నేను మరణించినప్పుడు నేను పరలోకానికి వెళ్తానని నేను ఎలా నిశ్చయంగా తెలిసికోగలను?ప్రశ్న: నేను మరణించినప్పుడు నేను పరలోకానికి వెళ్తానని నేను ఎలా నిశ్చయంగా తెలిసికోగలను?

సమాధానము:
మీకు నిత్యజీవితం ఉందని మరియు మీరు మరణించినప్పుడు మీరు పరలోకానికి వెళ్తారని మీకు తెలుసా? మీరు నిశ్చయంగా ఉండాలని దేవుడు కోరతాడు! “దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అని బైబిల్ సెలవిస్తుంది (1యోహాను 5:13). సరిగ్గా ఇప్పుడే మీరు దేవుని ముందు నిలుచుని ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని “ నేను నిన్ను పరలోకంలోనికి ఎందుకు అనుమతించనీయాలి?” అని అడిగేడనుకుందాం. మీరేమిటి చెప్తారు? ఏ ప్రత్యుత్తరం ఇవ్వాలో అని మీకు తెలియకపోవచ్చు. దేవుడు మనలని ప్రేమిస్తాడని మరియు మనం నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతామో అని మనం నిశ్చయంగా తెలిసికోగల ఒక దారిని ఆయన చూపించేడనీ మనం తెలిసికోవడం అవసరం. బైబిల్ దీన్ని ఈ విధంగా చెప్తుందిః “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”(యోహాను 3:16).

మనలని పరలోకానికి దూరంగా ఉంచిన సమస్యని మనం మొదట అర్థం చేసుకోవాలి. సమస్య ఇది- దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండటాన్ని మన పాపపూరితమైన స్వభావం అడ్డగిస్తుంది. మనమందరం స్వభావపూర్వకంగా మరియు ఎంపికకొద్దీ పాపులం. “ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు”(రోమీయులు 3:23). మనలని మనం రక్షించుకోలేం. “మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవీలు లేదు”(ఎఫసీయులు 2:8-9). మనము మరణానికి మరియు పాతాళలోకమునకు పాత్రులము. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము” (రోమీయులు 6:23). దేవుడు పరిశుద్ధుడు మరియు న్యాయమైనవాడు మరియు పాపాన్ని శిక్షించవలిసినవాడు అయినప్పటికీ ఆయన మనలని ప్రేమించి మన పాపానికి క్షమాపణ యొక్క వీలుని కల్పిస్తాడు. “యేసు-నేనే మార్గమును, సత్యమును, జీవమును; నాద్వారానే తప్ప యెవడును తండ్రి వద్దకి రాడు” అని యేసు చెప్పేడు (యోహాను 14:6). యేసు మననిమిత్తము శిలువపైన మరణించేడుః “ ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయమై చంపబడియు....(1 పేతురు3:18). యేసు మృతులలోనుండి పునరుద్ధానుడయెను. “ ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను” (రోమీయులు 4;25).

కాబట్టి అసలు ప్రశ్నకి తిరిగి వద్దాము. నేను మరణించినప్పుడు నేను పరలోకానికి పోతానని నేను ఎలా నిశ్చయపరచుకోగలను?” సమాధానం ఇది- “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము; అప్పుడు నీవును నీఇంటివారును రక్షణ పొందుదురు(కార్యములు 16:31). “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12). మీరు నిత్యజీవమును ఉచితవరముగా పొందగలరు. “ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” (రోమీయులు 6:23). “గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకునేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు చెప్పెను(యోహాను 10:10). ఆయన ఇలా వాగ్దానం చేసేడు కనుక మీరు యేసుతోడి పరలోకంలో నిత్యత్వాన్ని గడపగలరు “ నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” (యోహాను 14:3).

మీ రక్షకునిగా మీరు క్రీస్తుని అంగీకరించాలనుకుని దేవుని వద్దనుండి క్షమాపణని పొందాలంటే మీరు ప్రార్థించవలిసిన ఒక ప్రార్థన ఇక్కడ ఉంది. ఈ ప్రార్థనని కానీ లేక ఇంకే ఇతర ప్రార్థనని కానీ పలకడం మిమ్మల్ని రక్షించదు. పాపం నుంచి మిమ్ము రక్షించేది క్రీస్తునందలి విశ్వాసం మాత్రమే. ఈ ప్రార్థన దేవునిపైన మీకు ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికీ ఒక మార్గం మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షని పాత్రుడనని నాకు తెలుసు. కానీ ఆయనయందు విశ్వాసం వల్ల నేను రక్షింపబడటానికి నేను పాత్రుడనయిన శిక్షని యేసుక్రీస్తు తీసుకున్నాడు. నీ అద్భుతమయిన మహిమకి మరియు క్షమాపణకి నీకు కృతజ్ఞతలు- నిత్యజీవితం యొక్క వరం! అమేన్‌”

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.


తెలుగు హొం పేజికి తిరిగి రండి


నేను మరణించినప్పుడు నేను పరలోకానికి వెళ్తానని నేను ఎలా నిశ్చయంగా తెలిసికోగలను?