ప్రశ్న
భార్య తన భర్తకు లోబడి ఉండాలా?
జవాబు
వివాహ పరంగా లోబడడం అనేది ప్రాముఖ్యమైన విషయం. స్పష్టమైన బైబిల్ ఆజ్ఞ ఇక్కడ కనిపిస్తుంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను” (ఎఫెసీ. 5: 22-24).
పాపం ఈ లోకంలో ప్రవేశించక మునుపు భర్తల యొక్క నాయకత్వపూ సూత్రం అప్పటికే ఉంది (1 తిమోతి 2:13). మొదట ఆదాము నిర్మింపబడ్డాడు, మరియు ఆదాముకు “సహాయం” చేయుటకుహవ్వయును నిర్మింపబడినది (ఆది. 2:18-20). దేవుడు ప్రపంచంలో అనేక విధములైన అధికారములను దేవుడు ఏర్పాటు చేసాడు: ప్రభుత్వము సమాజానికి న్యాయం చేకూర్చి మరియు రక్షణ కల్పించుటకు; దేవుని గొర్రెలను నడిపించుటకు మరియు మేపుటకు సేవకులను; తమ భార్యలను ప్రేమించి మరియు పోషించుటకు భర్తలను; మరియు తమ బిడ్డల్ని హేచ్చరించుటకు తండ్రులను. ప్రతి విషయంలో లోబడడం అవసరం: పౌరులు ప్రభుత్వానికి, గొర్రెలు కాపరికి, భార్య భర్తకు, బిడ్డ తండ్రికి.
“లోబడడం” అని అనువదించబడిన గ్రీకు పదం hupotasso, క్రియను కొనసాగించే రూపం. అంటే దేవునికి, ప్రభుత్వానికి, సేవకునికి, లేదా భర్తకు లోబడడం ఒకసారి చేసే పని కాదు. ఇది తరచు కొనసాగావలసిన వైఖరి, మరియు ఇది ప్రవర్తనకు మాదిరిగా ఉంటుంది.
వాస్తవానికి, మొదట, దేవునికి లోబడవలసిన బాధ్యత మనది, కేవలం ఈ మార్గం ద్వారానే ఆయనకు నిజముగా విధేయత చూపగలం (యాకోబు. 1:21; 4:7). మరియు ప్రతి క్రైస్తవుడు భయముతో ఒకనినొకడు లోబడియుండాలి (ఎఫెసీ. 5:21). కుటుంబంలో లోబడడం గురించి, 1 కొరింథీ. 11:2-3 చెప్తుంది భర్త క్రీస్తుకు లోబడాలి (క్రీస్తు తండ్రియైన దేవునికి లోబడినట్లు) మరియు భార్య భర్తకు లోబడాలి.
వివాహంలో భార్యభర్తల పాత్రల విషయమై ఈ రోజు మన ప్రపంచంలో చాల అపార్థం ఉంది. బైబిల్ ప్రకారంగా పాత్రలు మంచిగా అర్థం చేసుకొన్నప్పటికీ, మహిళల “విముక్తి” అనుకూలంగా అనేకమంది దానిని తిరస్కరించును ఎన్నుకొన్నారు ఫలితంగా కుటుంబ బంధం నలిగిపోయింది. దేవుని రూపకల్పనను ప్రపంచం తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఆ రూపకల్పనను దేవుని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలి.
లోబడుట చెడ్డ పదం కాదు. లోబడుట అనేది న్యూనతకు లేదా తక్కువ విలువకు ప్రతిబింబం కాదు. తన మంచితనంలో ఒక్క చిన్నదానిని కూడా వదలకుండా క్రీస్తు తరచు తండ్రి చిత్తానికి అప్పగించుకొన్నాడు (లూకా. 22:42; యోహాను 5:30).
భార్య తన భర్తకు లోబడవలసిన విషయమును గూర్చిన ప్రపంచ తప్పును ఎదుర్కోవాలంటే, ఎఫెసీ 5:22- 24లో ఉన్న క్రింది విషయాలను జాగ్రత్తగా గమనించాలి: 1) భార్య ఒక పురుషునికి లోబడాలి (తన భర్త), ప్రతి పురుషునికి కాదు. లోబడాలి అను నియమము పెద్ద సమాజంలో స్త్రీ యొక్క స్థానమును వ్యాపించదు. 2) వ్యక్తిగతంగా ప్రభువైన యేసుకు విధేయత చూపినట్లు భార్య తన భర్తకు ఇష్టపూర్వకంగా లోబడాలి. ఆమె యేసును ప్రేమిస్తుంది గనుక ఆమె తన భర్తకు లోబడాలి. 3) భార్య లోబడుట ఉదాహరణకు సంఘం క్రీస్తుకు లోబడడం. 4) భార్య సామర్థ్యాలు గురించి, ప్రతిభ గురించి, లేదా విలువ గురించి ఏమీ చెప్పబడలేదు; ఆమె తన సొంత భర్తకు లోబడాలను సత్యం ఆమె ఏ విధముచేతననైనను తక్కువ స్థాయికి చెందింది లేదా తక్కువ విలువ కలదని సుచించదు. “ప్రతి విషయములోను” అని తప్ప లోబడుట అను ఆజ్ఞకు మరి ఏ విధమైన షరతులు లేవు అని కూడా తెలుసుకోవాలి. కాబట్టి, భార్య లోబడక మునుపే భర్త సామర్థ్య మరియు ప్రజ్ఞా పరీక్షను అమలుచేయకూడదు. అనేక విధాలుగా రాణించుటకుబహుశా వాస్తవానికి ఆమె ఉత్తమమైన అర్హురాలు, కానీ తన భర్తకు లోబడుట ద్వార ఆమె ప్రభువు హెచ్చరికలను పాటించడం కోరుకుంది. అలా చేయుట ద్వార, భక్తిపరురాలైన భార్య అవిశ్వాసియైన తన భర్తను “మాటలచేత” కాక పరిశుద్ధమైన తన ప్రవర్తన ద్వార గెలుచుకుంటుంది (1 పేతు. 3:1).
లోబడుట అనేది ప్రేమపూర్వకమైన నాయకత్వానికి ఒక సహజమైన స్పందనగా ఉండాలి. క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా భర్త తన భార్యను ప్రేమించినప్పుడు (ఎఫెసీ. 5:25-33), లోబడుట అనేది భార్య నుండి తన భర్తకు సహజమైన స్పందన. కానీ, భర్త ప్రేమ కాక లేదా లేకుండా, “ప్రభువునకు వలె” లోబడాలి అని భార్య ఆజ్ఞాపించబడింది (వచనము 22). అంటే ఆమె దేవునికి విధేయత చూపుటకు–ఆయన ప్రణాళికను ఆమె అంగీకరించుటకు –ఫలితంగా ఆమె భర్తకు లోబడుతుంది. “ప్రభువునకు వలె” పోల్చిచూచుట కూడభార్య బాధ్యత కలిగియుండవలసిన అధిక అధికారమును ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. అందువలన, ఆమె భర్తకు “లోబడాలి” అను పేరుతో ఆమె పౌర చట్టానికి మరియు దేవుని ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపుటకు ఆమె దేనిక్రింద నిర్భంధించబడలేదు. సరియైన విషయాలకు మరియు చట్టపరమైన వాటికి మరియు దేవున్ని – గౌరవించు విషయాలకు ఆమె లోబడుతుంది. “లోబడుట” అను నియమమును దుర్వినియోగాలను సమర్ధించేందుకు వినియోగించడం వాక్యమును వక్రీకరించడం మరియు చెడును ప్రోత్సహించడం.
ఎఫెసీ 5లో భర్తకు భార్య లోబడడం భర్త స్వార్థంగా ఉండుటకు లేదా క్రూరంగా ఉండుటకు అంగీకరించదు. అతని ఆజ్ఞ ప్రేమించడం (వచనము 25), మరియు ఆ ఆజ్ఞను నెరవేర్చుటకు దేవుడు యెదుట అతడు బాధ్యుడు. భర్త తన అధికారమును జ్ఞానంతో, దయతో, మరియు లెక్క అప్పగించవలసిన దేవునికి భయముతో సాధకము చేయాలి.
సంఘము క్రీస్తు చేత ప్రేమించబడినట్లుగా, భార్య తన భర్త చేత ప్రేమించబడినప్పుడు, లోబడుట కష్టం కాదు. ఎఫెసీ 5:24 చెప్తుంది, “సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతివిషయములోను తమ పురుషులకు లోబడవలెను.” వివాహంలో, లోబడడం అనేది భర్తకు గౌరవం మరియు కీర్తి ఇచ్చి (ఎఫెసీ. 5:33) మరియు లోపాన్ని సంపూర్తి చేయడం. కుటుంబం ఏ విధంగా పనిచేయాలి అనుటకు ఇది దేవుని యొక్క జ్ఞానమైన ప్రణాళిక.
వ్యాఖ్యాన కర్త Matthew Henry వ్రాసాడు, “స్త్రీ ఆదాము ప్రక్కలో నుండి చేయబడింది. అతినిపై అధికారము చేయుటకు ఆమె తల నుండి తీయబడలేదు, ఆయన చేత త్రొకివేయబడుటకు ఆయన పాదముల నుండి తీయబడలేదు, కానీ ఆయనతో సమానంగా ఉండుటకు ప్రక్కలో నుండి తీయబడింది, ఆయనచే రక్షించబడుటకు చేతిక్రింద నుండి తీయబడింది, మరియు ప్రేమింపబడుటకు హృదయము దగ్గరలో తీయబడింది.” ఎఫెసీ 5:19-33 లో భార్యాభర్తలకు ఇవ్వబడిన ఆజ్ఞల తక్షణ సందర్భం, ఆత్మీయ నింపుదలను కలిగియుంటుంది. ఆత్మ నింపుదల కలిగిన విశ్వాసులు ఆరాధించేవారిగా ఉండాలి (5:19), కృతజ్ఞులుగా ఉండాలి (5:20), మరియు లోబడాలి (5:21). ఆత్మీయ నింపుదల అను ఆలోచనపై పౌలు తన చర్చను కొనసాగించాడు మరియు 22- 24 వచనములలో దానిని భార్యలకు వినియోగించాడు. భార్య తన భర్తకు లోబడాలి, స్త్రీ తక్కువ స్థాయి చెందిందని కాదు (బైబిల్ ఎప్పుడూ కూడా అది బోధించదు), కానీ దేవుడు వివాహ సంబంధము ఆ విధంగా కొనసాగబడుటకు రూపించాడు.
English
భార్య తన భర్తకు లోబడి ఉండాలా?