settings icon
share icon
ప్రశ్న

దేవుడు ప్రజలకు ఇంకా ఈరోజుకు దర్శనములు ఇచ్చునా?

జవాబు


దేవుడు ప్రజలకు దర్శనములు ఈరోజు ఇచ్చునా? అవును! దేవుడు ప్రజలకు ఈరోజుకు దర్శనములు ఇచ్చును. సాధ్యముగా. మనము దర్శనములను ఒక సాధారణ సంఘటనగా ఆశించవచ్చా? కాదు. బైబిలులో పొందుపరచినట్లుగా, దేవుడు ప్రజలతో దర్శనముల ద్వారా చాలాసార్లు మాట్లడెను. ఉదాహరణకు యాకోబు యొక్క కుమారుడు, యోసేపు; మరియ భర్తయైన, యోసేపు; సొలొమోను; యెషయా; యెహెజ్కేలు; దానియేలు; పేతురు; మరియు పౌలు. ప్రవక్తయైన యోవేలు దర్శనములతో నింపబడటం ముందుగా ఊహించెను, మరియు ఇది అపొస్తలుడైన పేతురుచె అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో నిర్ధారించబడెను. ఒక కల మరియు ఒక దర్శనము మధ్య తేడాను గుర్తించడం ప్రాముఖ్యం దర్శనం ఒక వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడు ఇవ్వబడును అలాగే కల ఒక వ్యక్తి నిద్రించుచున్నప్పుడు ఇవ్వబడును.

ప్రపంచములోని చాలా భాగాలలో, దేవుడు దర్శనములను మరియు కలలను విస్తృతముగా వాడుచున్నట్లు కనబడును. కొంచము లేక పూర్తిగా సువార్త సందేశము అందుబాటులో లేని ప్రదేశాలలో, మరియు ఎక్కడైతే ప్రజలకు బైబిలు లేదో, దేవుడు తన వర్తమానమును ప్రత్యక్షంగా కలలు మరియు దర్శనముల ద్వారా తీసుకువెళ్లును. ఇది మొత్తముగా బైబిలు సంబంధమైన దర్శనాల ఉదాహరణకు దేవునిచే తరచుగా క్రైస్తవ్యం ప్రారంభ దినాలలో ఆయన సత్యమును ప్రజలకు బయలుపరచుటకు వాడబడెను. ఒకవేళ దేవుడు తన వర్తమానమును ఒక వ్యక్తికి చెప్పాలనుకుంటే, ఆయన ఏది అవసరమో కనుగొని అతడు ఉపయోగించును- ఒక మిషనరీ, ఒక దూత, ఒక దర్శనము, లేక ఒక కల. అయినా, దేవుడు ఎక్కడైతే సువార్త ముందుగా సిద్దముగా లభ్యమైనా ఆ ప్రాంతాలలో కూడా ఆయన దర్శనములు ఇవ్వగలడు. దేవుడు చేయగలిగిన దానికి పరిమితి లేదు.

అదే సమయంలో, దర్శనములు మరియు దర్శనముల అర్ధముల వద్దకు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండవలెను. బైబిలు సంపూర్ణము చేయబడినదని మనము మనస్సులో ఉంచుకొనవలెను, మరియు అది మనము తెలిసికోవలసిన ప్రతిదానిని మనకు చెప్పును. మూల సత్యము ఏమిటంటే ఒకవేళ దేవుడు ఒక దర్శనము ఇస్తే, అది పూర్తిగా ఆయన ముందే తన వాక్యములో బయలుపరచిన దానిని అంగీకరించును. దర్శనములకు ఎప్పుడు దేవుని వాక్యముతో సమానమైన లేక అధికమైన అధికారము ఇవ్వకూడదు. క్రైస్తవ విశ్వాసమునకు మరియు ఆచరణ కొరకు దేవుని వాక్యమే అంతిమ అధికారముగా ఉండాలి. ఒకవేళ నీవు నీకు ఒక దర్శనము కలదని నమ్మి మరియు దానిని దేవుడే బహుశా నీకిచ్చాడని భావిస్తే, ప్రార్థనపూర్వకంగా దేవుని వాక్యమును పరీక్షించి మరియు ఆ దర్శనము లేఖనముతో అంగీకరించునని నిర్ధారించుకొనుము. అప్పుడు ప్రార్థనపూర్వకంగా దేవుడు నీ దర్శనమునకు స్పందనగా ఏమి చేయునో పరిగణించుము (యాకోబు 1:5). దేవుడు ఒక వ్యక్తికి ఒక దర్శనము ఇచ్చి మరియు ఆ దర్శనము యొక్క అర్ధమును దాచిపెట్టడు. లేఖనములో, ఒక వ్యక్తి దేవునిని దర్శనము యొక్క అర్ధము అడిగినప్పుడు, దేవుడు తప్పకుండా ఆ వ్యక్తికి దానిని వివరించెను (దానియేలు 8:15-17).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవుడు ప్రజలకు ఇంకా ఈరోజుకు దర్శనములు ఇచ్చునా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries