settings icon
share icon
ప్రశ్న

నేను దేవునితో ఎలా సమాధానపడగలను?

జవాబు


దేవునితో “సమాధాన”పడుటకు, మొదటిగా “సమస్య” ఏమిటో మనం గ్రహించాలి. దీనికి జవాబు పాపము. “మేలుచేయువారెవారును లేరు, ఒక్కడైనను లేడు” (కీర్తనలు. 14:3). మనం దేవుని ఆజ్ఞకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; మనమందరము “గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి” (యెషయా 53:6).

దుర్వార్త ఏమనగా పాపము యొక్క జీతము మరణము. “పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.” (యెహెజ్కేలు 18:4). సువార్త ఏమనగా ప్రేమించు దేవుడు మనకు రక్షణ ఇచ్చుటకు మనలను వెంబడించెను. “నశించినదానిని వెదకి రక్షించుట” (లూకా 19:10) ఆయన ఉద్దేశమని యేసు ప్రకటించెను, మరియు సిలువపై ఆయన మరణించినప్పుడు పలికిన “సమాప్తమాయెను” అను మాట ద్వారా తన ఉద్దేశము నెరవేరెనని ఆయన ప్రకటించెను (యోహాను. 19:30).

మీ పాపమును ఒప్పుకొనుటతో దేవునితో సరైన అనుబంధం కలిగియుండు ప్రక్రియ ఆరంభమవుతుంది. మీ పాపమును వినయముతో దేవుని ఎదుట ఒప్పుకొనుట తరువాత వస్తుంది (యెషయా 57:15). “ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” (రోమా. 10:10).

ఈ పశ్చాత్తాపము విశ్వాసముతో జతకలసియుండాలి- ముఖ్యముగా, యేసు యొక్క బలిదాన మరణం మరియు అద్భుత పునరుత్ధానం ఆయనను నీ రక్షకుడగుటకు అర్హునిగా చేస్తుందను విశ్వాసం. “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు” (రోమా. 10:9). యోహాను 20:27; అపొ. 16:31; గలతీ. 2:16; 3:11, 26; మరియు ఎఫెసీ. 2:8 వంటి అనేక ఇతర వాక్య భాగములు కూడ విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తాయి.

దేవునితో సమాధానపడుట అనునది ఆయన నీ కొరకు చేసిన కార్యమునకు నీ ప్రతిస్పందన. ఆయన రక్షకుని పంపెను, నీ పాపమును తీసివేయుటకు ఆయన బలిని అర్పించెను (యోహాను 1:29), మరియు ఆయన నీకు వాగ్దానమును ఇచ్చుచున్నాడు: “అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు” (అపొ. 2:21).

తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము పశ్చాత్తాపం మరియు క్షమాపణకు ఒక అందమైన ఉదాహరణ (లూకా. 15:11-32). చిన్న కుమారుడు తన తండ్రి యొక్క బహుమానమును అవమానకరమైన పాపములో వృద్ధా చేసెను (13వ వచనం). అతడు తన తప్పును అంగీకరించినప్పుడు, ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకొనెను (18వ వచనం). అతడు మరెన్నటికి కుమారునిగా ఎంచబడడని ఊహించెను (19వ వచనం), కాని అతని ఆలోచన తప్పు. తిరిగివచ్చిన తప్పిపోయిన కుమారుని తండ్రి మునుపెన్నటి కంటె ఎక్కువగా ప్రేమించెను (20వ వచనం). సమస్తము క్షమించబడెను, మరియు విందు జరిగెను (24వ వచనం). దేవుడు తన వాగ్దానములను నిలబెట్టుకొనుటలో మంచివాడు, క్షమించెదనని చేసిన వాగ్దానముతో సహా. “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” (కీర్తనలు. 34:18).

మీరు దేవునితో సమాధానపడాలని కోరితే, ఈ చిన్న ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నేను దేవునితో ఎలా సమాధానపడగలను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries