ప్రశ్న
యేసు క్రీస్తు ఎవరు?
జవాబు
“దేవుడు ఉన్నాడా?” అను ప్రశ్నకు భిన్నంగా యేసు క్రీస్తు ఉన్నాడా అని చాలా తక్కువ మంది అడుగుతారు. యేసు క్రీస్తు నిజమైన మానవుడని 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలులో భూమి మీద నడిచెనని సామాన్యంగా అందరు అంగీకరిస్తారు. యేసు క్రీస్తు యొక్క పూర్తి గుర్తింపును గూర్చి చర్చించినప్పుడు చర్చ ఆరంభమవుతుంది. యేసు క్రీస్తు ఒక ప్రవక్త అని లేక మంచి బోధకుడని లేక మంచి వ్యక్తి అని ఇంచుమించుగా అన్ని మతములు బోధిస్తాయి. అయితే యేసు ఒక ప్రవక్త కంటె, మంచి బోధకుని కంటె, లేక ఒక మంచి మానవుని కంటె ఎంతో గొప్పవాడని బైబిల్ బోధిస్తుంది మరియు అది సమస్య. మియర్ క్రిస్టియానిటి అనే పుస్తకంలో సి.ఎస్. లూయిస్ ఇలా వ్రాస్తున్నాడు: “ఆయనను [యేసు క్రీస్తు] గూర్చి ప్రజలు తరచుగా చెప్పు మూర్ఖపు మాటను ఎవ్వరు చెప్పకుండా నివారించుటకు నేను ఇక్కడ ప్రయత్నిస్తున్నాను. ‘నేనే యేసును గొప్ప నైతిక బోధకునిగా అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నానుగాని, దేవుడు అని ఆయన చేసే దావాను మాత్రం నేను అంగీకరించను.’ ఈ ఒక్క విషయం మనం చెప్పకూడదు. ఒక మనిషైయుండి యేసు చెప్పిన మాటలు చెప్పుంటే అతడు గొప్ప నైతిక బోధకుడు అయ్యుండేవాడు కాదు. అతడు ఒక వెర్రివాడైనా అయ్యుంటాడు-అతడు దొంగిలించబడిన గుడ్డు అని చెప్పు మానవుని స్థాయిలో-లేక అతడు నరకములోని అపవాది అయ్యుంటాడు. మీరు మీ నిర్ణయం తీసుకోవాలి. ఈ మానవుడు దేవుని కుమారుడైనా అయ్యుండాలి, లేక ఒక పిచ్చివాడు లేక అంతకంటే హీనమైనవాడు. ఆయనను ముర్ఖుడనుకొని నోరుమూపించవచ్చు, ఆయనపై ఉమ్మి వేసి దయ్యమనుకొని చంపవచ్చు; లేక ఆయన పాదముల మీద పడి ఆయనను ప్రభువు మరియు దేవుడు అని పిలువవచ్చు. కాని ఆయన గొప్ప మానవ బోధకుడనే విశదపరచు అర్థం లేని ఆలోచనలు మాత్రం తీసుకొని రావద్దు. ఆయన మన కొరకు ఆ వికల్పమును విడిచిపెట్టలేదు. ఆయన అలా ఆశించలేదు.”
అయితే, యేసు ఎవరని చెప్పాడు? ఆయన ఎవరని బైబిల్ చెబుతుంది? మొదటిగా, యోహాను 10:30లో యేసు మాటలను చూడండి, “నేనును తండ్రియును ఏకమైయున్నాము.” మొదటి చూపులో, ఇది దేవుడని చేయు దావా వలె అనిపించదు. అయితే, ఆయన వివరణకు యూదుల ప్రతిస్పందన చూడండి, “అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పెను” (యోహాను 10:33). యేసు కథనం తానే దేవుడని చేయు దావాగా యూదులు అర్థం చేసుకున్నారు. “నేను దేవుడని దావా చేయలేదు” అని యేసు తరువాత వచనాలలో యూదులను సవరించలేదు. “నేనును తండ్రియును ఏకమైయున్నాము” అని ఘోషించుట ద్వారా యేసు తాను నిజముగా దేవుడని చెబుతున్నట్లు అది సూచిస్తుంది. యోహాను 8:58 మరొక ఉదాహరణ: “యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!” మరలా, యేసును రాళ్ళతో కొట్టాలని యూదులు రాళ్ళు పైకెత్తిరి (యోహాను 8:59). “నేను” అని యేసు తన గుర్తింపును ప్రకటించుట పాత నిబంధనలోని దేవుని యొక్క పేరుకు సూటైన అనువర్తనగా ఉంది (నిర్గమ. 3:14). యేసు దైవదూషణ, అనగా దేవుడనే దావా చేసాడని యూదులు తలంచని యెడల వారు మరలా యేసును రాళ్ళతో ఎందుకు కొట్టాలని కోరారు?
“వాక్యము దేవుడైయుండెను” అని యోహాను 1:1 చెబుతుంది. “వాక్యము శరీరధారి ఆయెను” అని యోహాను 1:14 చెబుతుంది. “నా ప్రభువా నా దేవా” అని శిష్యుడైన తోమా యేసును పిలచెను (యోహాను 20:28). యేసు ఆయనను సరిచేయలేదు. “...మన ప్రభువును రక్షకుడును” అని అపొస్తలుడైన పేతురు అదే చెబుతున్నాడు (2 పేతురు 1:1). తండ్రియైన దేవుడు కూడ యేసు యొక్క పూర్ణ గుర్తింపుకు సాక్షిగా ఉన్నాడు, “కాని కుమారుని గూర్చి ఆయన చెబుతున్నాడు, ‘దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది.’” యేసును గూర్చిన పాత నిబంధన ప్రవచనాలు ఆయన దైవత్వమును ఘోషించుచున్నాయి, “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును” (యెషయా 9:6).
కాబట్టి, సి.ఎస్. లూయిస్ వాదించినట్లు, యేసు క్రీస్తు కేవలం ఒక మంచి బోధకుడని నమ్ముట మాత్రమే సరిపోదు. యేసు స్పష్టముగా ఎలాంటి వ్యతిరేకత లేకుండా దేవుడని దావా చేసాడు. ఆయన దేవుడు కానియెడల, ఆయన ఒక అబద్ధికుడు, మరియు ఒక ప్రవక్త, మంచి బోధకుడు, లేక మంచి మానవుడు కూడ కాదు. యేసు యొక్క మాటలను వివరించాలనే ప్రయత్నంలో, “నిజమైన చారిత్రక యేసు” బైబిల్ ఆయనను గూర్చి చెప్పు అనేక మాటలను చెప్పలేదని ఆధునిక “పండితులు” దావా చేస్తారు. యేసు ఏమి చెప్పాడు లేక ఏమి చెప్పలేదు అనుటను గూర్చి దేవుని వాక్యం ఏమి చెబుతుంది అని వాదించుటకు మనం ఎవరు? యేసు కాలంలో ఆయనతో జీవించి, ఆయనతో సేవించి, యేసు ద్వారా స్వయంగా బోధించబడినవారి కంటె యేసును గూర్చి ఎక్కువ జ్ఞానం రెండు వేల సంవత్సరాల తరువాత జీవిస్తున్న “పండితునికి” ఎలా ఉంటుంది (యోహాను 14:26)?
యేసు యొక్క నిజమైన గుర్తింపును గూర్చిన ప్రశ్న ఎందుకు ప్రాముఖ్యమైనది? యేసు దేవుడా కాదా అను విషయం ఎందుకు అవసరం? యేసు దేవుడైయుండుటకు ముఖ్యమైన కారణం ఏమిటంటే ఒకవేళ ఆయన దేవుడు కాని యెడల, సర్వ లోకము యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించుటకు ఆయాన మరణం సరిపోయేది కాదు (1 యోహాను 2:2). కేవలం దేవుడు మాత్రమే అట్టి వెల చెల్లించగలడు (రోమా. 5:8; 2 కొరింథీ. 5:21). మన అప్పును చెల్లించుటకు యేసు దేవుడైయుండవలసి ఉంది. ఆయన మరణించుటకు మానవుడైయుండవలసి ఉంది. యేసు క్రీస్తు నందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ సాధ్యం. యేసు దైవం కాబట్టి రక్షణకు అయన ఏకైక మార్గం. “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని యేసు దేవుడు కాబట్టి ప్రకటించెను (యోహాను 14:6).
English
యేసు క్రీస్తు ఎవరు?