ప్రశ్న
సార్వత్రికవాదం/సార్వత్రిక రక్షణ బైబిలు సంబంధమైనదేనా?
జవాబు
సార్వత్రికవాదమనగా ప్రతివారు రక్షింపబడుననే నమ్మిక. ఈ రోజుకు చాలామంది ప్రజలు సార్వత్రిక రక్షణను పట్టుకొని మరియు ప్రతివారు క్రమక్రమముగా పరలోకమును చేరునని నమ్మును. అయితే ఇది నరకములో నిత్య బాధతో జీవించే స్త్రీ పురుషుల ఆలోచన కొందరు ఈ విషయముపై లేఖనముల బోధను తిరస్కరించుటకు కారణమాయెను. కొందరికి ఇది దేవుని ప్రేమ మరియు జాలిపై విపరీత-వివరణ- మరియు దేవుని నీతిని మరియు న్యాయమును నిర్లక్ష్యము చేయుట- ఇది వారిని దేవుడు ప్రతి జీవించే ప్రాణిపై దయ కలిగియుండునని నమ్మేలా చేయును. కాని లేఖనములు కొందరు నిత్యత్వము నరకములో గడుపునని కూడా బోధించును.
మొదటిగా, విడిపింపబడని మనుష్యులు నరకములో ఎల్లప్పుడు నివసించునని బైబిలు స్పష్టముగా చూపును. యేసు స్వంత మాటలు విమోచింపబడినవారు పరలోకములో ఎంతకాలము గడుపునో అంతే కాలము విమోచింపబడనివారు నరకములో గడుపునని నిర్ధారించును. మత్తయి 25:46 చెప్పును, “వీరు [రక్షిoపబడనివారు] నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవము నకును పోవుదురు.” ఈ వచనం ప్రకారం, రక్షింపబడనివారి శిక్ష నీతిమంతుల జీవితం వలే నిత్యము. కొందరు నరకములో ఉన్నావారు క్రమముగా ఉండుటకు ప్రాధేయపడునని నమ్మును కాని ప్రభువు తానే అది నిత్యము ఉండునని నిర్ధారించును. మత్తయి 25:41 మరియు మార్కు 9:44 నరకమును “నిత్య అగ్ని” గా మరియు “ఆరని అగ్ని” గా వర్ణించును.
ఒకరు ఈ ఆరని అగ్నిని ఎలా తప్పించుకొనగలరు? చాలామంది ప్రజలు అన్ని దారులు- అన్ని మతాలు మరియు నమ్మికలు- పరలోకమునకే నడుపునని, లేక దేవుడు ప్రేమ మరియు కృపతో నిండి ప్రజలందరినీ పరలోకములోనికి అనుమతించునని వారు పరిగణించును. దేవుడు ఖచ్చితంగా ప్రేమ మరియు దయతో నిండియుండును; అది ఆయన తన కుమారుడైన, యేసుక్రీస్తును, మనకొరకు సిలువపై మరణించుటకు నడిపించినవి ఈ లక్షణాలే. యేసుక్రీస్తు పరలోకములో నిత్యత్వమునకు నడిపించే ప్రత్యేక ద్వారము. అపొ.కార్య 4:12 చెప్పును, “ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయనే క్రీస్తుయేసను నరుడు” (1 తిమోతి 2:5). యోహాను 14:6లో, యేసు చెప్పెను, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నీ ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” యోహాను 3:16, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” ఒకవేళ మనము దేవుని కుమారుని తిరస్కరించుటకు ఎంపిక చేసుకొంటే, మనము రక్షణకు అవసరమైనవాటిని పొందుకొనలేము (యోహాను 3:16, 18, 36).
ఇలాంటి వచనములతో, సార్వత్రికవాదం మరియు సార్వత్రిక రక్షణ అనేవి బైబిలు సంబంధమైన నమ్మికలు కాదని మనకు స్పష్టముగా తెలియును. లేఖనములు బోధించేదానికి సార్వత్రికవాదం ప్రత్యక్షంగా విభేదించును. చాలామంది ప్రజలు క్రైస్తవులను అసహనంగా మరియు “ప్రత్యేకంగా” నిందించుచుండగా, ఈ మాటలు క్రీస్తు తనకు తానే చెప్పెనని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. క్రైస్తవులు ఈ ఆలోచనను తమకుతామే అభివృద్ధి చేసుకొనలేదు; క్రైస్తవులు ప్రభువు ముందే చెప్పిన విషయాలను మాత్రం చెప్పుచున్నారు. ప్రజలు ఈ వర్తమానమును తిరస్కరించుటకు ఎన్నుకొనిరి ఎందుకంటే వారు వారి పాపమును ఎదుర్కొనుటకు మరియు వారిని రక్షించుటకు ప్రభువు అవసరమని ఒప్పుకొనుటకు ఇష్టపడరు. దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించిన రక్షణను తృణీకరించినవారు రక్షింపబడి దేవుని పరిశుద్ధతను మరియు న్యాయమును చులకనచేసి మరియు వారి పక్షముగా దేవుని యొక్క త్యాగమును ఎదుర్కొందురు.
English
సార్వత్రికవాదం/సార్వత్రిక రక్షణ బైబిలు సంబంధమైనదేనా?