగలము. అయితే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మన పాపముల వెల చెల్లించుటకు ఈ భూమిపైకి వచ్చాడు. ఆయనా ఇది చేశాడు కాబట్టి, మన పాప క్షమాపణ పొందుటకు మాత్రమే గాక, ఆయనతో నిత్యత్వమును గడుపుటకు మనకు అవకాశం ఉంది. ఇలా చేయుటకు క్రీస్తు సిలువలో చేసినదానిపై మన విశ్వాసమును మనం ఉంచాలి. మనలను మనం రక్షించుకోలేము; మన కొరకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. యేసు క్రీస్తు మరణం ఆ ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం.
English
ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి?