settings icon
share icon
ప్రశ్న

దేవుని స్వరమును మనము ఎలా గుర్తిస్తాము?

జవాబు


ఈ ప్రశ్న యుగాలుగా లెక్కలేనంత ప్రజలచే అడుగబడెను. సమూయేలు దేవుని స్వరమును విన్నాడు, కాని ఏలీ ఆదేశించే వరకు దానిని ఆతడు గుర్తించలేదు (1 సమూయేలు 3:1-10). గిద్యోనుకు దేవుని నుండి ఒక భౌతిక ప్రత్యక్షత వచ్చినది, మరియు అతడు అనుమానిస్తూ అతను విన్న దానికొరకు ఒక సూచన నిమ్మని, ఒకసారి కాదు, కాని మూడుసార్లు అడిగెను (న్యాయాధి. 6:17-22; 36-40). మనము దేవుని స్వరం విన్నప్పుడు, మాట్లాడుతున్నది ఆయనే అని మనకు ఎలా తెలుస్తుంది? మొదటిగా, గిద్యోనుకు మరియు సమూయేలుకు లేనిది మనకు ఏదో ఉంది. మనకు ప్రభావితం చేసే దేవుని వాక్యం, చదువుటకు, పఠిoచుటకు, మరియు దానిని ధ్యానించుటకు సంపూర్ణ బైబిలు ఉన్నది. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది” (2 తిమోతి 3:16-17). మనకు ఒక నిర్దిష్ట విషయమై లేక మన జీవితాలలో నిర్ణయానికై ప్రశ్న ఉన్నప్పుడు, దాని గూర్చి బైబిలు ఏమి చెప్తుందో చూడాలి. దేవుడు ఎన్నడూ ఆయన వాక్యంలో ఆయన బోధించినదానికి విరుద్ధంగా నడిపించడు (తీతు 1:2).

దేవుని స్వరమును వినుటకు మనము దేవునికి చెందినవారమై యుండాలి. యేసు, “నా గొఱ్ఱేలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును” (యోహాను 10:27). దేవుని స్వరమును విన్నవారు ఆయనకు చెందినవారై- ప్రభువైన యేసులో కృపచే విశ్వాసం ద్వారా రక్షింపబడినవారు. వీరు ఆయన స్వరమును విని మరియు దానిని గుర్తించును, ఎందుకంటే వారికి వారి కాపరి తెలుసు. ఒకవేళ మనము ఆయన స్వరం గుర్తించాలంటే, మనము ఆయనకు చెందినవారమై యుండాలి.

మనము బైబిలు ధ్యానముపై సమయము గడిపి మరియు నిశబ్దముగా ధ్యానం చేస్తే ఆయన స్వరమును వినగలము. దేవునితో మరియు ఆయన వాక్యంతో మరింత దగ్గరగా సమయము గడిపితే, ఆయన స్వరమును గుర్తించడం మరియు మన జీవితాలలో ఆయన నడిపింపు అంత సులువుగా ఉండును. బ్యాంకు ఉద్యోగస్తులు నకిలీను గుర్తించడానికి నిజమైన డబ్బును దగ్గరగా పఠిoచి నకిలీలను పట్టుకొనుటకు తర్ఫీదుపొందును. మనము దేవుని వాక్యమును బాగుగా తెలిసికొని మనతో ఎవరైనా తప్పుగా మాట్లాడితే, అది దేవునిది కాదని స్పష్టమగును.

దేవుడు ఈరోజు వినగలిగేలా ప్రజలతో మాట్లాడుతుండగా, ప్రాధమికంగా ఆయన వ్రాసిన వాక్యం ద్వారా మాట్లాడును. కొన్నిసార్లు దేవుని నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా , మన జ్ఞానేంద్రియాల ద్వారా, పరిస్థితుల ద్వారా వచ్చును. లేఖనము యొక్క సత్యముతో మనం వినునది పోల్చితే, మనము దేవుని స్వరమును గుర్తించుట నేర్చుకొందుము.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవుని స్వరమును మనము ఎలా గుర్తిస్తాము?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries