ప్రశ్న
మనం బైబిల్ ఎందుకు చదవాలి/అధ్యయనం చెయ్యాలి?
జవాబు
బైబిల్ మన కొరకు దేవుని వాక్యము కాబట్టి మనం బైబిల్ ను చదివి అధ్యయనం చెయ్యాలి. బైబిల్ అక్షరాల “దైవావేశం” కాలినది (2 తిమోతి 3:16). మరొక మాటలో, అది మన కొరకు స్వయంగా దేవుని మాటలు. తత్వ జ్ఞానులు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులు దేవుడు లేఖనములలో మన కొరకు ఇస్తున్నాడు. జీవితము యొక్క ఉద్దేశము ఏమిటి? నేను ఎక్కడ నుండి వచ్చాను? మరణం తరువాత జీవితం ఉందా? నేను పరలోకానికి ఎలా చేరగలను? లోకమంతా దుష్టత్వముతో ఎందుకు నిండియుంది? మేలు చేయుటకు నేను ఎందుకు సంఘర్షిస్తాను? ఈ “పెద్ద” ప్రశ్నలతో పాటు బైబిల్ ఈ విషయాలలో కొన్ని అభ్యాసిక సలహాలు ఇస్తుంది: నా సాటియైన సహాయంలో నేను ఏమి చూస్తాను? ఒక ఫలబరితమైన వివాహమును నేను ఎలా కలిగియుండగలను? నేను ఒక మంచి స్నేహితుడను ఎలా కాగలను? నేను ఒక మంచి తండ్రిని లేక తల్లిని ఎలా కాగలను? జయం అంటే ఏమిటి నేను దానిని ఎలా పొందగలను? నేను ఎలా మారగలను? జీవితములో ప్రాముఖ్యమైనది ఏది? జీవితములో వెనుకకు చూసి పశ్చాత్తాపపడకుండా నేను ఎలా బ్రతకగలను? జీవితములో విషాద పరిస్థితులను విజయవంతంగా ఎలా ఎదుర్కొనగలను?
బైబిల్ పరిపూర్ణంగా నమ్మశక్యమైనది మరియు తప్పులు లేనిది కాబట్టి మనం బైబిల్ ను చదవాలి మరియు అధ్యయనం చెయ్యాలి. “పవిత్ర” గ్రంథములు అని పిలువబడువాటిలో బైబిల్ విశేషమైనది, మరియు అది కేవలం కొన్ని నైతిక బోధలను ఇచ్చి “నన్ను నమ్ము” అని చెప్పదు. అయితే, అది చేయు కొన్ని వందల ప్రవచనాలను పరీక్షించుట ద్వారా, అది వ్రాయు చారిత్రక కథనాలను పరీక్షించుట ద్వారా, అది అనుబంధించు వైజ్ఞానిక సత్యాలను పరీక్షించుట ద్వారా దానిని పరీక్షించు శక్తి మనకు ఉంది. బైబిల్ లో తప్పులు ఉన్నాయి అని చెప్పువారు సత్యము పట్ల వారి చెవులు మూసుకొనియున్నారు. “నీ పాపములు క్షమించబడెను,” లేక “లేచి, నీ పరుపెత్తుకొని నడువు” అని వాటిలో దేనిని చెప్పుట సులభమని యేసు ఒక సందర్భంలో అడిగెను. తరువాత కుంటివాడిని స్వస్థపరచుట (చుట్టుపక్కల ఉన్న వారు తమ కళ్లతో పరీక్షించదగినది) ద్వారా ఆయనకు పాపములను క్షమించు శక్తి (కన్నుల ద్వారా మనం చూడలేనిది) ఉన్నదని యేసు రుజువు చేసాడు. అదే విధంగా, మన జ్ఞానేంద్రియముల ద్వారా పరీక్షించలేని ఆత్మీయ విషయములైన వాటిలో కూడా దేవుని వాక్యము సత్యమని చారిత్రక స్పష్టత, వైజ్ఞానిక స్పష్టత, మరియు ప్రవచన స్పష్టతలో మనకు నిశ్చయత ఇవ్వబడినది.
దేవుడు మారడు కాబట్టి, మానవ స్వభావం మారదు కాబట్టి మనం బైబిల్ ను చదివి అధ్యయనం చెయ్యాలి; అది వ్రాయబడిన సమయంలో ఎంత అన్వయకరమో నేడు కూడా అంతే దానిని మనం అన్వయించవచ్చు. టెక్నాలజీ మారుతున్నప్పటికీ, మానవుని స్వభావం మరియు ఆశలు మారవు. బైబిల్ చరిత్ర యొక్క పేజీలు మనం చదవగా, అనుబంధాల విషయంలోనైనా లేక సమాజాలలోనైనా, “సూర్యుని క్రింద క్రొత్తది ఏమి కాదని” (ప్రసంగి 1:9) మనం కనుగొంటాము. మానవజాతి ప్రేమ మరియు సంతృప్తిని సరికాని ప్రాంతములలో వెదుకుతుండగా, దేవుడు-మన మంచి కృపగల సృష్టికర్త- మనలో నిత్యముండు ఆనందమును ఏమి తేగాలదో చెబుతున్నాడు. బయలుపరచబడిన, బైబిల్, యేసు చెప్పినట్లు చాలా ప్రాముఖ్యము, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును" (మత్తయి 4:4). మరొక మాటలో, దేవుడు యోచించినట్లు, మనం జీవితమును పూర్తిగా జీవించాలని కోరితే, దేవుని వ్రాయబడిన వాక్యమును విని దానిని అనుసరించాలి.
అబద్ధ బోధలు చాలా ఉన్నాయి కాబట్టి, మనం బైబిల్ ను చదివి అధ్యయనం చేయాలి. సత్యము అబద్ధము మధ్య ఉన్న భేదమును గమనించుటకు బైబిల్ మనకు ఒక కొలతను ఇస్తుంది. దేవుడు ఎలా ఉంటాడో అది మనకు చెబుతుంది. దేవుని గూర్చి సరైన అభిప్రాయం లేకపోవుట విగ్రహారాధనకు దారితీస్తుంది. ఆయన కాని దానిని మనం ఆరాధిస్తున్నాము. ఒకడు పరలోకమునకు ఎలా వెళ్లగలడో బైబిల్ చెబుతుంది, మరియు అది సత్ క్రియలు చేయుట ద్వారా కాదు లేక బాప్తిస్మము పొందుట లేక వేరే ఏదో ఒకటి చేయుట ద్వారా కూడా కాదు (యోహాను 14:6; ఎఫెసీ. 2:1-10; యెషయా 53:6; రోమా. 3:10-18, 5:8, 6:23, 10:9-13). ఈ దారిలోనే, దేవుడు మనలను ఎంతగా ప్రేమించుచున్నాడో దేవుని వాక్యము మనకు చూపుతుంది (రోమా. 5:6-8; యోహాను 3:16). మరియు దానిని నేర్చుకొనుట ద్వారా ఆయనను మనం తిరిగి ప్రేమిస్తాము (1 యోహాను 4:19).
దేవుని సేవ చేయుటకు బైబిల్ మనలను బలపరుస్తుంది (2 తిమోతి 3:17; ఎఫెసీ. 6:17; హెబ్రీ. 4:12). పాపము నుండి మరియు దాని పరిణామముల నుండి ఎలా రక్షించబడాలో తెలుసుకొనుటలో అది మనకు సహాయం చేస్తుంది (2 తిమోతి 3:15). దేవుని వాక్యమును ధ్యానించి దానిలోని బోధలకు విధేయులగుట ద్వారా జీవితములో జయమును అనుభవించవచ్చు (యెహోషువ 1:8; యాకోబు 1:25). మన జీవితాలలో పాపమును కనుగొని దానిని అధిగమించుటకు దేవుని వాక్యము మనకు సహాయం చేస్తుంది (కీర్తనలు 119:9, 11). అది మన జీవితములో మార్గదర్శకం ఇచ్చి, మన గురువుల కంటే మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది (కీర్తనలు 32:8, 119:99; సామెతలు 1:6). అనవసరమైన విషయాలలో మన జీవితములోని సంవత్సరాలను వ్యర్థం చేయకుండా బైబిల్ మనలను కాపాడుతుంది (మత్తయి. 7:24-27).
పాపపు శోధనలలో బాధాకరంగా “ఇరికించు” ఆకర్షనియ్యమైన “ఎర”లో పడకుండా, ఇతరు చేయు పొరపాట్లలో స్వయంగా పడిపోకుండా వాటి నుండి నేర్చుకొనుటకు బైబిల్ అధ్యయనం మరియు చదువుట మనకు సహాయం చేస్తుంది. అనుభవం ఒక గొప్ప బోధకుడు, కాని పాపము నుండి నేర్చుకొనుట, అది ఘోరమైన బలమైన బోధకుడు. ఇతరుల పొరపాట్ల నుండి నేర్చుకొనుట చాలా ఉత్తమము. అనేక బైబిల్ స్వభావాల నుండి మనం నేర్చుకోవచ్చు, మరియు వారిలో కొందరు మన జీవితాలకు భావార్థక మరియు అభావార్థక ఆదర్శాలుగా ఉంటారు. ఉదాహరణకు, దావీదు, గొలియాతును జయించిన సందర్భంలో, ఆయన మన ముందు ఉంచు ప్రతిదాని కంటే దేవుడు గొప్పవాడని మనకు బోధిస్తాడు (1 సమూ. 17), అయితే బెత్షేబాతో తాను చేసిన వ్యభిచారం ఒక క్షనముండు పాపపు ఆనందం ఎంత ఘోరమైన పరిణామాలు తీసుకొనిరాగలదో మనకు బయలుపరుస్తుంది (2 సమూ. 11).
బైబిల్ కేవలం చదవటానికి మాత్రమే ఉపయోగపడు పుస్తకము కాదు. అది అన్వయించుటకు వీలుగా అధ్యయనం చేయవలసిన పుస్తకం. లేకపోతే, ఎలాంటి పోషణ లేకుండా నమలకుండా ఆహరం భుజించి దానిని మరలా కక్కుటతో సమానము. బైబిల్ దేవుని వాక్యము. అంటే, అది ప్రకృతి నియమాల వంటిది. దానిని మనం నిర్లక్ష్యం చేయవచ్చుగాని, కాని గురుత్వాకర్షణ నియమమును నిర్లక్ష్యం చేయుట వలెనే దానిని మన కీడు కొరకు చేస్తాము. మన జీవితాలలో బైబిల్ ఎంత ముఖ్యమో ఇది పరిపూర్ణంగా వక్కాణించదు. బైబిల్ అధ్యయనమును బంగారు గనులను త్రవ్వుటతో పోల్చవచ్చు. మనం చాలా తక్కువ కృషి చేసి, “కాలువలోని చిన్న చిన్న రాళ్లను” మాత్రమే తొలగిస్తే, మనకు కొంత బంగారపు ధూళి మాత్రమే దొరుకుతుంది. కాని మనం దానిని లోతుగా త్రవ్వుటకు ఎంతగా కృషి చేస్తే, ఆ కృషి నుండి అంత గొప్ప ఫలితాలను మనం పొందవచ్చు.
English
మనం బైబిల్ ఎందుకు చదవాలి/అధ్యయనం చెయ్యాలి?