ప్రశ్న
కన్యగర్భములో జననం ఎందుకు అంత ముఖ్యమైనది?
జవాబు
కన్యగర్భ జననం అను సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది (యెషయా 7:14; మత్తయి 1:23; లూకా 1:27, 34). మొదటిగా, లేఖనము ఈ సంఘటనలను ఎలా వివరిస్తుందో చూద్దాం. మరియ యొక్క ప్రశ్న “యిదేలాగు జరుగును” (లూకా 1:34) అను ప్రశ్నకు స్పందనగా గాబ్రియేలు అంటున్నాడు, “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును” (లూకా 1:35) మరియను వివాహం చేసుకొనుటకు భయపడవద్దని దేవదూత యోసేపును ప్రోత్సహిస్తుంది: “ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది” (మత్తయి 1:20). కన్యక “పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను” అని మత్తయి చెబుతున్నాడు (మత్తయి 1:18). గలతీ. 4:4 కూడా కన్యగర్భ జననమును గూర్చి బోధిస్తుంది: “దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టెను.”
ఈ లేఖనముల ద్వారా, యేసు యొక్క జననము మరియ శరీరములో పరిశుద్ధాత్మ కార్యము యొక్క పరిణామము అని స్పష్టమవుతుంది. శరీరము కానిది (ఆత్మ) మరియు శరీరమైనది (మరియ గర్భం) దీనిలో ఉన్నాయి. మరియ, స్వయంగా గర్భం ధరించలేదు, మరియు ఆ విధంగా ఆమె ఒక “పాత్ర” మాత్రమే. కేవలం దేవుడు మాత్రమే శరీరధారి అయ్యే అద్భుతమును చేయగలడు.
అయితే, మరియ మరియు యేసు మధ్య భౌతిక అనుబంధం నిరాకరిస్తే యేసు నిజముగా మానవుడు కాడు. యేసు మన వలె భౌతిక శరీరం కలిగిన సంపూర్ణ మానవుడని లేఖనము బోధిస్తుంది. ఇది అయన మరియ నుండి పొందాడు. అదే సమయంలో, నిత్య, పాపములేని స్వభావముతో యేసు సంపూర్ణంగా దేవుడు (యోహాను 1:14; 1 తిమోతి 3:16; హెబ్రీ. 2:14-17.)
యేసు పాపంలో జన్మించలేదు; అనగా, ఆయనలో పాప స్వభావము లేదు (హెబ్రీ. 7:26). పాప స్వభావము తరతరములకు తండ్రి ద్వారా అందించబడింది అని అనిపిస్తుంది (రోమా. 5:12, 17, 19). కన్యగర్భమున జననం పాప స్వభావం యొక్క ప్రభావమును నిలిపి నిత్య దేవుడు పరిపూర్ణ మానవుడగుటకు అవకాశం ఇచ్చింది.
English
కన్యగర్భములో జననం ఎందుకు అంత ముఖ్యమైనది?