నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు?ప్రశ్న: నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు?

జవాబు:
ఆత్మహత్య చేసుకోవాలనీ ఆలోచించే వారి పట్ల మన హృదయం కలవరపడ్తుంది. నిరాశ, నిస్పృహల మధ్యన సతమతమవుతూ అటువంటి ఆలోచనలకు లోనైన వ్యక్తివి నీవే అయితే నీవు ఒక లోతైన గుంటలో వున్నట్లు, ఇంకా మంచి స్ధితిగతులుంటాయనే నిరీక్షణను అనుమానించవచ్చు. నిన్నెవరు అర్దంచేసుకోవటంలేదని, ఆదరించువారు లేరని అనిపించవచ్చు. ఈ జీవితం జీవనయోగ్యమైనదేనా?

నీవు కొద్ద్ది నిమిషాలు దేవుడ్ని నీజీవితానికి దేవునిగా అనుమతించగలిగినట్లైయితే ఎంతగొప్పవాడో ఋజువు చేసుకుంటాడు. ఎందుకంటే “ఆయనకు అసాధ్యమైనది యేది లేదు” (లూకా 1:37). బహుశా! చేదు అనుభవాల మచ్చలు, ఒంటరితనాన్నికి, తిరస్కారపు ఆలోచనలకు దారీతీస్తుందేమో. అది నీపై నీకు జాలి, కోపం, కక్ష్య, హింసాత్మకమైన ఆలోచనలు లేక లేనిపోయిన భయాలకు దారి తీస్తూ అతి సన్నిహిత సంభంధాల మీద ప్రభావం చూపవచ్చు.

నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు? స్నేహితా, నీ పరిస్ధితులు ఎంత గడ్డుగావున్నప్పటికి, నిన్ను ప్రేమించే దేవుడు నిరాశా సొరంగంనుంచి అద్భుతమైన వెలుగులోకి నడిపించటానికి వేచియున్నాడు. ఆయనే ఖచ్చితమైన నిరీక్షణ. ఆయనే యేసయ్యా.

పాపరహితుడైన దేవుని కుమారుడైన యేసు, నీ తృణీకారములో, అవమానములో నీతో ఏకీభవిస్తున్నాడు. ప్రవక్తయైన యెష్షయా ఆయన గురించి రాస్తూ ఆయన అందరిచేత “తృణీకరించబడి, విసర్జింబడినవాడుగా” అభివర్ణించాడు (యెష్షయా 53:2-6). ఆయన జీవితం దు:ఖము, శ్రమలతో నిండినది. అయితే ఆయన అనుభవించిన దు:ఖం తనకోసంకాదుగానీ మనకోసమే. మన పాపం నిమిత్తం ఆయన గాయాలు పొంది, నలుగగొట్టబడి, చీల్చబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలచేత మన జీవితాలు విమోచించబడి, సంపూర్ణులమౌవుతాం.

స్నేహితా, యేసుక్రీస్తు ఇదంతా అనుభవించింది కేవలం నీ పాపాన్ని క్షమించటానికే. నీవెంత గొప్ప అపరాధభావనను మోస్తున్నప్పటికి, నిన్ను నీవు తగ్గించుకొని ఆయనను నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. “నీ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను” (కీర్తన 50:15). యేసుక్రీస్తు క్షమించలేనంత అపరాధము ఏదీ లేదు. ఆయన ఏర్పరచుకొన్న సేవకులలో కొందరు పెద్ద పెద్ద పాపాలు చేసినవారే. హత్య చేసినవారు (మోషే), హత్య మరియు వ్యభిచారము చేసినవారు( రాజైన దావీదు), శారీరకంగా, భావోద్రేకంగా హింసించినవారు (అపోస్తలుడైన పౌలు) వున్నారు. అయినప్పటికీ నూతన ఫలవంతమైన జీవితాన్ని, క్షమాపణను పొందుకున్నారు. “కాగా ఎవడైననను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” (2 కొరింధి 5:17).

నీవెందుకు ఆత్మహత్య చేసికొనకూడదు? స్నేహితా, “ విరిగి నలిగి,” అంతంమొందిచాలన్నా నీ జీవితాన్ని బాగు చేయటానికి దేవుడు సంసిద్దుడుగా నున్నాడు. యెష్షయా61:1-3 లో యెష్షయా ప్రవక్తా ఈ విధంగా రాసాడు, “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగలవారిని ధృఢపరచుటకును, చెరలోనున్నవారికి విడుదలను, బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దు:ఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దు:ఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దు:ఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.”

యేసయ్య దగ్గరకు రండి.ఆయన మీ జీవితంలో నూతనకార్యం ఆరంభించగా ఆనందాన్ని, ఉపయోగత్వాన్ని తిరిగి నెలకొల్ప నివ్వండి. నీవు పోగొట్టుకున్న ఆనందాన్ని పునరుద్దీకరించి, నూతన ఆత్మ ద్వారా స్ధ్తిరపరుస్తానని వాగ్ధానాన్ని చేసాడు. నీ విరిగి నలిగిన హృదయమే ఆయన కెంతో విలువైనది. “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” (కీర్తన 51: 12; 15-17).

యేసుప్రభువును నీ రక్షకునిగా, నీ కాపరిగా ఆయనను అంగీకరించుటకు సంసిధ్దమేనా? నీ ఆలోచనలను, నీ నడవడికలను ఆయన వాక్యం, బైబిలు ద్వారా దినదినము నడిపిస్తాడు. “నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవలసిన మార్గమును నీకు భోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన 32:8). “నీ కాలములో నియమింపబడినది స్ధిరముగా నుండును. రక్షణ బాహూళ్యమును బుద్ధిఙ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము” (యెషయా 33:6). క్రీస్తులోవున్నప్పుడు శ్రమలు ఇంకా వుండవచ్చు. కానీ నిరీక్షణ వుంటుంది. “ఆయన సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు” (సామెతలు 18: 24). ఈ నిర్ణయం తీసుకునే సమయంలో యేసుక్రీస్తు కృప నీకు తోడుగా నుండును గాకా.

యేసుక్రీస్తును నీ రక్షకుడు అని నమ్మకముంచుటకు నీవిష్టపడినట్లయితే హృదయములో ఈ మాటలు దేవునితో చెప్పు. “దేవా నా జీవితంలో నీవు నాకు అవసరం. నేను యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, ఆయనే రక్షకుడని నమ్ముతున్నాను. మీరు నన్ను స్వస్థపరచి, శుధ్ధీకరించి ఆనందాన్ని నాలో తిరిగి నెలకొల్పండి. నా పట్ల నీవు చూపించిన ప్రేమకై నా కోసం చనిపోయినా యేసయ్యకు కృతఙ్ఞతలు.”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు?