ప్రశ్న
క్షమాపణ పొందితివా? దేవుని నుండి నేను క్షమాపణ ఎలా పొందగలను?
జవాబు
“కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది,” అని అపొ. 13:38 ప్రకటిస్తుంది.
క్షమాపణ అంటే ఏమిటి మరియు అది నాకు ఎందుకు కావలెను?
“క్షమాపణ” అనగా పలకను శుభ్రంగా తుడుచుట, క్షమించుట, అప్పును రద్దుచేయుట. మనం ఎవరికైనా తప్పు చేసిన యెడల, ఆ అనుబంధమును పునరుద్ధరించుటకు వారి క్షమాపణ కోరతాము. క్షమాపణ అనునది ఎదుటి వ్యక్తి క్షమాపణకు యోగ్యుడు కాబట్టి ఇవ్వబడదు. క్షమాపణకు ఎవ్వరు యోగ్యులు కారు. క్షమాపణ అనునది ప్రేమ, కరుణ, మరియు కృపతో కూడిన కార్యము. క్షమాపణ అనగా ఎదుటి వ్యక్తి మీకు ఏమి చేసినను, ఆ వ్యక్తికి విరోధముగా మనస్సులో ఏమి ఉంచుకొనకూడదని మీరు తీసుకొనే నిర్ణయం.
మనమంతా దేవుని నుండి క్షమాపణ పొందవలసియున్నామని బైబిల్ చెబుతుంది. మనమంతా పాపము చేసితిమి. “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని ప్రసంగి 7:20 ప్రకటిస్తుంది. “మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు” అని 1 యోహాను 1:8 చెబుతుంది. పాపమంతా తుదకు దేవునికి విరోధముగా తిరుగుబాటు అవుతుంది (కీర్తనలు 51:4). అందువలన, మనకు దేవుని క్షమాపణ ఖచ్చితముగా అవసరము. మన పాపములు క్షమించబడనియెడల, మన పాపముల యొక్క పరిణామాలను చెల్లిస్తూ శ్రమపొందుతు నిత్యత్వమును గడుపుతాము (మత్తయి. 25:46; యోహాను 3:36).
క్షమాపణ-నేను ఎలా పొందగలను?
దేవుడు ప్రేమ మరియు కరుణ గలవాడు - ఆయన మన పాపములను క్షమించాలని ఆశించుచున్నాడు! “...యెవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు” అని 2 పేతురు 3:9 చెబుతుంది. దేవుడు మనలను క్షమించాలని ఆశించెను కాబట్టి, మన క్షమాపణకు వెల చెల్లించెను.
మన పాపములకు ఏకైక న్యాయమైన పరిహారం మరణం. “పాపమువలన వచ్చు జీతము మరణము” అని రోమా. 6:23 యొక్క మొదటి భాగము తెలియజేయుచున్నది. మన పాపముల వలన మనం పొందినది నిత్య మరణము. దేవుడు, తన పూర్ణ ప్రణాళికలో, మానవుడాయెను - యేసు క్రీస్తు (యోహాను 1:1, 14). మనం పొందవలసిన మరణం అను జీతమును తనపై వేసుకొని యేసు సిలువపై మరణించెను. “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను” అని 2 కొరింథీ. 5:21 మనకు బోధిస్తుంది. మన శిక్షను తనపై వేసుకొని యేసు సిలువపై మరణించెను! దేవునిగా, యేసు యొక్క మరణము సర్వమానవాళి పాపములకు క్షమాపణను అందించెను. “ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు” అని 1 యోహాను 2:2 ప్రకటిస్తుంది. పాపము మరియు మరణముపై తన విజయమును ప్రకటిస్తూ యేసు మరణము నుండి తిరిగిలేచెను (1 కొరింథీ. 15:1-28). దేవునికి మహిమ, యేసు క్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్ధానము ద్వారా, రోమా. 6:23 యొక్క రెండవ భాగము సత్యము, “...అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము.”
మీ పాపములు క్షమించబడాలని మీరు కోరుచున్నారా? మీలో మీ నుండి దూరము కాని పాప భారమను భావన ఉందా? మీ రక్షకునిగా యేసు క్రీస్తును మీరు నమ్మినయెడల, మీకు పాప క్షమాపణ లభిస్తుంది. “దేవుని కృపామహాదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది” అని ఎఫెసీ. 1:7 చెబుతుంది. మనం క్షమించబడుటకు, యేసు మన ఋణమును చెల్లించెను. మీరు చెయ్యవలసిందంతా, యేసు ద్వారా మిమ్మును క్షమించమని దేవుని అడిగినయెడల- మీ క్షమాపణకు వెల చెల్లించుటకు యేసు మరణించెను అని నమ్మి-ఆయన మిమ్మును క్షమించును! యోహాను 3:16-17లో ఈ గొప్ప సందేశము ఉన్నది, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.”
క్షమాపణ-ఇది అంత సులభమా?
అవును ఇది సులభమే! మీరు దేవుని నుండి క్షమాపణ సంపాదించలేరు. దేవుడు మీకిచ్చు క్షమాపణకు మీరు వెల చెల్లించలేరు. మీరు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి దేవుని నుండి క్షమాపణ పొందగోరినయెడల, ఈ ప్రార్థన చెయ్యవచ్చు. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”
మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.
English
క్షమాపణ పొందితివా? దేవుని నుండి నేను క్షమాపణ ఎలా పొందగలను?