నిత్యజీవము కలుగుతుందా?ప్రశ్న: నిత్యజీవము కలుగుతుందా?

సమాధానము:
దేవునికి వ్యతిరేకముగా: రోమా (3.23) ప్రకారము “అందరూ పాపంచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు”. మనమందరము దేవునికి యిష్టము లేని పనులు చేసి శిక్షకు పాత్రులుగా ఉన్నాము. చివరకి మనం శాశ్వతమైన దేవునికి విరుద్ధ౦గా పాపంచేసినందుకు మనకు ఈ శాశ్వతమైన శిక్ష చాలు. రోమా (6:23) “ప్రకారము పాపం వలన వచ్చు అపరాధ౦ మరణం, కాని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము”.

ఎలాగైతే నేమి, (1 పేతురు 2.22) లో చెప్పినట్లుగా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మరియు ఆదియందు వాక్యముండెను,ఆ వాక్యము ఆయన రూపమై మనుషుల మధ్య నివసించెను, (యోహాను 1. 1, 14) “అద్వితీయ కుమారునిగా పుట్టి మన పాపములకై వెల చెల్లించెను. దేవుడు తన ప్రేమను ఇలా ప్రకటించెను.. మనము ఇంకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను”. (2 కొరింథి 5: 21) లో చెప్పినట్లుగా పాపమెరుగని ఆయన మనకొరకు పాపమై, మనము అనుభవించవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకుని శిలువ మీద చనిపోయెను.(1 కొరింథి 15.1-4) లో చెప్పినట్లుగా మూడవ దినమున మరణము నుండి లేచి మరణము మీద మరియు పాపము మీద విజయము సాధించానని నిరూపించారు. (1పేతురు 1:3) “ఆయన గొప్ప కృప చేత మనకు నిత్యజీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు మృతులలో నుండి తిరిగిలేచెను”.

అ.కా. (3.19) ప్రకారము మనము మారుమనస్సు పొంది విశ్వాసముతో ఆయనవైపు తిరిగినఎడల—ఆయన ఎవరు?, ఆయన ఏం చేసారు?, మరియు ఎందుకు రక్షణ ఇచ్చారు? అంటే మన పాపములు తుడిచివేయబడు నిమిత్తమై అని అర్థ౦. మనము ఆయన యందు విశ్వాసము ఉ౦చి, మన పాపములకై శిలువపై చనిపోయాడని నమ్మితే, మనము క్షమించబడి మరియు పరలోకములో మన కొరకు వాగ్దానము చేసిన నిత్యజీవమును అందుకోగలము. (యోహాను 3.16) లో చెప్పినట్లుగా “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”. ( రోమా 10:9) ప్రకారము “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు. క్రీస్తు శిలువలో సమస్తము పూర్తి చేసాడు అన్న విశ్వాసము ఒక్కటే నిత్యజీవానికి దారిచూపిస్తుంది. ఎఫెసి (2:8-9) “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవునివరమే. అది క్రియలవలన కలిగినది కాదు. కాబట్టి ఎవడును అతిశయింప వీలులేదు.

మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఇక్కడ నమూనా ప్రార్థన కలదు. గుర్తుంచుకో౦డి, ప్రార్థన చెప్పటం వలన లేదా ఇంకా ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. క్రీస్తుని నమ్ముట ద్వారా మాత్రమే అనగా ఆ నమ్మకమే మీ పాపము నుండి రక్షిస్తుంది. ఈ ప్రార్థన మీకు యిచ్చిన రక్షణ గురించి స్తుతి చెల్లించటానికి మరియు ఆయనయందు మీకున్న విశ్వాసాన్ని వివరించి చెప్పే ఒక దారిమాత్రమే. “దేవా, నాకు తెలుసు, నేను మీకు విరోధముగా పాపము చేసి శిక్షకు పాత్రుడనయ్యాను. కాని క్రీస్తు నా శిక్షను తీసుకుని విశ్వాసం ద్వారా ఆయన ఇచ్చిన క్షమాపణకు అర్హుడనయ్యాను. నా నమ్మకాన్ని మీరు ఇచ్చిన రక్షణలో ఉ౦చుతాను. మీ అద్భుతమైన కృప మరియు క్షమాపణ –శాశ్వతమైన వరము నిత్యజీవము కొరకు ధన్యవాదములు. ఆమెన్".

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.


తెలుగు హొం పేజికి తిరిగి రండి


నిత్యజీవము కలుగుతుందా?