ప్రశ్న
ఏదెను తోటలో దేవుడు ఎందుకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును పెట్టెను?
జవాబు
దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఏదెను తోటలో ఆదాము మరియు హవ్వ ఆయనకు విధేయత లేక అవిధేయత చూపుటకు ఒక అవకాశముగా ఉంచెను. ఆదాము మరియు హవ్వ వారు కోరినది ఏమైనా చేయుటకు స్వతంత్రము కలిగి ఉండిరి, ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినుట తప్ప. ఆదికాండము 2:16-17, “మరియు దేవుడైన యెహోవా – ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.” ఒకవేళ దేవుడు ఆదాము మరియు హవ్వకు ఆ ఎంపిక ఇవ్వకపోతే, వారు తప్పనిసరిగా యంత్రపు మనుషులుగా వుండి. కేవలం వారు ఏమి చేయాలో అదే చేయుదురు. దేవుడు ఆదాము మరియు హవ్వను “స్వేచ్చ” జీవులుగా, నిర్ణయాలు తీసుకొనే లాగున, మంచి మరియు చెడు మధ్య ఎంపిక చేసుకొనేలా, సృష్టించెను. ఆదాము మరియు హవ్వ నిజముగా స్వతంత్రముగా ఉండుటకు, వారు ఒక ఎంపిక కలిగియుండాలి.
ఆ వృక్షం గూర్చి గాని లేక ఆ వృక్ష ఫలములో గాని తప్పనిసరిగా చెడు ఏమిలేదు. ఆ ఫలము, దానిలోపల మరియు దాని యొక్క, ఆదాము మరియు హవ్వకు మరింత తెలివిని ఇవ్వలేదు. అది, దాని భౌతిక ఫలము విటమిన్ C మరియు మంచిచేసే పీచు, కలిగియుoడవచ్చు, కాని అది ఆత్మీయంగా పోషకము కాదు. అయితే, అవిధేయ క్రియ ఆత్మీయంగా విషతుల్యము. ఆ పాపము ఆదాము మరియు హవ్వ యొక్క నేత్రాలను చెడుకు తెరచెను. మొదటిసారిగా, వారు చెడుగా ఉండటం అంటే ఏంటో, సిగ్గుపడడం, మరియు దేవుని నుండి దాగుట అంటే ఏమిటో తెలిసికొనెను. దేవునికి అవిధేయత చూపడం అనే వారి పాపము వారి జీవితాలలో మరియు లోకములోనికి దుర్నీతిని తెచ్చెను. ఫలమును తినడం, దేవునికి వ్యతిరేకముగా అవిధేయ క్రియ చేయడం, అది ఆదాము మరియు హవ్వకు చెడు యొక్క తెలివిని – వారి దిగంబరత్వమును గూర్చిన తెలివిని ఇచ్చెను (ఆదికాండము 3:6-7).
దేవుడు ఆదాము మరియు హవ్వను పాపము చేయాలని కోరలేదు. దేవునికి పాపము యొక్క ఫలితాలు ఎలావుండునో ముందుగానే తెలుసు. దేవునికి ఆదాము మరియు హవ్వ పాపము చేయునని తద్వారా అది చెడును, బాధను, మరియు మరణమును ఈ లోకములోనికి తెచ్చునని తెలుసు. అలాగైతే, ఎందుకు, దేవుడు సాతానును ఆదామును మరియు హవ్వను శోధించుటకు అనుమతించెను? దేవుడు ఆదామును మరియు హవ్వను సాతాను శోధించేలా అనుమతించి వారిని బలవంతముగా ఎన్నుకొనేలా చేసెను. ఆదాము మరియు హవ్వ, వారి స్వచిత్తములో, దేవునికి అవిధేయత చూపి మరియు దాయబడిన ఫలమును తినేలా ఎన్నుకొనెను. దాని ఫలితములు – చెడు, పాపము, బాధలు, అనారోగ్యము, మరియు మరణము – అప్పటినుండి లోకమును దున్నుచుండెను. ఆదాము మరియు హవ్వ నిర్ణయము ప్రతివాడు పాప గుణముతో జన్మించి, పాపము చేసే ధోరణికలిగి యుండేలా ఫలితమిచ్చెను. ఆదాము మరియు హవ్వ యొక్క నిర్ణయము చివరికి యేసుక్రీస్తు సిలువపై మరణించి మరియు మనకొరకు రక్తము చిందించే అవసరతను కలిగించెను. క్రీస్తులో విశ్వాసము ద్వారా, మనము పాపము యొక్క పరిణామాల నుండి విడిపింపబడియున్నాము, మరియు చివరికి పాపము దానినుండి విడిపింపబడ్డాము. మనము రోమా 7:24-25 లో, అపొస్తలుడైన పౌలు మాటలను ప్రతిధ్వనించుదము, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.”
English
ఏదెను తోటలో దేవుడు ఎందుకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును పెట్టెను?